నాకీ పేరుప్రఖ్యాతులార్జించి పెట్టింది కొంతమంది పిచ్చి ప్రజలే! ఒకప్పుడు నేను పట్టణానికి చాలా దూరంగా రోడ్డు పక్కన ఓ మామూలు రాయిలా పడుండేదాన్ని. ఎవ్వరూ నన్ను పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ దశలో ఓ పుణ్యాత్ముడు ఉలితో చెక్కి నా రూపాన్ని తీర్చిదిద్దాడు. నాకో పేరు పెట్టడమే కాక ఓ నెంబరును సైతం కేటాయించాడు. అలా నన్ను 'ప్రజోపకారిణి'గా అతడు తీర్చిదిద్దడం నాకెంతో సంతోషదాయకమైంది.
అవును... ఇప్పుడు ఇదే రోడ్డుమీద పద్దెనిమిది మైళ్ల తర్వాత ఏడో ఫర్లాంగును సూచించే రాతిని నేను! అంటే నేను మీ ఫర్లాంగు రాయినన్నమాట. అయితే కొన్నేళ్ల తర్వాత ఈ స్థాయి నుంచి కూడా ఎదిగిపోయాను, ప్రస్తుతం నన్నందరూ 'ఫర్లాంగమ్మ'గా వ్యవహరిస్తున్నారు. అనేకమంది ప్రజల కష్టనష్టాల్లో పాలు పంచుకోడానికి, వారిని ఊరడింపచేయడానికి కావల్సిన శక్తిసామర్థ్యాల్ని సైతం సంతరించుకున్నానిప్పుడు.
కొన్నేళ్ల క్రితం ఈ రోడ్డున పోయే బస్సులు ఖచ్చితంగా నేనున్న ప్రాంతానికి రావడంతోనే ఏదో ఒక ప్రమాదానికి లోనయ్యేవి. అలా ఎందుకు జరిగేదో నాకర్థమయ్యేది కాదు. ప్రజలు మాత్రం ఏదో దుష్టగ్రహమే దానికి కారణం అంటూ నమ్ముతూ వచ్చారు.
రోడ్డుమీద పోయేవారు అదే రోడ్డుమీద తామంతకు ముందు ఎదుర్కొన్న అనుభవాల్ని కథలు కథలుగా ఒకరికొకరు చెప్పుకుంటూ ప్రయాణాలు కొనసాగించేవారు. వారి మాటల్లో చెప్పాలంటే...
"ఆ తోపు దగ్గరున్న పాడుబడ్డ బావి నీకు తెల్సు కదా... అక్కడే మాది చచ్చిపోయింది. అదే దయ్యమై ఈ రోడ్డుమీద పోయే ప్రయాణికుల్ని ఇబ్బందులు పెడుతోంది..."...............
ఫర్లాంగమ్మ ఉషాదేవి నాకీ పేరుప్రఖ్యాతులార్జించి పెట్టింది కొంతమంది పిచ్చి ప్రజలే! ఒకప్పుడు నేను పట్టణానికి చాలా దూరంగా రోడ్డు పక్కన ఓ మామూలు రాయిలా పడుండేదాన్ని. ఎవ్వరూ నన్ను పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ దశలో ఓ పుణ్యాత్ముడు ఉలితో చెక్కి నా రూపాన్ని తీర్చిదిద్దాడు. నాకో పేరు పెట్టడమే కాక ఓ నెంబరును సైతం కేటాయించాడు. అలా నన్ను 'ప్రజోపకారిణి'గా అతడు తీర్చిదిద్దడం నాకెంతో సంతోషదాయకమైంది. అవును... ఇప్పుడు ఇదే రోడ్డుమీద పద్దెనిమిది మైళ్ల తర్వాత ఏడో ఫర్లాంగును సూచించే రాతిని నేను! అంటే నేను మీ ఫర్లాంగు రాయినన్నమాట. అయితే కొన్నేళ్ల తర్వాత ఈ స్థాయి నుంచి కూడా ఎదిగిపోయాను, ప్రస్తుతం నన్నందరూ 'ఫర్లాంగమ్మ'గా వ్యవహరిస్తున్నారు. అనేకమంది ప్రజల కష్టనష్టాల్లో పాలు పంచుకోడానికి, వారిని ఊరడింపచేయడానికి కావల్సిన శక్తిసామర్థ్యాల్ని సైతం సంతరించుకున్నానిప్పుడు. కొన్నేళ్ల క్రితం ఈ రోడ్డున పోయే బస్సులు ఖచ్చితంగా నేనున్న ప్రాంతానికి రావడంతోనే ఏదో ఒక ప్రమాదానికి లోనయ్యేవి. అలా ఎందుకు జరిగేదో నాకర్థమయ్యేది కాదు. ప్రజలు మాత్రం ఏదో దుష్టగ్రహమే దానికి కారణం అంటూ నమ్ముతూ వచ్చారు. రోడ్డుమీద పోయేవారు అదే రోడ్డుమీద తామంతకు ముందు ఎదుర్కొన్న అనుభవాల్ని కథలు కథలుగా ఒకరికొకరు చెప్పుకుంటూ ప్రయాణాలు కొనసాగించేవారు. వారి మాటల్లో చెప్పాలంటే... "ఆ తోపు దగ్గరున్న పాడుబడ్డ బావి నీకు తెల్సు కదా... అక్కడే మాది చచ్చిపోయింది. అదే దయ్యమై ఈ రోడ్డుమీద పోయే ప్రయాణికుల్ని ఇబ్బందులు పెడుతోంది..."...............© 2017,www.logili.com All Rights Reserved.