భావోద్వేగాలు, రాగద్వేషాలు మానవజీవితాన్ని అనూహ్యమైన మార్పుకు గురిచేస్తాయి. ఇవే జీవితాలను వైవిధ్యభరితం చేసేవి. అందువల్లనే రచయితలకు జీవితం ‘కథా ఇతివృత్త అక్షయ పాత్ర’ అయింది. తన అనుభవంలోకి వచ్చిన, చూసిన పరమాణువంత జీవిత శకలాన్ని నిశితంగా పరిశీలించి, దాని గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోగల శక్తి వెంకటేశ్వరరావు గారికి ఉంది. తను గ్రహించినదాన్ని స్పష్టతతో, సరళమైన శైలితో అద్భుతమైన ‘కథనపు కళ్ళెంతో’ తన ‘కథాపంచకల్యాణి’ విహరింప చేయగలరని వారి కథలను చదివితే తెలుస్తుంది. కథలకు ఆయనిచ్చే ముగింపులో ఎంతో సహేతుకత, సమంజసత ఉంటాయి.
పాత్రల రూపురేఖలు, స్వభావాలు చక్కగా తీర్చిదిద్దుతారు. సన్నివేశ బలానికి గాని, సంభాషణ చమక్కులకు గాని వాటి స్థాయిని పణంగా పెట్టారు. సన్నివేశ చిత్రణేకాక ఆ పాత్రల నడక, తీరు, అంతవరకు చిత్రించబడిన విధానం ఆయన మనస్సులో ప్రతిక్షణం మెదులుతూ ఉంటుంది. ఫలితంగా వాటి సహజగతులనెన్నడు వీడవు. పాత్రలకు చక్కని పరిపుష్టత, పరిపూర్ణత ఒనగూరుతాయి.