జీవితంలో సాధించడానికి ఒక ఉన్నత లక్ష్యం లేకపోతే మనిషికి పశువుకు తేడా ఏమీ ఉండదు. అనంత ఆత్మశక్తి ప్రతి వ్యక్తిలోనూ నిక్షిప్తమై ఉంది. ఈ శక్తిని అభివ్యక్తం చెయ్యడానికి తగిన ఆశయాలు ఉన్నప్పుడే అది ప్రకాశించగలదు. సాధించడానికి ఒక ఉన్నత లక్ష్యం లేనివాళ్ళ జీవితాలు వాళ్ళ సన్నిహితుల దినచార్యలతో నిర్దేశించబడతాయి. ఒక లక్ష్యాన్ని సాధించడానికి అది లౌకిక పరమైనదైనా, ఆధ్యాత్మిక పరమైనదైనా అనుసరించ వలసిన పద్ధతులు దాదాపు ఒకేవిధంగా ఉంటాయి. కానీ లౌకిక లక్ష్యాలను సాధించే విషయంలో చాలామంది అత్యంత శ్రద్ధ వహించి ఎంతో క్రమశిక్షణతో రేయింబవళ్ళు శ్రమపడుతున్నా, ఆధ్యాత్మిక లక్ష్యాల విషయానికి వచ్చే సరికి పద్ధతులలో క్రమశిక్షణను పూర్తిగా విస్మరిస్తున్నారు.
ధీరులుగా తీర్చిదిద్దే మతాన్ని ప్రభోదిస్తూ స్వామి వివేకానంద మనకు లౌకిక, ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించే విషయంలో అనేక స్ఫూర్తిదాయకమైన సందేశాలను ఇచ్చారు. రచయిత శ్రీ ఏ ఆర్ కే శర్మ స్వామి వివేకానంద సందేశాలను ఆధారంగా తీసుకొని ఉభయ లోకాలలో ఏ విధంగా పురోగమించాలో అతి చక్కగా వివరించారు. యువతరం ఈ పుస్తకంలో వివరించబడిన స్వామీజీ సందేశాలను చక్కగా ఆకళింపు చేసుకొని, లౌకిక లక్ష్యాలలో మాత్రమే గాక ఆధ్యాత్మిక లక్ష్యాలలో కూడా ప్రగతిని సాధించగలరని ఆశిస్తూ...
- స్వామి జ్ఞానదానంద
జీవితంలో సాధించడానికి ఒక ఉన్నత లక్ష్యం లేకపోతే మనిషికి పశువుకు తేడా ఏమీ ఉండదు. అనంత ఆత్మశక్తి ప్రతి వ్యక్తిలోనూ నిక్షిప్తమై ఉంది. ఈ శక్తిని అభివ్యక్తం చెయ్యడానికి తగిన ఆశయాలు ఉన్నప్పుడే అది ప్రకాశించగలదు. సాధించడానికి ఒక ఉన్నత లక్ష్యం లేనివాళ్ళ జీవితాలు వాళ్ళ సన్నిహితుల దినచార్యలతో నిర్దేశించబడతాయి. ఒక లక్ష్యాన్ని సాధించడానికి అది లౌకిక పరమైనదైనా, ఆధ్యాత్మిక పరమైనదైనా అనుసరించ వలసిన పద్ధతులు దాదాపు ఒకేవిధంగా ఉంటాయి. కానీ లౌకిక లక్ష్యాలను సాధించే విషయంలో చాలామంది అత్యంత శ్రద్ధ వహించి ఎంతో క్రమశిక్షణతో రేయింబవళ్ళు శ్రమపడుతున్నా, ఆధ్యాత్మిక లక్ష్యాల విషయానికి వచ్చే సరికి పద్ధతులలో క్రమశిక్షణను పూర్తిగా విస్మరిస్తున్నారు. ధీరులుగా తీర్చిదిద్దే మతాన్ని ప్రభోదిస్తూ స్వామి వివేకానంద మనకు లౌకిక, ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించే విషయంలో అనేక స్ఫూర్తిదాయకమైన సందేశాలను ఇచ్చారు. రచయిత శ్రీ ఏ ఆర్ కే శర్మ స్వామి వివేకానంద సందేశాలను ఆధారంగా తీసుకొని ఉభయ లోకాలలో ఏ విధంగా పురోగమించాలో అతి చక్కగా వివరించారు. యువతరం ఈ పుస్తకంలో వివరించబడిన స్వామీజీ సందేశాలను చక్కగా ఆకళింపు చేసుకొని, లౌకిక లక్ష్యాలలో మాత్రమే గాక ఆధ్యాత్మిక లక్ష్యాలలో కూడా ప్రగతిని సాధించగలరని ఆశిస్తూ... - స్వామి జ్ఞానదానంద© 2017,www.logili.com All Rights Reserved.