"తెలుగు మాగాణీలో మాదన్న తరగని పంట
తెలుగు ప్రజ్ఞని నిరంతరం మోగించే జేగంట"
చారిత్రిక నవల రాయడం కత్తి మీద సాములాంటిది. నిగ్గుదేరిన యోధుడికి మాత్రమే అది సాధ్యం. ప్రాణరావుగారి కలం రెండు వైపులా పదును గల కత్తి - అటు సాహిత్యపరంగా విన్యాసం చేయగలది, ఇటు సత్యాన్వేషణలో సానదేరి దూసుకుపోగలది. "రుద్రమదేవి" నవలలోనూ అది రుజువయింది. "మహామంత్రి మాదన్న" లో ఆ సత్యసంధత మరింత రాటుదేలింది.
సమాజంలో వివిధ వృత్తులవారి జీవనచరిత్ర, కుటుంబజీవనం, సామాజిక సంభంధాలు, సుల్తాను-సేనానాయకులు-మంత్రుల మధ్య సంబంధాలు, పాలక పాలిత వర్గాల మధ్య అంతరాలు, మత విశ్వాసాలు, ధార్మిక చింతన, రాజకీయ రంగంలోని అనైతిక వ్యవహారాలు, స్వార్ధపు ఆరాటాలు-పోరాటాలు -ఇలా మంచి చెడూ పరస్పర వైరుధ్యాలు రాజ్యమేలిన నాటి సమాజాన్ని అద్దంలో పెట్టి చూపుతుందీ నవల. ముఖ్యంగా పాత్ర చిత్రణలో ప్రాణ్ రావు గారి కలం మంచి 'కొలవరి' నవలలో సన్నివేశాల ఔచిత్యం కచ్చితంగా, సమతూకంగా ఉంటుంది. రవిగాంచిన చోటుని కవి చూడగలడనే నానుడి "నిజంగా నిజం" అన్పించేట్టు పాత్రలు వాటంతటవే సహజసిద్దంగా లేచి వచినట్లు ఔచిత్యం ఎక్కడా తోణికిసలాడకుండా ఉంటుంది.
-ఎస్.ఎం.ప్రాణ్ రావ్
"తెలుగు మాగాణీలో మాదన్న తరగని పంట తెలుగు ప్రజ్ఞని నిరంతరం మోగించే జేగంట" చారిత్రిక నవల రాయడం కత్తి మీద సాములాంటిది. నిగ్గుదేరిన యోధుడికి మాత్రమే అది సాధ్యం. ప్రాణరావుగారి కలం రెండు వైపులా పదును గల కత్తి - అటు సాహిత్యపరంగా విన్యాసం చేయగలది, ఇటు సత్యాన్వేషణలో సానదేరి దూసుకుపోగలది. "రుద్రమదేవి" నవలలోనూ అది రుజువయింది. "మహామంత్రి మాదన్న" లో ఆ సత్యసంధత మరింత రాటుదేలింది. సమాజంలో వివిధ వృత్తులవారి జీవనచరిత్ర, కుటుంబజీవనం, సామాజిక సంభంధాలు, సుల్తాను-సేనానాయకులు-మంత్రుల మధ్య సంబంధాలు, పాలక పాలిత వర్గాల మధ్య అంతరాలు, మత విశ్వాసాలు, ధార్మిక చింతన, రాజకీయ రంగంలోని అనైతిక వ్యవహారాలు, స్వార్ధపు ఆరాటాలు-పోరాటాలు -ఇలా మంచి చెడూ పరస్పర వైరుధ్యాలు రాజ్యమేలిన నాటి సమాజాన్ని అద్దంలో పెట్టి చూపుతుందీ నవల. ముఖ్యంగా పాత్ర చిత్రణలో ప్రాణ్ రావు గారి కలం మంచి 'కొలవరి' నవలలో సన్నివేశాల ఔచిత్యం కచ్చితంగా, సమతూకంగా ఉంటుంది. రవిగాంచిన చోటుని కవి చూడగలడనే నానుడి "నిజంగా నిజం" అన్పించేట్టు పాత్రలు వాటంతటవే సహజసిద్దంగా లేచి వచినట్లు ఔచిత్యం ఎక్కడా తోణికిసలాడకుండా ఉంటుంది. -ఎస్.ఎం.ప్రాణ్ రావ్© 2017,www.logili.com All Rights Reserved.