మా నాన్న
నేను పుట్టినప్పుడు మా నాన్న వయసు నలభై ఐదు సంవత్సరాలు. ఎన్నో కాన్పులు పోయిన తరువాత మా అమ్మ నాకు జన్మనిచ్చింది. అప్పుడు మేం చెన్నైలో మధ్యతరగతివాళ్లు ఎక్కువగా నివసించే ట్రిప్లికేన్లోని ఓ అద్దె ఇంట్లో వుండేవాళ్లం. లేకలేక పుట్టిన సంతానాన్ని కాబట్టి నా తల్లిదండ్రులు నన్నేదో మహాగారాబంగా పెంచి వుంటారని అనుకుంటారేమో. కానీ అదేం లేదు. చాలా కఠినమైన క్రమశిక్షణతో పెంచారు నన్ను, ఓ చాక్లెట్లు లేవు.. ఐస్ క్రీములు లేవు. టైం ప్రకారం చదువుకోవాలి.. టైం ప్రకారం తినాలి. బయటకు వెళ్లడానికి వీల్లేదు. వీధిలో నా తోటి పిల్లలతో ఆడుకోడానికి వీల్లేదు. అసలు వాళ్లతో మాట్లాడనిచ్చేవారే కాదు. మా నాన్న ఎప్పుడూ నన్ను ఓ కంట కనిపెడుతూ వుండేవారు. మా అమ్మ కూడా అంతే అని మా బంధువులు చెప్పుకునేవారు. కానీ ఇవాళ వెనుతిరిగి చూసుకుంటే ఆనాడు వాళ్లంత క్రమశిక్షణగా పెంచడం వల్ల నాకు మేలే జరిగిందనిపిస్తుంది.
మా నాన్నకు నన్ను మరీ అతిగా హద్దుల్లో పెడుతున్నానిపించేదో ఏమో అప్పుడప్పుడూ తనతో పాటు సినిమాలకి తీసుకెళ్తుండేవారు. అయితే తనకు నచ్చిన సినిమాలకే అనుకోండి. అలాగే ఒకోసారి మా ఇంటికి దగ్గరలోని బీచ్కి కూడా తీసుకెళ్లేవారు. ప్లాస్టిక్ బ్యాటు, బాల్ పట్టుకుని మా ఇంటి ఆవరణలో నాతో హౌస్ క్రికెట్ ఆడేవారు. ఆరోజుల్లో పాత నెహ్రూ స్టేడియంలో జరిగిన ఒకటి రెండు టెస్ట్ మ్యాచ్లకు కూడా తీసుకెళ్లారు.
మా నాన్నకూ నాకూ వయసులో ఎక్కువ వ్యత్యాసం వుండటం................
మా నాన్న నేను పుట్టినప్పుడు మా నాన్న వయసు నలభై ఐదు సంవత్సరాలు. ఎన్నో కాన్పులు పోయిన తరువాత మా అమ్మ నాకు జన్మనిచ్చింది. అప్పుడు మేం చెన్నైలో మధ్యతరగతివాళ్లు ఎక్కువగా నివసించే ట్రిప్లికేన్లోని ఓ అద్దె ఇంట్లో వుండేవాళ్లం. లేకలేక పుట్టిన సంతానాన్ని కాబట్టి నా తల్లిదండ్రులు నన్నేదో మహాగారాబంగా పెంచి వుంటారని అనుకుంటారేమో. కానీ అదేం లేదు. చాలా కఠినమైన క్రమశిక్షణతో పెంచారు నన్ను, ఓ చాక్లెట్లు లేవు.. ఐస్ క్రీములు లేవు. టైం ప్రకారం చదువుకోవాలి.. టైం ప్రకారం తినాలి. బయటకు వెళ్లడానికి వీల్లేదు. వీధిలో నా తోటి పిల్లలతో ఆడుకోడానికి వీల్లేదు. అసలు వాళ్లతో మాట్లాడనిచ్చేవారే కాదు. మా నాన్న ఎప్పుడూ నన్ను ఓ కంట కనిపెడుతూ వుండేవారు. మా అమ్మ కూడా అంతే అని మా బంధువులు చెప్పుకునేవారు. కానీ ఇవాళ వెనుతిరిగి చూసుకుంటే ఆనాడు వాళ్లంత క్రమశిక్షణగా పెంచడం వల్ల నాకు మేలే జరిగిందనిపిస్తుంది. మా నాన్నకు నన్ను మరీ అతిగా హద్దుల్లో పెడుతున్నానిపించేదో ఏమో అప్పుడప్పుడూ తనతో పాటు సినిమాలకి తీసుకెళ్తుండేవారు. అయితే తనకు నచ్చిన సినిమాలకే అనుకోండి. అలాగే ఒకోసారి మా ఇంటికి దగ్గరలోని బీచ్కి కూడా తీసుకెళ్లేవారు. ప్లాస్టిక్ బ్యాటు, బాల్ పట్టుకుని మా ఇంటి ఆవరణలో నాతో హౌస్ క్రికెట్ ఆడేవారు. ఆరోజుల్లో పాత నెహ్రూ స్టేడియంలో జరిగిన ఒకటి రెండు టెస్ట్ మ్యాచ్లకు కూడా తీసుకెళ్లారు. మా నాన్నకూ నాకూ వయసులో ఎక్కువ వ్యత్యాసం వుండటం................© 2017,www.logili.com All Rights Reserved.