ప్రతి క్షణం, ప్రతి దినం ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. అదే పద్ధతిలో సూర్యుడు అస్తమించడం కూడా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటుంది.
అస్తమిస్తున్న సూర్యుడికి అభిముఖంగా ఆమె నడుస్తోంది. అపరసంధ్యాకాంతులు ప్రతిఫలించకపోయినా, ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మాటిమాటికి చీర చెరగుతో పాటు పైకి లేస్తున్న ఆమె కుడిచేతి వేళ్ళు, కళ్ళను తడుముతున్నాయి. చెంపల చివరన కాటుక మరకలు కనిపిస్తున్నాయి. కనుబొమల నడుమన బొట్టు కొద్దిగా స్థానభ్రంశం పొందింది.
పరచుకొంటున్న సంజె చీకట్లు ఆమె నీడ పొడవును పెంచుతున్నాయి.
పడమటి కొండల వెనుక సంధ్యాదేవి సూర్యుణ్ణి తన కాళ్ళతో తొక్కిపట్టి, ఒళ్ళు విరుచుకొని పైకి లేచింది. సూర్యుడు అస్తమించాడు.
ఆమె ఒక ఇంటి గుమ్మం ముందు ఆగి గోడకు వేలాడుతున్న బోర్డు వంక చూసింది.
గాలికి రేగుతున్న ముంగురులు ఒక వంకా, కళ్ళలో నిండుతున్న కన్నీరు ఒక వంకా, ఆ బోర్డును ఆమె స్పష్టంగా చూడనివ్వకుండా అడ్డుపడ్డాయి.
ఆమె వర్షిస్తున్న కళ్ళను నింపాదిగా మరోమారు తుడుచుకొని మళ్ళీ బోర్డు వంక చూసింది. అవే అక్షరాలు... తను వెదుక్కొంటూ వచ్చిన పేరే......................
ప్రతి క్షణం, ప్రతి దినం ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. అదే పద్ధతిలో సూర్యుడు అస్తమించడం కూడా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటుంది. అస్తమిస్తున్న సూర్యుడికి అభిముఖంగా ఆమె నడుస్తోంది. అపరసంధ్యాకాంతులు ప్రతిఫలించకపోయినా, ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మాటిమాటికి చీర చెరగుతో పాటు పైకి లేస్తున్న ఆమె కుడిచేతి వేళ్ళు, కళ్ళను తడుముతున్నాయి. చెంపల చివరన కాటుక మరకలు కనిపిస్తున్నాయి. కనుబొమల నడుమన బొట్టు కొద్దిగా స్థానభ్రంశం పొందింది. పరచుకొంటున్న సంజె చీకట్లు ఆమె నీడ పొడవును పెంచుతున్నాయి. పడమటి కొండల వెనుక సంధ్యాదేవి సూర్యుణ్ణి తన కాళ్ళతో తొక్కిపట్టి, ఒళ్ళు విరుచుకొని పైకి లేచింది. సూర్యుడు అస్తమించాడు. ఆమె ఒక ఇంటి గుమ్మం ముందు ఆగి గోడకు వేలాడుతున్న బోర్డు వంక చూసింది. గాలికి రేగుతున్న ముంగురులు ఒక వంకా, కళ్ళలో నిండుతున్న కన్నీరు ఒక వంకా, ఆ బోర్డును ఆమె స్పష్టంగా చూడనివ్వకుండా అడ్డుపడ్డాయి. ఆమె వర్షిస్తున్న కళ్ళను నింపాదిగా మరోమారు తుడుచుకొని మళ్ళీ బోర్డు వంక చూసింది. అవే అక్షరాలు... తను వెదుక్కొంటూ వచ్చిన పేరే......................© 2017,www.logili.com All Rights Reserved.