భూమిక
ఇస్లాం తెరలను ఛేదించటం
2001 సెప్టెంబరు 11న, యునైటెడ్ స్టేట్స్ మీద జరిగిన ఉగ్రవాద చర్యల తరవాత, పాశ్చాత్యులు ప్రపంచ ముస్లింలందరినీ, తమ మతాన్నీ, సంస్కృతినీ, పునః పరిశీలించుకోమని కోరారు. అమెరికా ప్రెసిడెంట్ జార్జి. డబ్ల్యు. బుష్, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేర్, ఇంకా అనేక మంది పాశ్చాత్య నాయకులు, తమ తమ దేశాలలోని ముస్లిం సంస్థలను, ఆ 19 మంది ఉగ్రవాదులు నేర్పుతున్న ఇస్లాంకు దూరంగా ఉండమని కోరారు. 19మంది పాల్పడిన నేరానికి, ముస్లింల నందరినీ బాధ్యులు చేయటాన్ని, ముస్లింలకు కోపం తెప్పించింది. కాని, సెప్టెంబరు 11న మారణకాండ జరగకముందునుంచే, ప్రపంచవ్యాప్తంగా, చాలాచోట్ల ముస్లింలు యునైటెడ్ స్టేట్స్ అంటే బాగా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ఉదంతం, నేను పెరిగిన మత విశ్వాసంలోనే
దాగి ఉన్నదా అని, నన్ను ఆలోచింపచేసింది. ఇస్లాంలోనే దుందుడుకుతనం, ఇతరులంటే ద్వేషం దాగి ఉన్నాయా అని మూలాలలోకి తొంగి చూచాను. నన్ను నా తల్లిదండ్రులు మంచి ముస్లింగా పెంచారు. మా కుటుంబం, మా బంధువులు - అందరి మీదా ఇస్లాం పెత్తనం చేసింది. ఇస్లామే మా సిద్ధాంతం, మా నమ్మకం, మా నీతితత్వం, మా న్యాయం, మా గుర్తింపు కూడా. మేము ముందు ముస్లింలం, తరువాతే సోమాలీలం. ముస్లింలం అంటేనే అల్లాకు లొంగి ఉండేవారమని. ఖురాన్, హడిత ప్రకారం నడుచుకునేవారమని అర్థం. ఇస్లాం ప్రపంచంలో ప్రత్యేకమైనదని నాకు నేర్పించారు. దేవుడు ముస్లింలను ప్రత్యేకంగా ఎన్నుకున్నారన్నారు. మిగతావారంతా - కాఫిర్లు - అపవిత్రులు, క్రూరులు, సుస్తీ చేయబడనివారు, అవినీతిపరులు, నీతి, నియమాలు లేనివారు వారికి ఆడవారంటే గౌరవం లేదు. ఆడవాళ్ళంతా పతితలు, మగవారిలో అనేకమంది స్వలింగ సంపర్కులు. ఆడ, మగ పెండ్లికి ముందే లైంగిక అనుభవం పొందుతారు. అల్లాలో నమ్మకం లేనివారిని దేవుడు శిక్షిస్తాడు, నరకంలో మగ్గిపోయేలా చేస్తాడు.
నేనూ, మా చెల్లెలు, కొందరు ముస్లింలు కానివారు, చాలా మంచివారని పొగిడేవాళ్ళం. అది విని, అమ్మ, అమ్మమ్మ ఇలా అనేవారు: “వాళ్ళు మంచివారు కానేకారు. వాళ్ళకి ఖురాన్, ప్రొఫెట్, అల్లా గురించి తెలుసు. మనిషంటే ముస్లిమేనని...................
భూమిక ఇస్లాం తెరలను ఛేదించటం 2001 సెప్టెంబరు 11న, యునైటెడ్ స్టేట్స్ మీద జరిగిన ఉగ్రవాద చర్యల తరవాత, పాశ్చాత్యులు ప్రపంచ ముస్లింలందరినీ, తమ మతాన్నీ, సంస్కృతినీ, పునః పరిశీలించుకోమని కోరారు. అమెరికా ప్రెసిడెంట్ జార్జి. డబ్ల్యు. బుష్, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేర్, ఇంకా అనేక మంది పాశ్చాత్య నాయకులు, తమ తమ దేశాలలోని ముస్లిం సంస్థలను, ఆ 19 మంది ఉగ్రవాదులు నేర్పుతున్న ఇస్లాంకు దూరంగా ఉండమని కోరారు. 19మంది పాల్పడిన నేరానికి, ముస్లింల నందరినీ బాధ్యులు చేయటాన్ని, ముస్లింలకు కోపం తెప్పించింది. కాని, సెప్టెంబరు 11న మారణకాండ జరగకముందునుంచే, ప్రపంచవ్యాప్తంగా, చాలాచోట్ల ముస్లింలు యునైటెడ్ స్టేట్స్ అంటే బాగా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ఉదంతం, నేను పెరిగిన మత విశ్వాసంలోనే దాగి ఉన్నదా అని, నన్ను ఆలోచింపచేసింది. ఇస్లాంలోనే దుందుడుకుతనం, ఇతరులంటే ద్వేషం దాగి ఉన్నాయా అని మూలాలలోకి తొంగి చూచాను. నన్ను నా తల్లిదండ్రులు మంచి ముస్లింగా పెంచారు. మా కుటుంబం, మా బంధువులు - అందరి మీదా ఇస్లాం పెత్తనం చేసింది. ఇస్లామే మా సిద్ధాంతం, మా నమ్మకం, మా నీతితత్వం, మా న్యాయం, మా గుర్తింపు కూడా. మేము ముందు ముస్లింలం, తరువాతే సోమాలీలం. ముస్లింలం అంటేనే అల్లాకు లొంగి ఉండేవారమని. ఖురాన్, హడిత ప్రకారం నడుచుకునేవారమని అర్థం. ఇస్లాం ప్రపంచంలో ప్రత్యేకమైనదని నాకు నేర్పించారు. దేవుడు ముస్లింలను ప్రత్యేకంగా ఎన్నుకున్నారన్నారు. మిగతావారంతా - కాఫిర్లు - అపవిత్రులు, క్రూరులు, సుస్తీ చేయబడనివారు, అవినీతిపరులు, నీతి, నియమాలు లేనివారు వారికి ఆడవారంటే గౌరవం లేదు. ఆడవాళ్ళంతా పతితలు, మగవారిలో అనేకమంది స్వలింగ సంపర్కులు. ఆడ, మగ పెండ్లికి ముందే లైంగిక అనుభవం పొందుతారు. అల్లాలో నమ్మకం లేనివారిని దేవుడు శిక్షిస్తాడు, నరకంలో మగ్గిపోయేలా చేస్తాడు. నేనూ, మా చెల్లెలు, కొందరు ముస్లింలు కానివారు, చాలా మంచివారని పొగిడేవాళ్ళం. అది విని, అమ్మ, అమ్మమ్మ ఇలా అనేవారు: “వాళ్ళు మంచివారు కానేకారు. వాళ్ళకి ఖురాన్, ప్రొఫెట్, అల్లా గురించి తెలుసు. మనిషంటే ముస్లిమేనని...................© 2017,www.logili.com All Rights Reserved.