|| మొదటి భాగం: హరిత గాంధేయం ||
అనంతమైన విజ్ఞానవని... అంతులేని వజ్రాలగని
అది ఒక విజ్ఞానవని!
అందులో ఎన్నో మూలికలున్నాయ్, వాటి నుంచి ఔషధాలు వస్తాయ్. అవి మనం స్వీకరించే పద్ధతిలో లేహ్యంగానో, చూర్ణంగానో మార్చుకోవచ్చు.
అది వజ్రాల గని!!
అందులో అడుగు పొరల్లో గులకరాళ్ళున్నాయి, గాలించి వాటిని సానబడితే వజ్రాలుగా మారుతాయి.
గాంధీజీ గురించి ఆలోచిస్తే అలవోకగా విజ్ఞానవని, వజ్రాల గని గుర్తుకు వచ్చాయి! అంతటి విరాణ్మూర్తి గాంధీజీ. 20వ శతాబ్దంలోనే ఆయన అత్యుత్తమ మానవుడు. మన విజ్ఞతను బట్టి అతను చెప్పిన విషయాలని స్వీకరించడమో, పాటించడమో, విని వదిలేయడమో, విబేధించడమో, విద్వేషించడమో ఉంటుంది. ఆయన భారతదేశంలో పుట్టినా ఆయన విశ్వనరుడు! ఆయన జన్మదినాన్ని 2007 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అహింసా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అప్పటికి ఆయన కనుమూసి ఏడున్నర దశాబ్దాలయ్యింది. నిజానికి ఒక్క భారతదేశంలోనే అతని గురించి తక్కువ చర్చించడమో, తక్కువ పాటించడమో ఉందేమో! ఆయన జీవిత కాలంలో చెప్పిన విషయాలు పూర్తిగా గ్రంథస్తమయ్యాయి. పబ్లికేషన్ డివిజన్ ప్రచురించిన 100 సంపుటాలు 'కంప్లీట్ వర్క్స్ ఆఫ్ మహాత్మాగాంధీ'గా లభ్యమవుతున్నాయి. మొత్తం 50,000 పుటలలో ఆయన ఆలోచనలు మనకు.............
|| మొదటి భాగం: హరిత గాంధేయం || అనంతమైన విజ్ఞానవని... అంతులేని వజ్రాలగని అది ఒక విజ్ఞానవని! అందులో ఎన్నో మూలికలున్నాయ్, వాటి నుంచి ఔషధాలు వస్తాయ్. అవి మనం స్వీకరించే పద్ధతిలో లేహ్యంగానో, చూర్ణంగానో మార్చుకోవచ్చు. అది వజ్రాల గని!! అందులో అడుగు పొరల్లో గులకరాళ్ళున్నాయి, గాలించి వాటిని సానబడితే వజ్రాలుగా మారుతాయి. గాంధీజీ గురించి ఆలోచిస్తే అలవోకగా విజ్ఞానవని, వజ్రాల గని గుర్తుకు వచ్చాయి! అంతటి విరాణ్మూర్తి గాంధీజీ. 20వ శతాబ్దంలోనే ఆయన అత్యుత్తమ మానవుడు. మన విజ్ఞతను బట్టి అతను చెప్పిన విషయాలని స్వీకరించడమో, పాటించడమో, విని వదిలేయడమో, విబేధించడమో, విద్వేషించడమో ఉంటుంది. ఆయన భారతదేశంలో పుట్టినా ఆయన విశ్వనరుడు! ఆయన జన్మదినాన్ని 2007 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అహింసా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అప్పటికి ఆయన కనుమూసి ఏడున్నర దశాబ్దాలయ్యింది. నిజానికి ఒక్క భారతదేశంలోనే అతని గురించి తక్కువ చర్చించడమో, తక్కువ పాటించడమో ఉందేమో! ఆయన జీవిత కాలంలో చెప్పిన విషయాలు పూర్తిగా గ్రంథస్తమయ్యాయి. పబ్లికేషన్ డివిజన్ ప్రచురించిన 100 సంపుటాలు 'కంప్లీట్ వర్క్స్ ఆఫ్ మహాత్మాగాంధీ'గా లభ్యమవుతున్నాయి. మొత్తం 50,000 పుటలలో ఆయన ఆలోచనలు మనకు.............© 2017,www.logili.com All Rights Reserved.