కథ సింగమనేని నారాయణ గారికి ఇష్టమైన సాహితీ ప్రక్రియ. కథ ఎలా రాయాలీ, ఏ వస్తువులు కథలుగా రాణిస్తాయి. కథ ప్రయోజనం ఏమై ఉండాలి, కథలో ఔచిత్యం ఎలా పాటించాలి, సామజిక ప్రయోజనం లేని కథలు ఎందుకు రాయకూడదు, కథలను రాణింప జేసే లక్షణాలేమిటి? ఇలాంటి అనేక విషయాలు ఈ వ్యాసాలను చదివితే లక్ష్య లక్షణ పూర్వకంగా పాఠకులకు అర్థమవుతాయి. పాఠకులు మంచి కథలను ఎలా చదివి అర్థం చేసుకుని ఆస్వాదించాలో నేర్చుకుంటారు. రచయితలు మంచి కథలు ఎలా రాయాలో నేర్చుకుంటారు.
-ఓల్గా.
సింగమనేని సాహిత్యంలో వస్తువులోనే కాదు. శిల్పంలో కూడా వాస్తవికతే ప్రధానంగా ఉండాలని భావిస్తారు. పాఠకుడిని బోల్తా కొట్టించే మలుపులను, ప్రయోగాల పేరుతో పాఠకులకు వస్తువు అందకుండా అడ్డుకునే ప్రయోగాలను, పాఠకుడు ఉహించని మలుపులను, ఆయన నిర్ద్వందంగా తిరస్కరిస్తారు. అందుకే ఆయన "స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉంటే మెలోడ్రామా లేకుండా వస్తువును ఆవిష్కరించవచ్చు" నంటారు.(రాయలసీమ కథ చిత్రం) సిద్దాంతాల కోసం రచన చేయడాన్ని కొడవటిగంటి లాగే సింగమనేని కూడా వ్యతిరేకిస్తారు. రచయితలు సామజిక మూలాలు తవ్వితీయాలి గానీ, రచనలి సిద్దంతాలు వల్లించ కూడదంటారు......శిల్పమర్యాదాతిక్రమణను ఆమోదించని నిబద్ద విమర్శకులు సింగమనేని.
- రాచపాలెం. చంద్రశేఖర రెడ్డి.
కథ సింగమనేని నారాయణ గారికి ఇష్టమైన సాహితీ ప్రక్రియ. కథ ఎలా రాయాలీ, ఏ వస్తువులు కథలుగా రాణిస్తాయి. కథ ప్రయోజనం ఏమై ఉండాలి, కథలో ఔచిత్యం ఎలా పాటించాలి, సామజిక ప్రయోజనం లేని కథలు ఎందుకు రాయకూడదు, కథలను రాణింప జేసే లక్షణాలేమిటి? ఇలాంటి అనేక విషయాలు ఈ వ్యాసాలను చదివితే లక్ష్య లక్షణ పూర్వకంగా పాఠకులకు అర్థమవుతాయి. పాఠకులు మంచి కథలను ఎలా చదివి అర్థం చేసుకుని ఆస్వాదించాలో నేర్చుకుంటారు. రచయితలు మంచి కథలు ఎలా రాయాలో నేర్చుకుంటారు. -ఓల్గా. సింగమనేని సాహిత్యంలో వస్తువులోనే కాదు. శిల్పంలో కూడా వాస్తవికతే ప్రధానంగా ఉండాలని భావిస్తారు. పాఠకుడిని బోల్తా కొట్టించే మలుపులను, ప్రయోగాల పేరుతో పాఠకులకు వస్తువు అందకుండా అడ్డుకునే ప్రయోగాలను, పాఠకుడు ఉహించని మలుపులను, ఆయన నిర్ద్వందంగా తిరస్కరిస్తారు. అందుకే ఆయన "స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉంటే మెలోడ్రామా లేకుండా వస్తువును ఆవిష్కరించవచ్చు" నంటారు.(రాయలసీమ కథ చిత్రం) సిద్దాంతాల కోసం రచన చేయడాన్ని కొడవటిగంటి లాగే సింగమనేని కూడా వ్యతిరేకిస్తారు. రచయితలు సామజిక మూలాలు తవ్వితీయాలి గానీ, రచనలి సిద్దంతాలు వల్లించ కూడదంటారు......శిల్పమర్యాదాతిక్రమణను ఆమోదించని నిబద్ద విమర్శకులు సింగమనేని. - రాచపాలెం. చంద్రశేఖర రెడ్డి.
© 2017,www.logili.com All Rights Reserved.