సంక్రాంతి పండుగ దగ్గరకి వచ్చింది. ఇంతవరకూ నువ్వూ, పిల్లలూ బట్టలు తీసుకోలేదు అంజనా. రేపు టౌన్ కి వెళ్లి నీకూ, పిల్లలకీ బట్టలు తెచ్చుకుందాం!” కమలమ్మ అంది కోడలు అంజనతో.
“ఇప్పుడు బట్టలు ఎందుకు అత్తయ్యా, అందరికీ ఉన్నాయిగా? ఇయ్యేడు పంటలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఖర్చులు ఎందుకు పెంచుకోవడం?”
"వ్యవసాయం అన్న తరవాత అంతే. ఒకేడు పండుతుందీ, ఒకేడు ఎండుతుంది. అదంతా మామూలే. పంటలు బాగాలేవని తినడం మానుకుంటామా, పండుగ చేసుకోవడం మానుకుంటామా?
పిల్లలు పెద్ద అవుతున్నారు. ముందు ముందు ఖర్చులు పెరుగుతాయికానీ తగ్గవు! రేపు వాళ్ల చదువులకి చాలా పెట్టాల్సి వస్తుంది. ఇప్పట్నుంచీ ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది అత్తయ్యా!”
"పొదుపుగా లేకుండా మనం ఏం దుబారా చేస్తున్నాం అంజనా? రేపు పండక్కి ఎక్కడెక్కడి వాళ్లూ వస్తారు. సరైన బట్టలు లేకుంటే ఏం బాగుంటుంది? మనకి ఉన్నా.. లేకున్నా పిల్లలకి లోటు చేయకూడదు. వాళ్లు ఒకరి ముందు హుందాగా ఉండాలి కానీ, చిన్నతనంగా ఉండకూడదు.”...........
సంక్రాంతి పండుగ దగ్గరకి వచ్చింది. ఇంతవరకూ నువ్వూ, పిల్లలూ బట్టలు తీసుకోలేదు అంజనా. రేపు టౌన్ కి వెళ్లి నీకూ, పిల్లలకీ బట్టలు తెచ్చుకుందాం!” కమలమ్మ అంది కోడలు అంజనతో. “ఇప్పుడు బట్టలు ఎందుకు అత్తయ్యా, అందరికీ ఉన్నాయిగా? ఇయ్యేడు పంటలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఖర్చులు ఎందుకు పెంచుకోవడం?” "వ్యవసాయం అన్న తరవాత అంతే. ఒకేడు పండుతుందీ, ఒకేడు ఎండుతుంది. అదంతా మామూలే. పంటలు బాగాలేవని తినడం మానుకుంటామా, పండుగ చేసుకోవడం మానుకుంటామా? పిల్లలు పెద్ద అవుతున్నారు. ముందు ముందు ఖర్చులు పెరుగుతాయికానీ తగ్గవు! రేపు వాళ్ల చదువులకి చాలా పెట్టాల్సి వస్తుంది. ఇప్పట్నుంచీ ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది అత్తయ్యా!” "పొదుపుగా లేకుండా మనం ఏం దుబారా చేస్తున్నాం అంజనా? రేపు పండక్కి ఎక్కడెక్కడి వాళ్లూ వస్తారు. సరైన బట్టలు లేకుంటే ఏం బాగుంటుంది? మనకి ఉన్నా.. లేకున్నా పిల్లలకి లోటు చేయకూడదు. వాళ్లు ఒకరి ముందు హుందాగా ఉండాలి కానీ, చిన్నతనంగా ఉండకూడదు.”...........© 2017,www.logili.com All Rights Reserved.