గజ స్నానం
ఒక భక్తుడు ప్రతి పున్నమి రోజున ఆశ్రమానికి వచ్చి సత్సంగంలో పాల్గొనేవాడు. కొన్నాళ్ళ తర్వాత గురువును కలిసి నెలల తరబడి వస్తున్నా తనలో మార్పు రాలేదని' బాధ పడ్డాడు. భక్తుడిని ఆశ్రమంలో ఉన్న ఏనుగు వద్దకు తీసుకెళ్ళాడు గురువు. ప్రవహించే నది నీళ్ళలో ఏనుగు నిలబడి ఉంది. తోక తిప్పుతూ, తొండంతో నీళ్ళు ఎత్తి, నెత్తిన పోసుకుని స్నానం చేస్తోంది.
"అది ఏమి చేస్తోందో గమనించావా?" అని అడిగాడు గురువు. "చక్కగా స్నానం చేస్తోంది" అని బదులిచ్చాడు భక్తుడు.
"అలాగే చూస్తూ ఉండు" అన్నాడు గురువు.
చాలాసేపు అది స్నానం చేస్తున్నా, ఓపికగా నిరీక్షించాడు భక్తుడు.
శుభ్రంగా స్నానం చేసిన ఏనుగు నీళ్ళలో నుంచి బయటికి వచ్చింది. వెంటనే అదే తొండంతో చెత్త, దుమ్ము ఒంటి మీద చల్లుకోవడం ప్రారంభించింది. శుభ్రం చేసుకున్న తన శరీరాన్ని తానే చెరిపేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు భక్తుడు.
దాన్ని చూపిస్తూ గురువు "చాలా మంది విషయంలో జరిగేది ఇదే. సత్సంగం చేస్తున్నంతసేపూ 'మంచే చేయాలి, మంచిగా ఉండాలి' అనుకుంటారు. సంఘంలోకి వెళ్ళాక అనవసర విషయాల పైన ఆసక్తిని ప్రదర్శిస్తారు. దారిన పోయే చెత్తనంతా మనసులోకి తీసుకుని అదే చెత్తకుండీని నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు. సత్సంగం చేయడం అనేది స్నానం లాంటిది. అయితే మనలో చాలామంది గజస్నానం చేస్తున్నారని గుర్తించావా?" అని అడిగాడు.
"నిజమే. ఎవరో వచ్చి ఏనుగు నెత్తిన చెత్త వేయలేదు. తన నెత్తిన తనే వేసుకుంది. సత్సంగం లాంటి మంచి స్నానం చేసినా, మనం లేనిపోని ఆలోచనలతో మన మనసుని మనమే చెడ గొట్టుకుంటాము గజస్నానంలాగా...' అని గుర్తించాడు భక్తుడు......................
గజ స్నానం ఒక భక్తుడు ప్రతి పున్నమి రోజున ఆశ్రమానికి వచ్చి సత్సంగంలో పాల్గొనేవాడు. కొన్నాళ్ళ తర్వాత గురువును కలిసి నెలల తరబడి వస్తున్నా తనలో మార్పు రాలేదని' బాధ పడ్డాడు. భక్తుడిని ఆశ్రమంలో ఉన్న ఏనుగు వద్దకు తీసుకెళ్ళాడు గురువు. ప్రవహించే నది నీళ్ళలో ఏనుగు నిలబడి ఉంది. తోక తిప్పుతూ, తొండంతో నీళ్ళు ఎత్తి, నెత్తిన పోసుకుని స్నానం చేస్తోంది. "అది ఏమి చేస్తోందో గమనించావా?" అని అడిగాడు గురువు. "చక్కగా స్నానం చేస్తోంది" అని బదులిచ్చాడు భక్తుడు. "అలాగే చూస్తూ ఉండు" అన్నాడు గురువు. చాలాసేపు అది స్నానం చేస్తున్నా, ఓపికగా నిరీక్షించాడు భక్తుడు. శుభ్రంగా స్నానం చేసిన ఏనుగు నీళ్ళలో నుంచి బయటికి వచ్చింది. వెంటనే అదే తొండంతో చెత్త, దుమ్ము ఒంటి మీద చల్లుకోవడం ప్రారంభించింది. శుభ్రం చేసుకున్న తన శరీరాన్ని తానే చెరిపేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు భక్తుడు. దాన్ని చూపిస్తూ గురువు "చాలా మంది విషయంలో జరిగేది ఇదే. సత్సంగం చేస్తున్నంతసేపూ 'మంచే చేయాలి, మంచిగా ఉండాలి' అనుకుంటారు. సంఘంలోకి వెళ్ళాక అనవసర విషయాల పైన ఆసక్తిని ప్రదర్శిస్తారు. దారిన పోయే చెత్తనంతా మనసులోకి తీసుకుని అదే చెత్తకుండీని నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు. సత్సంగం చేయడం అనేది స్నానం లాంటిది. అయితే మనలో చాలామంది గజస్నానం చేస్తున్నారని గుర్తించావా?" అని అడిగాడు. "నిజమే. ఎవరో వచ్చి ఏనుగు నెత్తిన చెత్త వేయలేదు. తన నెత్తిన తనే వేసుకుంది. సత్సంగం లాంటి మంచి స్నానం చేసినా, మనం లేనిపోని ఆలోచనలతో మన మనసుని మనమే చెడ గొట్టుకుంటాము గజస్నానంలాగా...' అని గుర్తించాడు భక్తుడు......................© 2017,www.logili.com All Rights Reserved.