Gandla Mitta

By R C Krishnaswami Raju (Author)
Rs.160
Rs.160

Gandla Mitta
INR
MANIMN3581
In Stock
160.0
Rs.160


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పచ్లో వెళ్ళే ముందు..

“కాదేదీ కథకు అనర్హం” అన్నట్లుగా ఇటీవలి కాలంలో విస్తృతంగానూ, వస్తువైవిధ్యంతోనూ, మట్టి పరిమళాల మాధుర్యాన్ని పంచుతూనూ కథలు రాస్తున్న రచయిత ఆర్.సి.కృష్ణస్వామిరాజుగారు.

జ్ఞాపకాల్లోనో, వ్యాపకాల్లోనో కదలాడే పల్లెల్ని ఆత్మతో దర్శించి, అక్షరాల్లోకి నింపి పాఠకులకు అందిస్తున్న కథారచయిత. వీరి కథల్ని ప్రచురించని పత్రిక లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. సామాజిక కథలైనా, బాలలకు నీతిని బోధించే కథలైనా, ఆధ్యాత్మిక కథలైనా, మరే ఇతర కథైనా వీరిలో నిబిడీకృతంగా దాగివున్న ప్రతిభని తేటతెల్లం చేస్తాయి. రాజుగారు కథలకు స్వీకరించే వస్తువులు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా ఉండవు. అర్థంకాని విషయాలను ప్రతిపాదించవు. అనవసర సిద్ధాంతాలు, వాటి మీద జరిగిన రాద్దాంతాల జోలికి వెళ్లవు. మాండలికాన్ని మహామంత్రంలా జపిస్తూ కథనొక యజ్ఞంలా నడిపించే శ్రద్ధ వీరి కథల్లో కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజం, అందులోని మనుషులు, వాళ్ల చుట్టూ పెనవేసుకున్న అనుబంధాలు, వరసలతో పిలుచుకుంటూ పరవశించే వాళ్ల మలినం లేని మనసుల ఛాయల్ని వీరి కథలు చిత్రిక పడతాయి. పల్లీయుల స్వచ్ఛ మనస్తత్వానికి అద్దం పడతాయి. తాను చూసిన సంఘటనల్ని కథలో చొప్పించగల నేర్పు, చూసిన ప్రతి మనిషినీ కథలో పాత్రగా చేయగలిగిన కూర్పు రాజుగారి సొంతం. సాధారణ నడకతో మొదలైన కథ ముగింపుకి వచ్చేసరికి పాఠకుల చేత | కన్నీళ్ళు పెట్టిస్తాయి, ఆలోచింపజేస్తాయి.

-0'గాండ్లమిట్ట” కథాసంపుటిలో ఇరవై కథలున్నాయి. వివిధ సాహిత్య సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథలను, ఆదివారం సంచికలలోనూ, అంతర్జాల పత్రికలలోనూ ప్రచురితమైన కథలను 'గాండ్లమిట' సంపుటిగా మనకందించారు. ఈ కథలు చదువుతుంటే.. ఊపిరిపోసుకున్న ఊరి జ్ఞాపకాలేవో రా రమ్మని ఆహ్వానం పలికినట్లుంటాయి. పారేసుకున్న బాల్యమేదో పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకున్నట్లుగా ఉంటుంది. ఒకప్పుడు నడిచిన పొలం...........

పచ్లో వెళ్ళే ముందు.. “కాదేదీ కథకు అనర్హం” అన్నట్లుగా ఇటీవలి కాలంలో విస్తృతంగానూ, వస్తువైవిధ్యంతోనూ, మట్టి పరిమళాల మాధుర్యాన్ని పంచుతూనూ కథలు రాస్తున్న రచయిత ఆర్.సి.కృష్ణస్వామిరాజుగారు. జ్ఞాపకాల్లోనో, వ్యాపకాల్లోనో కదలాడే పల్లెల్ని ఆత్మతో దర్శించి, అక్షరాల్లోకి నింపి పాఠకులకు అందిస్తున్న కథారచయిత. వీరి కథల్ని ప్రచురించని పత్రిక లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. సామాజిక కథలైనా, బాలలకు నీతిని బోధించే కథలైనా, ఆధ్యాత్మిక కథలైనా, మరే ఇతర కథైనా వీరిలో నిబిడీకృతంగా దాగివున్న ప్రతిభని తేటతెల్లం చేస్తాయి. రాజుగారు కథలకు స్వీకరించే వస్తువులు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా ఉండవు. అర్థంకాని విషయాలను ప్రతిపాదించవు. అనవసర సిద్ధాంతాలు, వాటి మీద జరిగిన రాద్దాంతాల జోలికి వెళ్లవు. మాండలికాన్ని మహామంత్రంలా జపిస్తూ కథనొక యజ్ఞంలా నడిపించే శ్రద్ధ వీరి కథల్లో కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజం, అందులోని మనుషులు, వాళ్ల చుట్టూ పెనవేసుకున్న అనుబంధాలు, వరసలతో పిలుచుకుంటూ పరవశించే వాళ్ల మలినం లేని మనసుల ఛాయల్ని వీరి కథలు చిత్రిక పడతాయి. పల్లీయుల స్వచ్ఛ మనస్తత్వానికి అద్దం పడతాయి. తాను చూసిన సంఘటనల్ని కథలో చొప్పించగల నేర్పు, చూసిన ప్రతి మనిషినీ కథలో పాత్రగా చేయగలిగిన కూర్పు రాజుగారి సొంతం. సాధారణ నడకతో మొదలైన కథ ముగింపుకి వచ్చేసరికి పాఠకుల చేత | కన్నీళ్ళు పెట్టిస్తాయి, ఆలోచింపజేస్తాయి. -0'గాండ్లమిట్ట” కథాసంపుటిలో ఇరవై కథలున్నాయి. వివిధ సాహిత్య సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథలను, ఆదివారం సంచికలలోనూ, అంతర్జాల పత్రికలలోనూ ప్రచురితమైన కథలను 'గాండ్లమిట' సంపుటిగా మనకందించారు. ఈ కథలు చదువుతుంటే.. ఊపిరిపోసుకున్న ఊరి జ్ఞాపకాలేవో రా రమ్మని ఆహ్వానం పలికినట్లుంటాయి. పారేసుకున్న బాల్యమేదో పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకున్నట్లుగా ఉంటుంది. ఒకప్పుడు నడిచిన పొలం...........

Features

  • : Gandla Mitta
  • : R C Krishnaswami Raju
  • : Priyamaina Rachayitalu
  • : MANIMN3581
  • : Paperback
  • : August, 2022
  • : 146
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gandla Mitta

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam