పొమేడ్ రాసుకున్న వేరువేరు చాయల జుట్టు, ఒక చెవికి వైడూర్యం పొదిగిన పోగు, మర్యాదకరమైన నడవడి కలిగివున్న ఆ నౌకరు వాలకమంతా చూస్తే అతడొక ఆధునిక అభ్యుదయ తరానికి చెందిన మనిషి అని బోధపడుతుంది. అతడు రోడ్డుకేసి దృష్టిని సారించి, "జాడ లేదు అయ్యగారూ!” అని జవాబిచ్చాడు. “జాడ లేదా?” అతని యజమాని మారు పలికాడు. "లేదయ్యా!” అని ఆ నౌకరు మళ్లీ అన్నాడు.
ఆ పెద్దమనిషి నిట్టూర్చి ఒక చిన్న బెంచిమీద చతికిలబడ్డాడు. అతడు కాళ్లు అలా ఎడంగా పెట్టుకుని ఆలోచనా నిమగ్నుడై చుట్టూ పరికిస్తూ కూర్చుని వుండగా అతడెవరో పాఠకుడికి పరిచయం చేద్దాం.
అతని పేరు నికొలాయ్ పెట్రోవిచ్ కిర్సానొవ్. ఈ సత్రవుకి దాదాపు పదిహేను మైళ్ల దూరం లోపల రెండు వందలమంది రైతులుగల మంచి ఎస్టేటు అతనికి వుంది. అతను చెప్పేట్టుగా తన రైతులతో తెగతెంపులు చేసుకుని, తన సొంత "వ్యవసాయ క్షేత్రాన్ని” నెలకొల్పుకున్నాడు. అది దాదాపు అయిదు వేల ఎకరాల ఆస్తి. తండ్రి ఒక జనరల్. 1812లో యుద్ధంలో పాల్గొన్నాడు. విద్యాగంధం లేని మోటు మనిషి, సత్స్వభావుడైన రష్యను. జీవితకాలమంతా సైనిక సర్వీసులోనే వున్నాడు. మొదట ఒక బ్రిగేడుకి, తరువాత ఒక డివిజనికి కమాండరుగా వున్నాడు. సర్వదా రాష్ట్రాలలోనే వుంటూ వుండేవాడు..............
"ఏం ప్యోత్? ఇంకా వాళ్ల జాడ ఏం లేదా?” x రహదారి మీదవున్న ఒక చిన్న గ్రామీణ సత్రం గుమ్మంలోకి దుమ్ముకొట్టుకుని వున్న కోటూ, గళ్ల లాగూ నెత్తిమీద టోపీ లేకుండా వస్తూ వస్తూ, నలభైఏళ్లకు కొద్దిగా పైబడ్డ ఒక పెద్ద మనిషి, గండుముఖమూ, కాంతి హీనమైన చిన్నికళ్లు, గెడ్డంమీద తెల్లని నూగు వెంట్రుకలూ కలిగివున్న తన యువ నౌకరుని అడిగాడు. అది 1859 మే 20 తేదీ. పొమేడ్ రాసుకున్న వేరువేరు చాయల జుట్టు, ఒక చెవికి వైడూర్యం పొదిగిన పోగు, మర్యాదకరమైన నడవడి కలిగివున్న ఆ నౌకరు వాలకమంతా చూస్తే అతడొక ఆధునిక అభ్యుదయ తరానికి చెందిన మనిషి అని బోధపడుతుంది. అతడు రోడ్డుకేసి దృష్టిని సారించి, "జాడ లేదు అయ్యగారూ!” అని జవాబిచ్చాడు. “జాడ లేదా?” అతని యజమాని మారు పలికాడు. "లేదయ్యా!” అని ఆ నౌకరు మళ్లీ అన్నాడు. ఆ పెద్దమనిషి నిట్టూర్చి ఒక చిన్న బెంచిమీద చతికిలబడ్డాడు. అతడు కాళ్లు అలా ఎడంగా పెట్టుకుని ఆలోచనా నిమగ్నుడై చుట్టూ పరికిస్తూ కూర్చుని వుండగా అతడెవరో పాఠకుడికి పరిచయం చేద్దాం. అతని పేరు నికొలాయ్ పెట్రోవిచ్ కిర్సానొవ్. ఈ సత్రవుకి దాదాపు పదిహేను మైళ్ల దూరం లోపల రెండు వందలమంది రైతులుగల మంచి ఎస్టేటు అతనికి వుంది. అతను చెప్పేట్టుగా తన రైతులతో తెగతెంపులు చేసుకుని, తన సొంత "వ్యవసాయ క్షేత్రాన్ని” నెలకొల్పుకున్నాడు. అది దాదాపు అయిదు వేల ఎకరాల ఆస్తి. తండ్రి ఒక జనరల్. 1812లో యుద్ధంలో పాల్గొన్నాడు. విద్యాగంధం లేని మోటు మనిషి, సత్స్వభావుడైన రష్యను. జీవితకాలమంతా సైనిక సర్వీసులోనే వున్నాడు. మొదట ఒక బ్రిగేడుకి, తరువాత ఒక డివిజనికి కమాండరుగా వున్నాడు. సర్వదా రాష్ట్రాలలోనే వుంటూ వుండేవాడు..............© 2017,www.logili.com All Rights Reserved.