ఈ నవల నాకిష్టం ఎందుకంటే...
ముగ్గురు ప్రతిభావంతులు. మా కావలి కళాశాల (ప్రస్తుతం జవహర్ భారతి) రెక్టార్, రెండు : ఈ పుస్తకం రచయిత విక్టర్ హ్యూగో, మూడు ఇందులోని ప్రధానపాత్ర జీన్వాల్డీన్.
మా విశ్వోదయ విద్యాసంస్థల రెక్టార్ కీ.శే. శ్రీ దొడ్ల రామచంద్రారెడ్డి గారు (డి.ఆర్) ఆయన మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో బి.ఎ. చదివారు. ఆయన మద్రాసు వీధుల్లో తిరిగే సమయంలో కనిపించిన దృశ్యాలు ఆయన మనసును కలచివేశాయి. అక్కడ ప్లాట్ఫారంపై పడుకున్న వారు, కూడులేని, గూడులేని అనాథలు. వీళ్ళంతా కడుపు నిండా అన్నం తినేది ఎప్పుడో? మానవులంతా ఒక్కటే. కాని అవకాశం లేక మారుమూల పడివున్న వారి తలరాతలు మారుటెప్పుడో? అనే ఆలోచనలతో సతమతమయ్యేవాడు.
అదే సమయంలో ఆయన ఫ్రెంచి రచయిత విక్టర్ మేరి హ్యూగో రచించిన Les Miserables నవల చదవడం తటస్థించింది. అందులో విక్టర్ హ్యూగో ఆనాటి ఫ్రాన్స్ దేశంలోని ప్రజల స్థితిగతుల్ని వివరించారు. సామాన్య ప్రజల కష్టాలకు అంతం లేదా అన్నట్లుగా వుండేది. పల్లెల్లో రైతులకు సరైన ఇళ్ళువుండేవి కాదు. ఎముకలు కొరికే చలితో బాధపడే వారెందరో? ఎలాగంటే రైతులు పొలానికి ఎరువు తట్టలతో నెత్తిన పెట్టుకుని మోసుకుపోయేవారు. వారికి బండి ఎద్దులు కూర్చుకొనే స్థోమత లేదు. ఇంకా దారుణం. వారు ఆరు నెలలకు ఒకసారి మాత్రమే రొట్టెలు చేసి పెట్టుకునేవారు.. అవి గట్టిగా మారిపోయేవి. వాటిని గొడ్డలితో ముక్కలు చేసి 24 గం||లు నీటిలో నానబెట్టి గాని తినగలిగే వారు కాదు.
డి.ఆర్. గారు మద్రాసు కళాశాలలో తన చదువు పూర్తి కాగానే కావలికి చేరుకున్నారు. మిత్రులు, బంధువులతో సంప్రదించారు. సమాజాన్ని మార్చేది, జీవన ప్రమాణాలు పెంచేది చదువొక్కటేననే తీర్మానానికొచ్చారు. ఉన్నత కుటుంబంలోని వ్యక్తి కనుక సహాయ సహకారాలు అందించే వారందరినీ కలిశారు. కలకత్తా వెళ్లి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ శాంతినికేతనున్ను సందర్శించి వచ్చారు. అంతే ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థను స్థాపించాలనుకొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి...............
ఈ నవల నాకిష్టం ఎందుకంటే... ముగ్గురు ప్రతిభావంతులు. మా కావలి కళాశాల (ప్రస్తుతం జవహర్ భారతి) రెక్టార్, రెండు : ఈ పుస్తకం రచయిత విక్టర్ హ్యూగో, మూడు ఇందులోని ప్రధానపాత్ర జీన్వాల్డీన్. మా విశ్వోదయ విద్యాసంస్థల రెక్టార్ కీ.శే. శ్రీ దొడ్ల రామచంద్రారెడ్డి గారు (డి.ఆర్) ఆయన మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో బి.ఎ. చదివారు. ఆయన మద్రాసు వీధుల్లో తిరిగే సమయంలో కనిపించిన దృశ్యాలు ఆయన మనసును కలచివేశాయి. అక్కడ ప్లాట్ఫారంపై పడుకున్న వారు, కూడులేని, గూడులేని అనాథలు. వీళ్ళంతా కడుపు నిండా అన్నం తినేది ఎప్పుడో? మానవులంతా ఒక్కటే. కాని అవకాశం లేక మారుమూల పడివున్న వారి తలరాతలు మారుటెప్పుడో? అనే ఆలోచనలతో సతమతమయ్యేవాడు. అదే సమయంలో ఆయన ఫ్రెంచి రచయిత విక్టర్ మేరి హ్యూగో రచించిన Les Miserables నవల చదవడం తటస్థించింది. అందులో విక్టర్ హ్యూగో ఆనాటి ఫ్రాన్స్ దేశంలోని ప్రజల స్థితిగతుల్ని వివరించారు. సామాన్య ప్రజల కష్టాలకు అంతం లేదా అన్నట్లుగా వుండేది. పల్లెల్లో రైతులకు సరైన ఇళ్ళువుండేవి కాదు. ఎముకలు కొరికే చలితో బాధపడే వారెందరో? ఎలాగంటే రైతులు పొలానికి ఎరువు తట్టలతో నెత్తిన పెట్టుకుని మోసుకుపోయేవారు. వారికి బండి ఎద్దులు కూర్చుకొనే స్థోమత లేదు. ఇంకా దారుణం. వారు ఆరు నెలలకు ఒకసారి మాత్రమే రొట్టెలు చేసి పెట్టుకునేవారు.. అవి గట్టిగా మారిపోయేవి. వాటిని గొడ్డలితో ముక్కలు చేసి 24 గం||లు నీటిలో నానబెట్టి గాని తినగలిగే వారు కాదు. డి.ఆర్. గారు మద్రాసు కళాశాలలో తన చదువు పూర్తి కాగానే కావలికి చేరుకున్నారు. మిత్రులు, బంధువులతో సంప్రదించారు. సమాజాన్ని మార్చేది, జీవన ప్రమాణాలు పెంచేది చదువొక్కటేననే తీర్మానానికొచ్చారు. ఉన్నత కుటుంబంలోని వ్యక్తి కనుక సహాయ సహకారాలు అందించే వారందరినీ కలిశారు. కలకత్తా వెళ్లి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ శాంతినికేతనున్ను సందర్శించి వచ్చారు. అంతే ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థను స్థాపించాలనుకొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి...............© 2017,www.logili.com All Rights Reserved.