తెలుగుభాషా ప్రాచీనమూలాలు పాళీ, ప్రాకృత భాషల్లోనే ఉన్నాయనే చారిత్రిక వాస్తవాన్ని మరచి, తెలుగునాట పరిశోధకులు సంస్కృత భాషలో తెలుగు మూలాలు వెతికే ప్రయత్నం చేయుటవలన మన భాష అత్యంత ప్రాచీనమైనదనే ఆధారాల్ని చూపించలేకపోతున్నాం. చీమకుర్తి శేషగిరిరావు పాళీలో ఉన్న అనేక తెలుగు పదాలను ఉదాహరణ సహితంగా ఈ చిరు గ్రంథంలో ఎత్తిచూపి పరిశోధకులకు మార్గదర్శమైనారు. ఇలాంటి పరిశోధనే గతంలో తిరుమల రామచంద్ర కూడా చేసి హల సాతవాహన సంకలిత ప్రాకృత 'గాథా సప్త శతి' లో ఉన్న తెలుగు పదాలను ఎత్తి చూపినారు. వీరిద్దరి పరిశోధన నూతన ఆవిష్కారాలకు కారణమైంది. ఈ గ్రంథం చిన్నదైనప్పటికీ భాషాపరిశోధకులకు ఎంతో విలువైనది.
తెలుగుభాషా ప్రాచీనమూలాలు పాళీ, ప్రాకృత భాషల్లోనే ఉన్నాయనే చారిత్రిక వాస్తవాన్ని మరచి, తెలుగునాట పరిశోధకులు సంస్కృత భాషలో తెలుగు మూలాలు వెతికే ప్రయత్నం చేయుటవలన మన భాష అత్యంత ప్రాచీనమైనదనే ఆధారాల్ని చూపించలేకపోతున్నాం. చీమకుర్తి శేషగిరిరావు పాళీలో ఉన్న అనేక తెలుగు పదాలను ఉదాహరణ సహితంగా ఈ చిరు గ్రంథంలో ఎత్తిచూపి పరిశోధకులకు మార్గదర్శమైనారు. ఇలాంటి పరిశోధనే గతంలో తిరుమల రామచంద్ర కూడా చేసి హల సాతవాహన సంకలిత ప్రాకృత 'గాథా సప్త శతి' లో ఉన్న తెలుగు పదాలను ఎత్తి చూపినారు. వీరిద్దరి పరిశోధన నూతన ఆవిష్కారాలకు కారణమైంది. ఈ గ్రంథం చిన్నదైనప్పటికీ భాషాపరిశోధకులకు ఎంతో విలువైనది.© 2017,www.logili.com All Rights Reserved.