వెన్నెలంటే ఇష్టపడని వారేవరుంటారు? జాలువారే వెన్నెల తరగలకు నెలవైన చంద్రుడన్నా ఇష్టపడని వారేవరుంటారు? త్రేతా యుగంలో శ్రీరాముడంతటి అవతార పురుషుడే తన చిన్ననాట ఆకాశంలో తారాడే చంద్రుడు కావాలని మారాం చేశాడుట! పాపం, తల్లి కౌసల్య ఆకాశంలోని చంద్రున్ని భూమిపైకి ఎలా తేగలదు? బుద్ధికుశలుడైన సుమంతుడు ఉపాయంతో పెద్ద అద్దం తెచ్చి రామునికిచ్చాడు. బాల రాముడు ఆ అద్దంలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి సంతోషంతో కేరింతలు పెట్టాడు.
ఆ చంద్రునికి మరో పేరే జాబిల్లి. కవుల వర్ణనకు అత్యంత ప్రీతి పాత్రమైన వస్తువు కూడా జాబిలియే. ఆ 'జాబిలమ్మ' కే తన గీతాలు వినిపించగల నేర్పు ఎవరికుంటుంది, కవులకు గాక...! మిత్రుడు బ్రహ్మానంద చారి కూడా అదే చేశాడు. అనేకానేక సందర్భాలలో తన హృదయంలో చెలరేగిన భావాలను, అనుభూతులను, సంతోషాలను, ఆశలను, నిరాశలను కొంత రసికతకు మరికొంత తాత్త్వికతను జోడించి పాటలుగా ఓలలాడించిన అప్రయత్న ప్రయత్నమే ఈ "జాబిలమ్మ పదాలు".
వెన్నెలంటే ఇష్టపడని వారేవరుంటారు? జాలువారే వెన్నెల తరగలకు నెలవైన చంద్రుడన్నా ఇష్టపడని వారేవరుంటారు? త్రేతా యుగంలో శ్రీరాముడంతటి అవతార పురుషుడే తన చిన్ననాట ఆకాశంలో తారాడే చంద్రుడు కావాలని మారాం చేశాడుట! పాపం, తల్లి కౌసల్య ఆకాశంలోని చంద్రున్ని భూమిపైకి ఎలా తేగలదు? బుద్ధికుశలుడైన సుమంతుడు ఉపాయంతో పెద్ద అద్దం తెచ్చి రామునికిచ్చాడు. బాల రాముడు ఆ అద్దంలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి సంతోషంతో కేరింతలు పెట్టాడు. ఆ చంద్రునికి మరో పేరే జాబిల్లి. కవుల వర్ణనకు అత్యంత ప్రీతి పాత్రమైన వస్తువు కూడా జాబిలియే. ఆ 'జాబిలమ్మ' కే తన గీతాలు వినిపించగల నేర్పు ఎవరికుంటుంది, కవులకు గాక...! మిత్రుడు బ్రహ్మానంద చారి కూడా అదే చేశాడు. అనేకానేక సందర్భాలలో తన హృదయంలో చెలరేగిన భావాలను, అనుభూతులను, సంతోషాలను, ఆశలను, నిరాశలను కొంత రసికతకు మరికొంత తాత్త్వికతను జోడించి పాటలుగా ఓలలాడించిన అప్రయత్న ప్రయత్నమే ఈ "జాబిలమ్మ పదాలు".© 2017,www.logili.com All Rights Reserved.