జీవితం ఇచ్చే అనుభవం వొకోసారి వొకటే అయినా, దానిని మనుషులు స్పందించే తీరు మాత్రం వేర్వేరు గానే వుంటుంది. జీవితానుభవాలకు వేర్వేరు ప్రక్రియల్లో రాసే సాహిత్యకారులు ప్రతిఫలించే తీరు గూడా భిన్నంగానే వుంటుంది. నిజానికి రచయితకు ప్రక్రియల నెన్నుకోవడంలో పెద్ద స్వేచ్చేమీ ఉండదు. ముందుగా తనకు పరిచయమైనా ప్రక్రియనో, లేకపోతే అప్పుడు బాగా ప్రాచుర్యంలో వుండే ప్రక్రియనో అతడు వాడుకొంటాడు. ఏదోవొక ప్రక్రియలో పనిచేసుకుంటూ వెళ్ళాక, కొంతకాలం తర్వాత, ఆ సాహిత్యకారుడు ఆ ప్రక్రియ స్వభావ ప్రభావంలోకి పడిపోతాడు. అందుకే చాలాకాలం పాటూ కవిత్వమే రాసే వ్యక్తి చూపుకూ, కథలు రాస్తున్న వ్యక్తి దృష్టికీ మధ్య తేడా తప్పకుండా వచ్చి చేరుతుంది. రెండు ప్రక్రియల్లో రాస్తున్న వ్యక్తి రచనల్లో వొకదాని ప్రభావం ఇంకొకదానిపైన వుండి తీరుతుంది. కొన్ని విశిష్టమైన రచనలు ఈ ప్రక్రియలనే గోడల్ని పగులగోట్టేసి, ఏ నిర్వచనాలకూ లొంగకుండా తయారవుతాయి.
ఎదురు చూడడం కోసం వేచి చూస్తూ... మనమిక్కడ ఏంచేస్తున్నామన్నదే ప్రశ్న. మనం అదృష్టవంతులమెందుకంటే దానికి మనకో సమాధానం ఉంది. అవును, ఈ అంతులేని అయోమయంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా వుంది. మనం రాబోయే గోడో కోసం ఎదురుచూస్తున్నాం.శామ్యూల్ బెకెట్ 'వెయిటింగ్ ఫార్ గోడో'లో వ్లాడిమర్....ఆ ఇంట్లో ఉండే ఆ షావుకారు దేవుడయ్య కోసరం పడిగాపులు పడతా వుండాడు. నేను కూడా ఒక దేవుడయ్య కోసరం ఎతుకులాడతా ఉండాను.
బుడబుక్కలవాడు 'ఇంద్ర ధనుస్సు'లో... జరుగుతున్నది ఒక్కటే - ఒక నిరంతరమైన ఎదురుచూపు. ఎవరి కోసం, ఎక్కడ, ఎప్పుడు, ఎలా - అన్నీ ప్రశ్నలే. సమాధానాలు కవ్విస్తాయి. పాఠా౦తరాలే మిగులుతాయి.
జీవితం ఇచ్చే అనుభవం వొకోసారి వొకటే అయినా, దానిని మనుషులు స్పందించే తీరు మాత్రం వేర్వేరు గానే వుంటుంది. జీవితానుభవాలకు వేర్వేరు ప్రక్రియల్లో రాసే సాహిత్యకారులు ప్రతిఫలించే తీరు గూడా భిన్నంగానే వుంటుంది. నిజానికి రచయితకు ప్రక్రియల నెన్నుకోవడంలో పెద్ద స్వేచ్చేమీ ఉండదు. ముందుగా తనకు పరిచయమైనా ప్రక్రియనో, లేకపోతే అప్పుడు బాగా ప్రాచుర్యంలో వుండే ప్రక్రియనో అతడు వాడుకొంటాడు. ఏదోవొక ప్రక్రియలో పనిచేసుకుంటూ వెళ్ళాక, కొంతకాలం తర్వాత, ఆ సాహిత్యకారుడు ఆ ప్రక్రియ స్వభావ ప్రభావంలోకి పడిపోతాడు. అందుకే చాలాకాలం పాటూ కవిత్వమే రాసే వ్యక్తి చూపుకూ, కథలు రాస్తున్న వ్యక్తి దృష్టికీ మధ్య తేడా తప్పకుండా వచ్చి చేరుతుంది. రెండు ప్రక్రియల్లో రాస్తున్న వ్యక్తి రచనల్లో వొకదాని ప్రభావం ఇంకొకదానిపైన వుండి తీరుతుంది. కొన్ని విశిష్టమైన రచనలు ఈ ప్రక్రియలనే గోడల్ని పగులగోట్టేసి, ఏ నిర్వచనాలకూ లొంగకుండా తయారవుతాయి. ఎదురు చూడడం కోసం వేచి చూస్తూ... మనమిక్కడ ఏంచేస్తున్నామన్నదే ప్రశ్న. మనం అదృష్టవంతులమెందుకంటే దానికి మనకో సమాధానం ఉంది. అవును, ఈ అంతులేని అయోమయంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా వుంది. మనం రాబోయే గోడో కోసం ఎదురుచూస్తున్నాం.శామ్యూల్ బెకెట్ 'వెయిటింగ్ ఫార్ గోడో'లో వ్లాడిమర్....ఆ ఇంట్లో ఉండే ఆ షావుకారు దేవుడయ్య కోసరం పడిగాపులు పడతా వుండాడు. నేను కూడా ఒక దేవుడయ్య కోసరం ఎతుకులాడతా ఉండాను. బుడబుక్కలవాడు 'ఇంద్ర ధనుస్సు'లో... జరుగుతున్నది ఒక్కటే - ఒక నిరంతరమైన ఎదురుచూపు. ఎవరి కోసం, ఎక్కడ, ఎప్పుడు, ఎలా - అన్నీ ప్రశ్నలే. సమాధానాలు కవ్విస్తాయి. పాఠా౦తరాలే మిగులుతాయి.© 2017,www.logili.com All Rights Reserved.