ప్రపంచంలోని ప్రతి రచయితా తప్పించుకోలేని ప్రశ్న ఒకటుంది. 'మీరెందుకు రాస్తున్నారు?' అన్నదే ఆ ప్రశ్న. కొందరు సమాధానం చెప్పకుండా జారుకోడానికి ప్రయత్నించారు. ఇంకొందరు తప్పు చెప్పి బుకాయించేశారు. మరికొందరు నిజమే చెప్పారు. కానీ ఏ ఇద్దరి జవాబులూ ఒకటిగా లేవు. 'డోలనం' అనే కథనూ, దాన్లోంచి పుట్టిన "దయచేసి తలుపులు తెరవండి" నాటికనూ, ఆ నాటకంలోంచి రూపొందిన 'చిత్రలేఖ' కథనూ ఒక పుస్తకంగా తీసుకొస్తున్నప్పుడు ఈ ప్రశ్నను నాకు నేను వేసుకోక తప్పలేదు. అప్పుడు, రాయకుండా ఉండడానికి ప్రయత్నించి, విఫలుడైన తర్వాత రాశానని నాకు తెలిసి వచ్చింది. నన్ను వెంటాడుతూ వేధిస్తున్న సమస్యనుంచి తప్పించుకోడానికి ఆ కథ రాయడమొకటే మార్గాంతరమయ్యింది. కానీ ఆ కథ మాత్రం నాపైన ప్రేమతో తనదైన అవగాహనను నాకిచ్చే వెళ్ళింది.
కథకుడు పాత్రై, పాత్రలు వ్యక్తులు పాత్రలుగా మారిపోయే విచిత్రమైన కథ ఇది... ఉద్యమాలూ, ప్రతి ఉద్యమాలూ త్రాసులోని పళ్ళాల్లా ఎటు బరువెక్కువైతే అటు ఊగుతూ వుంటాయి. ఎప్పుడో ఒకనాటికి వాటి మధ్య తేడా తగ్గిపోతుందని ఆశిస్తాం.... 'డోలనం' కథానికలో.......
లిఫ్టుతలుపుల్ని మూయకుంటే ప్రమాదం... మనస్సుల తలుపుల్ని ఎంతగా తెరవగలిగితే అంత ప్రమాదం... లిఫ్టు తలుపుల్ని మూయమని రికార్డెడ్ సందేశాన్ని మొగిన్చినట్టే, మనస్సుల తలుపుల్ని తెరవమని చెప్పగలిగే సందేశమొకటి ప్రతి మనస్సు దగ్గరా అమరిస్తే ఎంత బావుణ్నోగదా!
'దయ చేసి తలుపులు తెరవండి' నాటికలో....
ఈ అపార్ట్ మెంట్ల మధ్యలో కట్టిన గోడలెంతమందమో మీకు తెలియదు. ఒకరి ప్రైవసీలోకి ఇంకొకరు దూరకుండా వాక్యూమ్ టైట్ గోడలున్నాయిక్కడ. కిటికీలు తెరిస్తే లోపలేసుకున్న యేసి వృథా అవుతుందని జాగ్రత్త పడతాం. మాకున్న సమయం న్యూస్ పేపర్లు చదవడానికీ, టీవీ చూడ్డానికీ చాలటం లేదు.
' చిత్రలేఖ' కథానికలో.....
- మధురాంతకం నరేంద్ర
ప్రపంచంలోని ప్రతి రచయితా తప్పించుకోలేని ప్రశ్న ఒకటుంది. 'మీరెందుకు రాస్తున్నారు?' అన్నదే ఆ ప్రశ్న. కొందరు సమాధానం చెప్పకుండా జారుకోడానికి ప్రయత్నించారు. ఇంకొందరు తప్పు చెప్పి బుకాయించేశారు. మరికొందరు నిజమే చెప్పారు. కానీ ఏ ఇద్దరి జవాబులూ ఒకటిగా లేవు. 'డోలనం' అనే కథనూ, దాన్లోంచి పుట్టిన "దయచేసి తలుపులు తెరవండి" నాటికనూ, ఆ నాటకంలోంచి రూపొందిన 'చిత్రలేఖ' కథనూ ఒక పుస్తకంగా తీసుకొస్తున్నప్పుడు ఈ ప్రశ్నను నాకు నేను వేసుకోక తప్పలేదు. అప్పుడు, రాయకుండా ఉండడానికి ప్రయత్నించి, విఫలుడైన తర్వాత రాశానని నాకు తెలిసి వచ్చింది. నన్ను వెంటాడుతూ వేధిస్తున్న సమస్యనుంచి తప్పించుకోడానికి ఆ కథ రాయడమొకటే మార్గాంతరమయ్యింది. కానీ ఆ కథ మాత్రం నాపైన ప్రేమతో తనదైన అవగాహనను నాకిచ్చే వెళ్ళింది. కథకుడు పాత్రై, పాత్రలు వ్యక్తులు పాత్రలుగా మారిపోయే విచిత్రమైన కథ ఇది... ఉద్యమాలూ, ప్రతి ఉద్యమాలూ త్రాసులోని పళ్ళాల్లా ఎటు బరువెక్కువైతే అటు ఊగుతూ వుంటాయి. ఎప్పుడో ఒకనాటికి వాటి మధ్య తేడా తగ్గిపోతుందని ఆశిస్తాం.... 'డోలనం' కథానికలో....... లిఫ్టుతలుపుల్ని మూయకుంటే ప్రమాదం... మనస్సుల తలుపుల్ని ఎంతగా తెరవగలిగితే అంత ప్రమాదం... లిఫ్టు తలుపుల్ని మూయమని రికార్డెడ్ సందేశాన్ని మొగిన్చినట్టే, మనస్సుల తలుపుల్ని తెరవమని చెప్పగలిగే సందేశమొకటి ప్రతి మనస్సు దగ్గరా అమరిస్తే ఎంత బావుణ్నోగదా! 'దయ చేసి తలుపులు తెరవండి' నాటికలో.... ఈ అపార్ట్ మెంట్ల మధ్యలో కట్టిన గోడలెంతమందమో మీకు తెలియదు. ఒకరి ప్రైవసీలోకి ఇంకొకరు దూరకుండా వాక్యూమ్ టైట్ గోడలున్నాయిక్కడ. కిటికీలు తెరిస్తే లోపలేసుకున్న యేసి వృథా అవుతుందని జాగ్రత్త పడతాం. మాకున్న సమయం న్యూస్ పేపర్లు చదవడానికీ, టీవీ చూడ్డానికీ చాలటం లేదు. ' చిత్రలేఖ' కథానికలో..... - మధురాంతకం నరేంద్ర© 2017,www.logili.com All Rights Reserved.