పేరు మారిన నగరం
ఉదయకిరణాల్లాన్ని
ఆటోల్లో ఇరుక్కున్న బాల భానుళ్లై
భూభారాన్ని వీపులకెక్కించుకుని
బడికి పోతున్నాయి!
విస్తరించిన తరుశాఖల ఛాయల్లో, విశ్రమించే ఇళ్లన్నీ
తరువుల్ని తరిమేసి ఆకాశాన్ని ఆక్రమిస్తున్నాయి!
పెరిగిన వత్తిడికి పగిలిన నీటి గొట్టాలలో
తాగునీరూ మురుగు నీరూ చెట్టాపట్టాలేసుకుంటున్నాయి.
ప్రతివీధీ ఒక టిఫిన్ సెంటరే!
రకరకాల రుచులు తిరిగి తిరిగి మరిగే నూనెలో
కరకరలాడుతున్నాయి,
ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ కాఫీలై పొగలు కక్కుతున్నాయి.
నగరం తిని పారేసిన చెత్త మట్టిలో కలవనని మొరాయిస్తోంది.
సిటీ సివిక్ సెన్సంతా చేటల్లోకెక్కి
ప్రహరీ మీంచి వీధిలోకి దూకుతోంది
అంతుపట్టని రోగాలు కార్పొరేటు ఆసుపత్రుల కంప్యూటర్లలో
భారీ బిల్లులై ఆత్రంగా బయటికొస్తున్నాయి!...................
© 2017,www.logili.com All Rights Reserved.