'నిర్భయత్వం' స్వామి వివేకానందుని నవీన సందేశం. "నిర్భయులుగా ఉండండి. ఈ లోకంలో ఏదైనా పాపం అంటూ ఉంటే అది భయమే" అన్న స్వామి వివేకానందుని ఉత్తేజ ప్రభోదాలను దృష్టిలో ఉంచుకొని రాసిన ఈ పుస్తకం Swami Vivekananda's Leadership Formulas to Become Couraeous. ప్రతీ నాయకుడుకు ఉండవలసిన గొప్ప లక్షణం ధైర్యం. కానీ ఆ ధైర్యం ఎలాంటిది? ఉదాహరణకు నేను బలవంతుణ్ణి అనే ధైర్యం ఇతరుల మీద అధికారం చెలాయించడానికి ఉపయోగించి దాన్ని దుర్వినియోగం పరచువచ్చు. కానీ ధైర్యం అనేది భౌతిక స్థాయిలోనే కాకుండా మానసిక, నైతిక స్థాయిలతో కూడినదై ఉండాలి. అదే నిజమైన నిర్భయత్వం.
భౌతిక ధైర్యంతో చాలా మంది విజయాన్ని సాదించాలని ఆలోచిస్తుంటారు కానీ ధైర్యనికి కావల్సిన లక్షణాల గురించి రచయిత ఈ పుస్తకంలో చక్కగా వివరించారు. ధైర్యం అంటే కండరాలతో కూడిన శారీరక బలం కాదు. సాహసం, ఓర్పు నీతి నిజాయితీల ఆచరణ, మేధాశక్తి, ఈ నాలుగు కలిపిన ధైర్యంతోనే జీవితంలో విజయాన్ని సాధించగలమని ఉదాహరణలతో రచయిత వర్ణించిన తీరు అమోఘం, ప్రతీ అధ్యాయాన్ని కూలంకషంగా వివరిస్తూ చక్కని ఉదాహరణలతో, చిత్రాలతో వివరించడం ద్వారా పాఠకులకు ఇట్టే బోధపడుతుంది.
నేటి పౌరులను రేపటి నాయకులుగా తయారు చేయడానికి ఈ పుస్తకం తప్పక సహకరిస్తుంది.
- ఎ.ఆర్.కె. శర్మ
'నిర్భయత్వం' స్వామి వివేకానందుని నవీన సందేశం. "నిర్భయులుగా ఉండండి. ఈ లోకంలో ఏదైనా పాపం అంటూ ఉంటే అది భయమే" అన్న స్వామి వివేకానందుని ఉత్తేజ ప్రభోదాలను దృష్టిలో ఉంచుకొని రాసిన ఈ పుస్తకం Swami Vivekananda's Leadership Formulas to Become Couraeous. ప్రతీ నాయకుడుకు ఉండవలసిన గొప్ప లక్షణం ధైర్యం. కానీ ఆ ధైర్యం ఎలాంటిది? ఉదాహరణకు నేను బలవంతుణ్ణి అనే ధైర్యం ఇతరుల మీద అధికారం చెలాయించడానికి ఉపయోగించి దాన్ని దుర్వినియోగం పరచువచ్చు. కానీ ధైర్యం అనేది భౌతిక స్థాయిలోనే కాకుండా మానసిక, నైతిక స్థాయిలతో కూడినదై ఉండాలి. అదే నిజమైన నిర్భయత్వం. భౌతిక ధైర్యంతో చాలా మంది విజయాన్ని సాదించాలని ఆలోచిస్తుంటారు కానీ ధైర్యనికి కావల్సిన లక్షణాల గురించి రచయిత ఈ పుస్తకంలో చక్కగా వివరించారు. ధైర్యం అంటే కండరాలతో కూడిన శారీరక బలం కాదు. సాహసం, ఓర్పు నీతి నిజాయితీల ఆచరణ, మేధాశక్తి, ఈ నాలుగు కలిపిన ధైర్యంతోనే జీవితంలో విజయాన్ని సాధించగలమని ఉదాహరణలతో రచయిత వర్ణించిన తీరు అమోఘం, ప్రతీ అధ్యాయాన్ని కూలంకషంగా వివరిస్తూ చక్కని ఉదాహరణలతో, చిత్రాలతో వివరించడం ద్వారా పాఠకులకు ఇట్టే బోధపడుతుంది. నేటి పౌరులను రేపటి నాయకులుగా తయారు చేయడానికి ఈ పుస్తకం తప్పక సహకరిస్తుంది. - ఎ.ఆర్.కె. శర్మ© 2017,www.logili.com All Rights Reserved.