సమగ్ర పూజాహోమ మకరందం
పూజా నియమ నిబంధనలు-విధులు
1) బ్రహ్మముహూర్తం (ప్రాతఃకాలము) 5-00 గం॥ల లోపు కాలకృత్యములు తీర్చుకొని, స్నానం చేసి ఉతికిన వస్త్రములు ధరించి శుచియై ప్రశాంత చిత్తముతో పవిత్రమైన భావాలతో మనస్సును నిర్మలంగా, నిశ్చలముగా ఉంచుకోవాలి.
మనస్సంతా నిండా దైవీభావాలను నింపుకొని ఆ పరమాత్మకు శరణాగతుడై వేడుకోవాలి.
ప్రతీరోజు భక్తులు పరిపూర్ణ విశ్వాసముతో ప్రగాఢమైన భక్తితో ఏ కోరిక లేకుండా, నిష్కామ భావముతో భగవంతుని పూజించుదురో వారికి అనంత ఫలము కలుగును.
పూజ ప్రారంభించినపుడు పనులన్ని ముగించుకొని పూజలో కూర్చొనవలెను. నిదానముగా, ప్రేమతో, భగవంతుడు లేదా దేవి మనముందే ఉన్నారని భావనతో పూజించవలెను.
ముందు పూజ తరువాత స్తోత్రపారాయణము, జపము, ధ్యానము ఇవి వరుస క్రమము. లేదా జపము, ధ్యానము ముందే చేసుకొనవచ్చును. పూజకు సంబంధించిన వస్తువులన్ని సమకూర్చుకొని మధ్యమధ్యలో
లేవకుండా మౌనమును పాటించుచుండవలెను. మాట లాడరాదు. పూజా సమయంలో ఇంటిలోనున్న వారందరు ప్రశాంతముగా వారివారి పనులు నిర్వర్తించవలెను................
సమగ్ర పూజాహోమ మకరందం పూజా నియమ నిబంధనలు-విధులు 1) బ్రహ్మముహూర్తం (ప్రాతఃకాలము) 5-00 గం॥ల లోపు కాలకృత్యములు తీర్చుకొని, స్నానం చేసి ఉతికిన వస్త్రములు ధరించి శుచియై ప్రశాంత చిత్తముతో పవిత్రమైన భావాలతో మనస్సును నిర్మలంగా, నిశ్చలముగా ఉంచుకోవాలి. మనస్సంతా నిండా దైవీభావాలను నింపుకొని ఆ పరమాత్మకు శరణాగతుడై వేడుకోవాలి. ప్రతీరోజు భక్తులు పరిపూర్ణ విశ్వాసముతో ప్రగాఢమైన భక్తితో ఏ కోరిక లేకుండా, నిష్కామ భావముతో భగవంతుని పూజించుదురో వారికి అనంత ఫలము కలుగును. పూజ ప్రారంభించినపుడు పనులన్ని ముగించుకొని పూజలో కూర్చొనవలెను. నిదానముగా, ప్రేమతో, భగవంతుడు లేదా దేవి మనముందే ఉన్నారని భావనతో పూజించవలెను. ముందు పూజ తరువాత స్తోత్రపారాయణము, జపము, ధ్యానము ఇవి వరుస క్రమము. లేదా జపము, ధ్యానము ముందే చేసుకొనవచ్చును. పూజకు సంబంధించిన వస్తువులన్ని సమకూర్చుకొని మధ్యమధ్యలో లేవకుండా మౌనమును పాటించుచుండవలెను. మాట లాడరాదు. పూజా సమయంలో ఇంటిలోనున్న వారందరు ప్రశాంతముగా వారివారి పనులు నిర్వర్తించవలెను................© 2017,www.logili.com All Rights Reserved.