నా మాట
"అన్నీ బాగానే ఉన్నాయి కానీ అబ్బాయికి సినిమాలు చూసే అలవాటు లేకపోవడం ఏంటి?" అంది అమ్మాయి తల్లి. అప్పుడే పెళ్ళిచూపులు అయి ఇల్లు తెలిపిన పడింది. మిగిలిన స్వీటూ, హాటూ తింటూ సంబంధం గురించిన మంచీ చెడ్డా వివరంగా మాట్లాడుకునేందుకు అదే సమయం మరి.
"అయితే ఏమైంది? అప్పుడప్పుడు చూస్తాడన్నారు కదా" సమర్థించుకుంటూ వస్తున్నాడు ఆ సంబంధం తెచ్చిన మనిషి. “ఏమో మరి. కనీసం సినిమాలక్కూడా వెళ్ళనివాడు పిల్ల సరదాలేం తీరుస్తాడు. మరీ చాదస్తపు రకం అనిపిస్తోంది." అందావిడ కచ్చితంగా.
ఒక పదేళ్ళ క్రితం గోదావరి జిల్లాల్లో ఒకచోట మా బంధువుల ఇంట్లో జరిగిన సంఘటన ఇది. ఆరోజు ఆవిడ అన్న మాట మిగిలినవారు ఎంత సీరియస్గా తీసుకున్నారో గుర్తులేదు కానీ నాకు మాత్రం తెలుగు సినిమాలు ఎంతగా సంస్కృతిలోకి, సమాజంలోకి చొచ్చుకుని వెళ్ళిపోయాయన్నదానికి ఒక కొలబద్దగా ఉంటుంది ఆ మాట. కూతురికి వచ్చిన సంబంధం మంచిదో కాదో తెలియడానికి ఆవిడకు ఉన్న ముఖ్యమైన లెక్కల్లో ఎంత తరచుగా సినిమాకి వెళ్తాడు అన్నది ముఖ్యమైన లెక్క కావడం ఈ ప్రాంతపు మట్టిలో ఇంకిపోయిన సినిమా ప్రేమకు నిదర్శనం.....................
నా మాట "అన్నీ బాగానే ఉన్నాయి కానీ అబ్బాయికి సినిమాలు చూసే అలవాటు లేకపోవడం ఏంటి?" అంది అమ్మాయి తల్లి. అప్పుడే పెళ్ళిచూపులు అయి ఇల్లు తెలిపిన పడింది. మిగిలిన స్వీటూ, హాటూ తింటూ సంబంధం గురించిన మంచీ చెడ్డా వివరంగా మాట్లాడుకునేందుకు అదే సమయం మరి. "అయితే ఏమైంది? అప్పుడప్పుడు చూస్తాడన్నారు కదా" సమర్థించుకుంటూ వస్తున్నాడు ఆ సంబంధం తెచ్చిన మనిషి. “ఏమో మరి. కనీసం సినిమాలక్కూడా వెళ్ళనివాడు పిల్ల సరదాలేం తీరుస్తాడు. మరీ చాదస్తపు రకం అనిపిస్తోంది." అందావిడ కచ్చితంగా. ఒక పదేళ్ళ క్రితం గోదావరి జిల్లాల్లో ఒకచోట మా బంధువుల ఇంట్లో జరిగిన సంఘటన ఇది. ఆరోజు ఆవిడ అన్న మాట మిగిలినవారు ఎంత సీరియస్గా తీసుకున్నారో గుర్తులేదు కానీ నాకు మాత్రం తెలుగు సినిమాలు ఎంతగా సంస్కృతిలోకి, సమాజంలోకి చొచ్చుకుని వెళ్ళిపోయాయన్నదానికి ఒక కొలబద్దగా ఉంటుంది ఆ మాట. కూతురికి వచ్చిన సంబంధం మంచిదో కాదో తెలియడానికి ఆవిడకు ఉన్న ముఖ్యమైన లెక్కల్లో ఎంత తరచుగా సినిమాకి వెళ్తాడు అన్నది ముఖ్యమైన లెక్క కావడం ఈ ప్రాంతపు మట్టిలో ఇంకిపోయిన సినిమా ప్రేమకు నిదర్శనం.....................© 2017,www.logili.com All Rights Reserved.