చారిత్రిక నవలలు వ్రాయడానికి ఆధారాల సేకరణ, విస్తృత విషయ సేకరణ చాలా ముఖ్యం. ఈ రెండింటిలో రాజీలేని కృషి చేసిన ప్రాణ్ రావు ఇప్పటికే చక్కని చారిత్రిక నవలలు వ్రాసారు. ఈ నవల విషయానికి వస్తే రావు గారి విషయ పరిజ్ఞానం, దాన్ని సుసంపన్నం చేయడానికి వారు సంపాదించిన ఆధారాలు, చదివిన చరిత్రకారుల రచనలు, సమకాలీన గ్రంథాలు ప్రాణ్ రావు గారి చిత్తశుద్ధికి, రచనా కౌశల్యానికి అద్దం పడుతాయి. ఇట్టి చారిత్రిక నవల చరిత్రకారులు కూడా విస్మయపడేలా వ్రాసినందుకు వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
చారిత్రిక ఆధారాలు, కాకతీయులపై గ్రంథాలు, సమకాలీన రచనలు చక్కగా వాడుకుని అర్థవంతంగా, విశ్లేషణాపూర్వకంగా తనదైన కవితాత్మక శైలిలో ప్రాణ్ రావు గారు వ్రాసిన 'ప్రతాపరుద్రుడు' చారిత్రిక నవలకు వన్నె తెస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇంత చక్కని రచన చేసిన ప్రాణ్ రావు గారిని అభినందిస్తున్నాను. చారిత్రిక నవలలు కనుమరుగవుతున్న ఈ రోజులలో పాఠకులు ఇలాంటి నవలలను తప్పక ఆదరించాలి.
- ఆచార్య వై వైకుంఠం
చారిత్రిక నవలలు వ్రాయడానికి ఆధారాల సేకరణ, విస్తృత విషయ సేకరణ చాలా ముఖ్యం. ఈ రెండింటిలో రాజీలేని కృషి చేసిన ప్రాణ్ రావు ఇప్పటికే చక్కని చారిత్రిక నవలలు వ్రాసారు. ఈ నవల విషయానికి వస్తే రావు గారి విషయ పరిజ్ఞానం, దాన్ని సుసంపన్నం చేయడానికి వారు సంపాదించిన ఆధారాలు, చదివిన చరిత్రకారుల రచనలు, సమకాలీన గ్రంథాలు ప్రాణ్ రావు గారి చిత్తశుద్ధికి, రచనా కౌశల్యానికి అద్దం పడుతాయి. ఇట్టి చారిత్రిక నవల చరిత్రకారులు కూడా విస్మయపడేలా వ్రాసినందుకు వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. చారిత్రిక ఆధారాలు, కాకతీయులపై గ్రంథాలు, సమకాలీన రచనలు చక్కగా వాడుకుని అర్థవంతంగా, విశ్లేషణాపూర్వకంగా తనదైన కవితాత్మక శైలిలో ప్రాణ్ రావు గారు వ్రాసిన 'ప్రతాపరుద్రుడు' చారిత్రిక నవలకు వన్నె తెస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇంత చక్కని రచన చేసిన ప్రాణ్ రావు గారిని అభినందిస్తున్నాను. చారిత్రిక నవలలు కనుమరుగవుతున్న ఈ రోజులలో పాఠకులు ఇలాంటి నవలలను తప్పక ఆదరించాలి. - ఆచార్య వై వైకుంఠం
© 2017,www.logili.com All Rights Reserved.