కొత్త చిక్కు లెక్కలు
డా. జంపాల చౌదరి
మధురాంతకం నరేంద్రగారిని మధురాంతకం రాజారాంగారి కుమారుడు, ఆయన సాహితీ వారసుడు అని చెప్పేయవచ్చు కానీ అది నరేంద్రగారి ప్రతిభని తక్కువచేయటమే. వస్తుస్వీకరణలోనూ, వ్యక్తీకరణలోనూ, కథావ్యాకరణంలోనూ రాజారాంగారికి, నరేంద్రగారికి పోలికలు తక్కువ. అందుకే కథకుడిగా తనకంటూ ఒక స్పష్టమైన ఉనికి, పలుకుబడి ఏర్పరచుకున్న నరేంద్ర సమకాలీన తెలుగు రచయితల్లో అగ్రస్థానంలో ఉన్నారు.
ఈ రెండేళ్ళ పద్నాలుగు సంపుటంలో కథలు నరేంద్రగారి ఇతర కథలకన్నా కొద్దిగా భిన్నమైనవి. ఈ కథల వస్తువు నిర్మాణం, చిత్రణ కొత్తవి. 2006-2010 మధ్యలో ఈ కథలు అక్కడక్కడా చదువుతున్నప్పుడు గమనించలేదుకాని, విభిన్నంగా కనిపించిన ఈ కథలన్నిటినీ కలిపే సూత్రం ఒకటి ఉంది. కుప్పం బాదుర్ గ్రామీణ బాంక్ మానేజర్గా పనిచేస్తున్నాయన తిరుపతి శివార్లలో కృష్ణానగర్ కాలనీలో కొత్త ఇల్లు కట్టించుకుంటున్నాడు. మునిరత్నంరెడ్డి అనే మేస్త్రీ ఆ ఇల్లు కడుతున్నాడు. ఇంటాయన మామగారు, అత్తగారు దగ్గరుండి పనిపై అజమాయిషీ చేస్తున్నారు...........
కొత్త చిక్కు లెక్కలు డా. జంపాల చౌదరి మధురాంతకం నరేంద్రగారిని మధురాంతకం రాజారాంగారి కుమారుడు, ఆయన సాహితీ వారసుడు అని చెప్పేయవచ్చు కానీ అది నరేంద్రగారి ప్రతిభని తక్కువచేయటమే. వస్తుస్వీకరణలోనూ, వ్యక్తీకరణలోనూ, కథావ్యాకరణంలోనూ రాజారాంగారికి, నరేంద్రగారికి పోలికలు తక్కువ. అందుకే కథకుడిగా తనకంటూ ఒక స్పష్టమైన ఉనికి, పలుకుబడి ఏర్పరచుకున్న నరేంద్ర సమకాలీన తెలుగు రచయితల్లో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ రెండేళ్ళ పద్నాలుగు సంపుటంలో కథలు నరేంద్రగారి ఇతర కథలకన్నా కొద్దిగా భిన్నమైనవి. ఈ కథల వస్తువు నిర్మాణం, చిత్రణ కొత్తవి. 2006-2010 మధ్యలో ఈ కథలు అక్కడక్కడా చదువుతున్నప్పుడు గమనించలేదుకాని, విభిన్నంగా కనిపించిన ఈ కథలన్నిటినీ కలిపే సూత్రం ఒకటి ఉంది. కుప్పం బాదుర్ గ్రామీణ బాంక్ మానేజర్గా పనిచేస్తున్నాయన తిరుపతి శివార్లలో కృష్ణానగర్ కాలనీలో కొత్త ఇల్లు కట్టించుకుంటున్నాడు. మునిరత్నంరెడ్డి అనే మేస్త్రీ ఆ ఇల్లు కడుతున్నాడు. ఇంటాయన మామగారు, అత్తగారు దగ్గరుండి పనిపై అజమాయిషీ చేస్తున్నారు...........© 2017,www.logili.com All Rights Reserved.