"తంజావూరు" సంస్థానం.
సంస్థాన సభ కొలువుదీరి ఉంది. పాలకుడు చెన్నప్పనాయకుడు సింహాసనంపై ఆశీనుడై ఉండగా....మంత్రులు, కవులు, కళాకారులు వారివారి స్థానాల్లో ఆశీనులైవున్నారు.
విజయనగర సామ్రాజ్యం. సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయల పాలనలో సంపదలతో తులతూగుతూ ప్రపంచంలోని సంపన్న రాజ్యాలలో ప్రసిద్ధమైన రాజ్యాల్లో ఒకటై విరాజిల్లుతూ ఉంది. ఆస్థానంలో "అష్టదిగ్గజాలు" అనే కవులతో పాటు ఎందరో పండితులు, కన్నడ, తెలుగు, సంస్కృత భాషలకు చెందినవారు ఉన్నారు. సంగీత విద్వాంసులు, నాట్యకోవిదులు ఎందరో ఉన్నారు. "వేదపండితులు" నిత్యం చేస్తూ ఉన్న వేదఘోషలు..... పూజలు..... పునస్కారాలతో రాజ్యం సుభిక్షమై విరాజిల్లుతూ ఉంది.
ఒక్కసారిగా దక్షిణభారతదేశంలోని మరోవైపునున్న బహుమనీరాజ్య భాగాలైన ఐదు రాజ్యాలు విభేదాలను విస్మరించి ఒకటైయ్యాయి. విజయనగర రాజ్యాలపై విరుచుకుపడ్డాయి. ఐదు సైన్యాల పైన భీకరపోరు జరిగింది.
-ఐ.ఎల్.ఎన్.చంద్రశేఖర్
"తంజావూరు" సంస్థానం. సంస్థాన సభ కొలువుదీరి ఉంది. పాలకుడు చెన్నప్పనాయకుడు సింహాసనంపై ఆశీనుడై ఉండగా....మంత్రులు, కవులు, కళాకారులు వారివారి స్థానాల్లో ఆశీనులైవున్నారు. విజయనగర సామ్రాజ్యం. సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయల పాలనలో సంపదలతో తులతూగుతూ ప్రపంచంలోని సంపన్న రాజ్యాలలో ప్రసిద్ధమైన రాజ్యాల్లో ఒకటై విరాజిల్లుతూ ఉంది. ఆస్థానంలో "అష్టదిగ్గజాలు" అనే కవులతో పాటు ఎందరో పండితులు, కన్నడ, తెలుగు, సంస్కృత భాషలకు చెందినవారు ఉన్నారు. సంగీత విద్వాంసులు, నాట్యకోవిదులు ఎందరో ఉన్నారు. "వేదపండితులు" నిత్యం చేస్తూ ఉన్న వేదఘోషలు..... పూజలు..... పునస్కారాలతో రాజ్యం సుభిక్షమై విరాజిల్లుతూ ఉంది. ఒక్కసారిగా దక్షిణభారతదేశంలోని మరోవైపునున్న బహుమనీరాజ్య భాగాలైన ఐదు రాజ్యాలు విభేదాలను విస్మరించి ఒకటైయ్యాయి. విజయనగర రాజ్యాలపై విరుచుకుపడ్డాయి. ఐదు సైన్యాల పైన భీకరపోరు జరిగింది. -ఐ.ఎల్.ఎన్.చంద్రశేఖర్© 2017,www.logili.com All Rights Reserved.