కంశ్రీ, సౌభాగ్య సమకాలీన కవులు. నిష్కల్మషులు. నిరాడంబరులు, మానవీయులు. స్నేహాన్ని ప్రేమించేవారు. కవిత్వ ప్రేమికులు. అయినా ఇద్దరి దృక్పథాలు వేరువేరు. ఉద్యమ స్వభావాలూ అంతే. ఇద్దరు కవితాత్మ బంధువులు కావడం వల్ల, కందుకూరి శ్రీరాములు కవిత్వం మీద అవ్యాజ ప్రేమ వల్ల, మరో విషయం కంశ్రీ కవిత్వానికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, ఇద్దరి దారులు వేరైనా నిండుమనసులతో కవిత్వ చెలిమితో ఒకరిలో ఒకరు కలిసే ఉన్నారు. సౌభాగ్య అట్లా కాదు.
కవిత్వం ఆయన అంతిమలక్ష్యమైనా అన్ని సాహిత్య ప్రక్రియల్ని దున్నగల సమర్ధుడు. సకల దేశాల కవిత్వం ఆయన మనోగ్రంథాలయం నిండా ఉండటం వల్లనే అనువాద ప్రక్రియకు ఆత్మబంధువయ్యాడు. ఆయనకు సాహిత్యమంతా ఒక ఎత్తయితే తాత్త్విక చింతన మరో ఎత్తు. జిడ్డు కృష్ణమూర్తి మొదలుకొని ఓషో తాత్త్విక తపస్సు దాకా చేసిన తాత్త్విక తత్త్వం మరో ఎత్తు. ఈ తాత్త్విక గుణ స్వభావాలలోంచే కందుకూరి శ్రీరాములు కవిత్వాన్నీ జీవితాన్నీ ప్రేమించడం మొదలైంది. అదే కందుకూరి శ్రీరాములు 'కవిత్వ జీవనది' గా రూపుదాల్చింది.
కంశ్రీ, సౌభాగ్య సమకాలీన కవులు. నిష్కల్మషులు. నిరాడంబరులు, మానవీయులు. స్నేహాన్ని ప్రేమించేవారు. కవిత్వ ప్రేమికులు. అయినా ఇద్దరి దృక్పథాలు వేరువేరు. ఉద్యమ స్వభావాలూ అంతే. ఇద్దరు కవితాత్మ బంధువులు కావడం వల్ల, కందుకూరి శ్రీరాములు కవిత్వం మీద అవ్యాజ ప్రేమ వల్ల, మరో విషయం కంశ్రీ కవిత్వానికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, ఇద్దరి దారులు వేరైనా నిండుమనసులతో కవిత్వ చెలిమితో ఒకరిలో ఒకరు కలిసే ఉన్నారు. సౌభాగ్య అట్లా కాదు. కవిత్వం ఆయన అంతిమలక్ష్యమైనా అన్ని సాహిత్య ప్రక్రియల్ని దున్నగల సమర్ధుడు. సకల దేశాల కవిత్వం ఆయన మనోగ్రంథాలయం నిండా ఉండటం వల్లనే అనువాద ప్రక్రియకు ఆత్మబంధువయ్యాడు. ఆయనకు సాహిత్యమంతా ఒక ఎత్తయితే తాత్త్విక చింతన మరో ఎత్తు. జిడ్డు కృష్ణమూర్తి మొదలుకొని ఓషో తాత్త్విక తపస్సు దాకా చేసిన తాత్త్విక తత్త్వం మరో ఎత్తు. ఈ తాత్త్విక గుణ స్వభావాలలోంచే కందుకూరి శ్రీరాములు కవిత్వాన్నీ జీవితాన్నీ ప్రేమించడం మొదలైంది. అదే కందుకూరి శ్రీరాములు 'కవిత్వ జీవనది' గా రూపుదాల్చింది.© 2017,www.logili.com All Rights Reserved.