మనం ఏమి చేయబోతున్నాం?
మనదేశంలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో 4,72,000 మంది విద్యార్థులు పోటీపడి ఐఐటిల్లో కేవలం పదివేల మంది అవకాశం పొందుతారు. ఇంత పోటీ హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో కూడా లేదని ఏంజెలా సైనీ అనే సైన్స్ రచయిత్రి 'గీక్ నేషన్ హౌ ఇండియన్ సైన్స్ ఈజ్ టేకింగ్ ఓవర్ ద వరల్డ్' అనే పుస్తకంలో అభినందన పూర్వకంగా పేర్కొంటారు. నిజానికి ఈ పుస్తకంలో మనం సైతం ఆశ్చర్యపోయే రీతిలో ఎంతో ఆశావహంగా భారత్ సైన్స్ విజయాలను, భవిష్యత్ అవకాశాలను ఈ యువ మహిళా జర్నలిస్టు వివరిస్తారు.
అల్జీమర్స్ వ్యాధికి విరుగుడు పసుపులో ఉందేమోననే పరిశోధన - అమెరికాలో సాగుతోందనే చిన్న అంశంతోపాటు; అంతరిక్షం, అణు పరిశోధనలో భారత్ విజయా లతో పాటు ప్రాచీన సంస్కృత రచనలలో సైన్స్ బీజాలు కూడా అన్వేషించాలనే ధోరణితో ఈ రచన చేశారు. ఈ పుస్తకాన్ని ఎందుకు రాశారు? అనే ప్రశ్న తప్పక కలుగుతుంది.
శాస్త్ర సాంకేతిక రంగాలకు ఉండే బడ్జెట్ను భారత ప్రధాని రెండింతలు చేయడం తనను ఆకర్షించిందని ఈవిడ పుస్తక నేపథ్యంలో పేర్కొంటారు. ఆ వ్యయం ఒక శాతం నుంచి రెండు శాతం అయ్యిందని వివరిస్తారు. నిజానికి దాంతో ఇంత తేడా ఉంటుందా. అనిపిస్తుంది. కానీ దీనివల్ల దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాల కూటమి నుంచి మనదేశం అమెరికా, జపాన్, చైనా వంటి దేశాల సరసన నిలబడుతుంది. అమెరికా 2.6శాతం, జపాన్ మూడు శాతం మించి, చైనా 2 శాతం ఖర్చు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 3 నుంచి 7వ తేదీ దాకా ఇండియన్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. 2012లో 99వ సమావేశం భువనేశ్వర్లో జరిగింది. ఈ సైన్స్ కాంగ్రెసూ, కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం లేదు - పేరులో సామ్యం తప్ప. విజ్ఞాన శాస్త్రంలో లెక్కకు..........................
మనం ఏమి చేయబోతున్నాం? మనదేశంలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో 4,72,000 మంది విద్యార్థులు పోటీపడి ఐఐటిల్లో కేవలం పదివేల మంది అవకాశం పొందుతారు. ఇంత పోటీ హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో కూడా లేదని ఏంజెలా సైనీ అనే సైన్స్ రచయిత్రి 'గీక్ నేషన్ హౌ ఇండియన్ సైన్స్ ఈజ్ టేకింగ్ ఓవర్ ద వరల్డ్' అనే పుస్తకంలో అభినందన పూర్వకంగా పేర్కొంటారు. నిజానికి ఈ పుస్తకంలో మనం సైతం ఆశ్చర్యపోయే రీతిలో ఎంతో ఆశావహంగా భారత్ సైన్స్ విజయాలను, భవిష్యత్ అవకాశాలను ఈ యువ మహిళా జర్నలిస్టు వివరిస్తారు. అల్జీమర్స్ వ్యాధికి విరుగుడు పసుపులో ఉందేమోననే పరిశోధన - అమెరికాలో సాగుతోందనే చిన్న అంశంతోపాటు; అంతరిక్షం, అణు పరిశోధనలో భారత్ విజయా లతో పాటు ప్రాచీన సంస్కృత రచనలలో సైన్స్ బీజాలు కూడా అన్వేషించాలనే ధోరణితో ఈ రచన చేశారు. ఈ పుస్తకాన్ని ఎందుకు రాశారు? అనే ప్రశ్న తప్పక కలుగుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలకు ఉండే బడ్జెట్ను భారత ప్రధాని రెండింతలు చేయడం తనను ఆకర్షించిందని ఈవిడ పుస్తక నేపథ్యంలో పేర్కొంటారు. ఆ వ్యయం ఒక శాతం నుంచి రెండు శాతం అయ్యిందని వివరిస్తారు. నిజానికి దాంతో ఇంత తేడా ఉంటుందా. అనిపిస్తుంది. కానీ దీనివల్ల దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాల కూటమి నుంచి మనదేశం అమెరికా, జపాన్, చైనా వంటి దేశాల సరసన నిలబడుతుంది. అమెరికా 2.6శాతం, జపాన్ మూడు శాతం మించి, చైనా 2 శాతం ఖర్చు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 3 నుంచి 7వ తేదీ దాకా ఇండియన్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. 2012లో 99వ సమావేశం భువనేశ్వర్లో జరిగింది. ఈ సైన్స్ కాంగ్రెసూ, కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం లేదు - పేరులో సామ్యం తప్ప. విజ్ఞాన శాస్త్రంలో లెక్కకు..........................© 2017,www.logili.com All Rights Reserved.