శరీరంలో అంగాల వ్యవస్థ మొదలవుతుంది.అక్కడే చావూ మొదలవుతుంది. తాము తినాలి, బతకాలి, కొనసాగాలి. తన జాతిని తిన్నా ఫరవాలేదు. బతకాలి ఇంకొకరిని చంపినా సరే తాము బతకాలి. మనిషికి అనవసరంగా, ఆలోచన వుంది. మిగతావాళ్ళను చంపడానికి, తాను బతకడానికీ ఈ ఆలోచన ఎంత సహాయం చేస్తుందో? ఆ మిగతా వాళ్ళు తనను చంపితే? అమ్మో! ఇంకేమైనా ఉందా?? మనం లేకున్నా తర్వాత ఈ ప్రసంగం ఉంటేనేం? పోతేనేం?
మనం పుట్టిన మరుక్షణ౦ నుంచే చావు మొదలవుతుంది.ఈ సంగతి ఎవరికీ నచ్చదు.ఎవరికీ అర్ధం కాదు.మనిషి బతుకు కథకు, చావు ఒక అందమైన అంతం. వద్దంటే అది ఆగదు! ఎప్పుడొస్తో౦దో తెలియదు. కనుకనే చావంటే అదొక అర్ధంగాని విషయం! మరణం మనిషిని రకరకాలుగా తాకుతుంది, బుజ్జగిస్తుంది, బాధపెడుతుంది. బాధ నుండి విముక్తి వస్తుంది. కావలసిందల్లా మనం మరణం గురించి అర్ధం చేసుకోవడమే!
మనిషికి మరణం లేదు. గొప్ప మనిషికి మరణం అసలే లేదు.గొప్ప భావానికి మరణమనే ప్రశ్నేలేదు. మరణం అంతం కాదు. అది ఒక అందమైన ప్రారంభం! అదే ఈ పుస్తకం యొక్క సారాంశం.
శరీరంలో అంగాల వ్యవస్థ మొదలవుతుంది.అక్కడే చావూ మొదలవుతుంది. తాము తినాలి, బతకాలి, కొనసాగాలి. తన జాతిని తిన్నా ఫరవాలేదు. బతకాలి ఇంకొకరిని చంపినా సరే తాము బతకాలి. మనిషికి అనవసరంగా, ఆలోచన వుంది. మిగతావాళ్ళను చంపడానికి, తాను బతకడానికీ ఈ ఆలోచన ఎంత సహాయం చేస్తుందో? ఆ మిగతా వాళ్ళు తనను చంపితే? అమ్మో! ఇంకేమైనా ఉందా?? మనం లేకున్నా తర్వాత ఈ ప్రసంగం ఉంటేనేం? పోతేనేం? మనం పుట్టిన మరుక్షణ౦ నుంచే చావు మొదలవుతుంది.ఈ సంగతి ఎవరికీ నచ్చదు.ఎవరికీ అర్ధం కాదు.మనిషి బతుకు కథకు, చావు ఒక అందమైన అంతం. వద్దంటే అది ఆగదు! ఎప్పుడొస్తో౦దో తెలియదు. కనుకనే చావంటే అదొక అర్ధంగాని విషయం! మరణం మనిషిని రకరకాలుగా తాకుతుంది, బుజ్జగిస్తుంది, బాధపెడుతుంది. బాధ నుండి విముక్తి వస్తుంది. కావలసిందల్లా మనం మరణం గురించి అర్ధం చేసుకోవడమే! మనిషికి మరణం లేదు. గొప్ప మనిషికి మరణం అసలే లేదు.గొప్ప భావానికి మరణమనే ప్రశ్నేలేదు. మరణం అంతం కాదు. అది ఒక అందమైన ప్రారంభం! అదే ఈ పుస్తకం యొక్క సారాంశం.© 2017,www.logili.com All Rights Reserved.