ఐరోపా, అమెరికా, భారతదేశాలలో ఈ పుస్తక రచయిత కొంతమంది చిత్తశుద్ధి గల ఆధ్యాత్మిక సాధకులకు ఇచ్చిన ఉపన్యాసాల సమాహారమే ఈ పుస్తకం రూపం. ఆధ్యాత్మిక జీవితానికి, ముఖ్యంగా ధ్యానానికి కావలసిన సూచనలు ఈ పుస్తకంలో చోటుచేసుకున్నాయి. ఈ పుస్తకం ప్రధానంగా పారమార్థిక సాధకుల ఉపయోగార్థమే అయినా, ప్రత్యేకంగా ఎవరైతే తత్పరతతో జప, ధ్యాన, ప్రార్థనలు అనుష్టిస్తూ వ్యాకులతతో ఆధ్యాత్మిక పురోగతి పొందగోరతారో, వారికి ఎంతగానో ఉపయుక్తమవుతుంది. నిజమైన ఆధ్యాత్మిక జిజ్ఞాసువుకు అవసరమైన మార్గదర్శకత్వం - సాధకుడు ప్రారంభంలో పాటించవలసిన నియమాలు, ధ్యాన పద్ధతులు, అధిగమించవలసిన అడ్డంకులు, ఆధ్యాత్మిక అనుభూతుల లక్షణాలు, ఆత్మజ్ఞానియైన గురువు నుండి తప్ప లభించని ధ్యానమయ జీవితానికి కావాల్సిన వివరాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.
ఐరోపా, అమెరికా, భారతదేశాలలో ఈ పుస్తక రచయిత కొంతమంది చిత్తశుద్ధి గల ఆధ్యాత్మిక సాధకులకు ఇచ్చిన ఉపన్యాసాల సమాహారమే ఈ పుస్తకం రూపం. ఆధ్యాత్మిక జీవితానికి, ముఖ్యంగా ధ్యానానికి కావలసిన సూచనలు ఈ పుస్తకంలో చోటుచేసుకున్నాయి. ఈ పుస్తకం ప్రధానంగా పారమార్థిక సాధకుల ఉపయోగార్థమే అయినా, ప్రత్యేకంగా ఎవరైతే తత్పరతతో జప, ధ్యాన, ప్రార్థనలు అనుష్టిస్తూ వ్యాకులతతో ఆధ్యాత్మిక పురోగతి పొందగోరతారో, వారికి ఎంతగానో ఉపయుక్తమవుతుంది. నిజమైన ఆధ్యాత్మిక జిజ్ఞాసువుకు అవసరమైన మార్గదర్శకత్వం - సాధకుడు ప్రారంభంలో పాటించవలసిన నియమాలు, ధ్యాన పద్ధతులు, అధిగమించవలసిన అడ్డంకులు, ఆధ్యాత్మిక అనుభూతుల లక్షణాలు, ఆత్మజ్ఞానియైన గురువు నుండి తప్ప లభించని ధ్యానమయ జీవితానికి కావాల్సిన వివరాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.© 2017,www.logili.com All Rights Reserved.