ముల్లా నసీరుద్దీన్ కథలు, కబుర్లు
నసిరుద్దీన్ తన పొలంలో పని చేసుకుంటూ వున్నాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి గుర్రం మీద వచ్చి ఆగాడు నసీరుద్దీన్ తల పైకెత్తి చూశాడు.
అతను 'నువ్వు ఇటుగా ఒక ఎలుగుబంటి రావడం చూశావా?” అన్నాడు. నసిరుద్దీన్ 'అవును చూశాను' అన్నాడు. అతను 'అది ఎటువైపు వెళ్ళింది' అన్నాడు. నసిరుద్దీన్ కుడివైపు చూపించి 'ఇటుగా వెళ్ళింది' అన్నాడు.
అతను కనీసం కృతజ్ఞత కూడా చెప్పకుండా గుర్రం మీద వేగంగా వెళ్ళిపోయాడు. 'పది నిమిషాల తరువాత అంతేవేగంగా తిరిగి వచ్చి -
'నిజంగా యిటువైపే వెళ్ళిందా?” అన్నాడు. నసిరుద్దీన్ 'అవును, నిజంగానే వెళ్ళింది, రెండేళ్ళ క్రితం చూశాను' అన్నాడు.
నసిరుద్దీన్ తన గాడిదను మార్కెట్లో ముప్పయి దీనార్లకు అమ్మడానికి తీసుకెళ్ళాడు, బేరం కుదిరి ముప్పయి దీనార్లకు అమ్మేశాడు.
ఆ కొన్న అతను తెలివైనవాడు. అమ్మడం, కొనడం అతని వృత్తి. నసిరుద్దీన్ అక్కడ వుండగానే అతను గాడిదను అమ్మడానికి బేరం పెట్టాడు.
'బాబూ! చూడండి! ఇది చాలా ప్రత్యేక లక్షణాలు కలిగిన గాడిద. ఎంత శుభ్రంగా, ఎంత బలంగా, ఎంత ఆరోగ్యంగా వున్నదో చూడండి. యిట్లాంటి గాడిదను మీరు జన్మలో చూసి వుండరు.. చాలా చవుక ధర. నలభై దీనార్లు మాత్రమే' అన్నాడు.
తన గాడిదలో యిన్ని మంచి లక్షణాలున్నాయని తెలియని నసిరుదీన్ ఆశర్యపోయాడు. ఆ వ్యక్తి 'ఇది అలసిపోకుండా ఎంత దూరమైనా మిమ్మల్ని తీసుకుపోగలదు, ఎంత బరువయినా మోయగలదు' అన్నాడు.
తను ముందుకు వచ్చి నలభై దీనార్లు యివ్వబోయాడు. అక్కడ గుమిగూడిన జనంలోనుంచి ఒక వ్యక్తి 'యాభై దీనార్లు' అన్నాడు.
ముల్లా నసీరుద్దీన్ కథలు, కబుర్లు నసిరుద్దీన్ తన పొలంలో పని చేసుకుంటూ వున్నాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి గుర్రం మీద వచ్చి ఆగాడు నసీరుద్దీన్ తల పైకెత్తి చూశాడు. అతను 'నువ్వు ఇటుగా ఒక ఎలుగుబంటి రావడం చూశావా?” అన్నాడు. నసిరుద్దీన్ 'అవును చూశాను' అన్నాడు. అతను 'అది ఎటువైపు వెళ్ళింది' అన్నాడు. నసిరుద్దీన్ కుడివైపు చూపించి 'ఇటుగా వెళ్ళింది' అన్నాడు. అతను కనీసం కృతజ్ఞత కూడా చెప్పకుండా గుర్రం మీద వేగంగా వెళ్ళిపోయాడు. 'పది నిమిషాల తరువాత అంతేవేగంగా తిరిగి వచ్చి - 'నిజంగా యిటువైపే వెళ్ళిందా?” అన్నాడు. నసిరుద్దీన్ 'అవును, నిజంగానే వెళ్ళింది, రెండేళ్ళ క్రితం చూశాను' అన్నాడు. నసిరుద్దీన్ తన గాడిదను మార్కెట్లో ముప్పయి దీనార్లకు అమ్మడానికి తీసుకెళ్ళాడు, బేరం కుదిరి ముప్పయి దీనార్లకు అమ్మేశాడు. ఆ కొన్న అతను తెలివైనవాడు. అమ్మడం, కొనడం అతని వృత్తి. నసిరుద్దీన్ అక్కడ వుండగానే అతను గాడిదను అమ్మడానికి బేరం పెట్టాడు. 'బాబూ! చూడండి! ఇది చాలా ప్రత్యేక లక్షణాలు కలిగిన గాడిద. ఎంత శుభ్రంగా, ఎంత బలంగా, ఎంత ఆరోగ్యంగా వున్నదో చూడండి. యిట్లాంటి గాడిదను మీరు జన్మలో చూసి వుండరు.. చాలా చవుక ధర. నలభై దీనార్లు మాత్రమే' అన్నాడు. తన గాడిదలో యిన్ని మంచి లక్షణాలున్నాయని తెలియని నసిరుదీన్ ఆశర్యపోయాడు. ఆ వ్యక్తి 'ఇది అలసిపోకుండా ఎంత దూరమైనా మిమ్మల్ని తీసుకుపోగలదు, ఎంత బరువయినా మోయగలదు' అన్నాడు. తను ముందుకు వచ్చి నలభై దీనార్లు యివ్వబోయాడు. అక్కడ గుమిగూడిన జనంలోనుంచి ఒక వ్యక్తి 'యాభై దీనార్లు' అన్నాడు.© 2017,www.logili.com All Rights Reserved.