ఇలా మొదలైనది
ఇది సుమారు ఏభై ఏళ్ళనాటి గాథ. మెడికలు కాలేజీలో సీటంటే అప్పటికీ, ఇప్పటికీ కూడా కొంచెం కృత్యాద్యవస్థయే. కాని, ఆ రోజుల్లో సీటు రాకపోతే, హైకోర్టులో రిట్టు వెయ్యడంలేదు; మార్కు పెట్టిన రూపాయి నోట్ల గోలా లేదు. మార్గాంతరాలు సీట్లు సంపాదించుటకు ఉండేవి. వాటిని చర్చించడం కోసమే, మద్రాసు మెడికలు కాలేజీలో, సీటురాని నేనూ, రావూ, చెట్టీ ఒక మహాసభ చేశాము, కాలేజీ కాంపౌండులో, మర్రిచెట్టు క్రింద, ఒక జూలై రోజు మధ్యాహ్నం.
నాకు సీటు రాకపోవడం నా బావమరది పొరపాటువల్ల. నేను ఏదో అర్జంటు పనిమీద వెడుతూ, సీటుకు దరఖాస్తు కవరులో పెట్టి, రిజిష్టరు చెయ్యమని నా బావమరిదికి ఇచ్చాను. ఆయన “మెడికల్ కాలేజి - రాజమండ్రి" అని అడ్రసు రాసి రిజిష్టరు చేశాడు. పోస్టాఫీసు వారు “రాజమండ్రిలో మెడికల్ కాలేజీ లేదు" అని వ్రాసి, తిరగ్గొట్టారు. ఇది తిరిగి వచ్చేసరికి, దరఖాస్తు పంపడానికి, పెట్టిన పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. ఈ సంగతి అంతా మనవి చేస్తూ తిరిగి దరఖాస్తు పంపాను. కాని మెడికల్ కాలేజీ రూల్సులో విద్యార్థి బావమరిది పొరపాటుకు పరిహారం లేదు. కాబట్టి సీటు లేదన్నారు. రావు ఇంటర్ మీడియట్ పరీక్ష హిస్టరీ, లాజిక్కుతో ప్యాసయినాడు. హిస్టరీతో ప్యాసయినవాళ్లను చేర్చుకోకూడదని, మెడికల్ కాలేజీలో లేగాని, ఆ రోజుల్లో రూల్సు అట్టే అడ్డం వచ్చేవి కావు, పలుకుబడికి లోబడేవి...................
ఇలా మొదలైనది ఇది సుమారు ఏభై ఏళ్ళనాటి గాథ. మెడికలు కాలేజీలో సీటంటే అప్పటికీ, ఇప్పటికీ కూడా కొంచెం కృత్యాద్యవస్థయే. కాని, ఆ రోజుల్లో సీటు రాకపోతే, హైకోర్టులో రిట్టు వెయ్యడంలేదు; మార్కు పెట్టిన రూపాయి నోట్ల గోలా లేదు. మార్గాంతరాలు సీట్లు సంపాదించుటకు ఉండేవి. వాటిని చర్చించడం కోసమే, మద్రాసు మెడికలు కాలేజీలో, సీటురాని నేనూ, రావూ, చెట్టీ ఒక మహాసభ చేశాము, కాలేజీ కాంపౌండులో, మర్రిచెట్టు క్రింద, ఒక జూలై రోజు మధ్యాహ్నం. నాకు సీటు రాకపోవడం నా బావమరది పొరపాటువల్ల. నేను ఏదో అర్జంటు పనిమీద వెడుతూ, సీటుకు దరఖాస్తు కవరులో పెట్టి, రిజిష్టరు చెయ్యమని నా బావమరిదికి ఇచ్చాను. ఆయన “మెడికల్ కాలేజి - రాజమండ్రి" అని అడ్రసు రాసి రిజిష్టరు చేశాడు. పోస్టాఫీసు వారు “రాజమండ్రిలో మెడికల్ కాలేజీ లేదు" అని వ్రాసి, తిరగ్గొట్టారు. ఇది తిరిగి వచ్చేసరికి, దరఖాస్తు పంపడానికి, పెట్టిన పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. ఈ సంగతి అంతా మనవి చేస్తూ తిరిగి దరఖాస్తు పంపాను. కాని మెడికల్ కాలేజీ రూల్సులో విద్యార్థి బావమరిది పొరపాటుకు పరిహారం లేదు. కాబట్టి సీటు లేదన్నారు. రావు ఇంటర్ మీడియట్ పరీక్ష హిస్టరీ, లాజిక్కుతో ప్యాసయినాడు. హిస్టరీతో ప్యాసయినవాళ్లను చేర్చుకోకూడదని, మెడికల్ కాలేజీలో లేగాని, ఆ రోజుల్లో రూల్సు అట్టే అడ్డం వచ్చేవి కావు, పలుకుబడికి లోబడేవి...................© 2017,www.logili.com All Rights Reserved.