విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1862లో జన్మించారు. అంటే మన గురజాడ కన్నా ఒక ఏడాది పెద్దవాడు. పూర్ణ జీవితం అనుభవించి, కవిత్వం కోసమూ, కళల కోసమూ 80 ఏళ్ల వయసులో స్వర్గస్తులయ్యారు. ఈ మహాకవి 150 వ జన్మదినాన్ని పురస్కరించుకుని 2012లోనే ఈ గ్రంథాన్ని ప్రచురించాలనుకున్నాను. ఆయన కవిత్వం గురించి తాత్త్విక, ఆలోచనల గురించి చర్చి౦చాలనుకున్నాం. కానీ అనూహ్యంగా సంభవించిన నిరోధాల వల్ల ఆ పని చేయలేకపోయాను. అప్పట్లో నే రచించిన ఈ గ్రంథంలో 8 వ్యాసాలున్నాయి. రవీంద్రుని, సాహిత్యముపై స్థాలీపులాకంగా చర్చించి నివేదించడం జరిగింది. రవీంద్రుని కవితలలో ప్రముఖమైన 10 కవితలకు తెలుగు అనువాదం కూడా సమకూర్చబడింది. తెలుగు పాఠకుడు సమాదరించుతురుగాక యని ఆశిస్తున్నాను.
- డా.ఆవంత్స సోమసుందర్
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1862లో జన్మించారు. అంటే మన గురజాడ కన్నా ఒక ఏడాది పెద్దవాడు. పూర్ణ జీవితం అనుభవించి, కవిత్వం కోసమూ, కళల కోసమూ 80 ఏళ్ల వయసులో స్వర్గస్తులయ్యారు. ఈ మహాకవి 150 వ జన్మదినాన్ని పురస్కరించుకుని 2012లోనే ఈ గ్రంథాన్ని ప్రచురించాలనుకున్నాను. ఆయన కవిత్వం గురించి తాత్త్విక, ఆలోచనల గురించి చర్చి౦చాలనుకున్నాం. కానీ అనూహ్యంగా సంభవించిన నిరోధాల వల్ల ఆ పని చేయలేకపోయాను. అప్పట్లో నే రచించిన ఈ గ్రంథంలో 8 వ్యాసాలున్నాయి. రవీంద్రుని, సాహిత్యముపై స్థాలీపులాకంగా చర్చించి నివేదించడం జరిగింది. రవీంద్రుని కవితలలో ప్రముఖమైన 10 కవితలకు తెలుగు అనువాదం కూడా సమకూర్చబడింది. తెలుగు పాఠకుడు సమాదరించుతురుగాక యని ఆశిస్తున్నాను. - డా.ఆవంత్స సోమసుందర్© 2017,www.logili.com All Rights Reserved.