ఎందుకురాసాను ఎందుకు రాస్తున్నాను ఎందుకురాస్తాను
- నిర్వ్యవసాయంగా తినికూర్చుని సమాజానికి బరువవుతానేమోనని
- సమాజోద్ధరణ యజ్ఞంలో నేనుకూడా ఓ సమిధనవ్వాలని - అవిద్య, ఆజ్ఞానంలో దశాబ్దాలు గడిపిన నాకు ఒకింత తెలియని
విషయాలు తెలుసుకుని, వాటిని మరింత మందికి
| సరళమైన, సరసమైనభాషలో, భావనలో అందించే చిరుప్రయత్నం చేద్దామని
యువతలో పఠనాసక్తి కలిగించటానికిపడుతున్న ప్రయాస ఇది మనతెలుగుభాషాసౌరభాన్ని మరోసారిపునశ్చరణ చేసి తెలుగువారి విశిష్టమైనసంప్రదాయ, సంస్కృతులను రచనలలో చొప్పించి నేటి ఆధునిక సమాజానికి కనువిప్పు కల్గించాలని. భ్రష్టుపడుతున్న రాజకీయవ్యవస్థను గురజాడవారి అడుగుజాడలో సునిశితంగా ఎండగట్టలని.
కుటుంబవ్యవస్థ, సమాజ నిర్మాణం యొక్క ఆవశ్యకతను నొక్కివక్కాణించటం కోసం
- స్త్రీ జాతిని ఉత్తేజపరిచి తమ సమానహక్కుల కోసం. అలుపెరుగని పోరాటానికి ప్రోత్సహించటంకోసం
తల్లిదండ్రుల సంక్షేమం, తెలుగు మాట్లాడటం కోసం మాట్లాడక పోవటం ఒకతెగులని తెలుగువారికి విన్నవించటం కోసం - ఈసువిశాల తెలుగుసామ్రాజ్యంలో ఏఒక్కరైనా నామాట చెవినపెడ్తారనే దురాశ, అత్యాశతోయీప్రయాస.
- ఒక మంచిమాట మొబైల్పుణ్యమా అని నలుగురికి చేరిస్తే, పదిమందికి ఫార్వర్డ్ అవుతుందని ఆశ అందుకే అంటాను. ఆవు పాలెందుకిస్తుందో, చెట్లు పూలెందుకుపూస్తాయో, నేనందుకేరాస్తాను. రాశాను. రాస్తున్నాను చదవండి. చదివిచెప్పండి! తెలుగుమాట్లాడండి!...........
ఎందుకురాసాను ఎందుకు రాస్తున్నాను ఎందుకురాస్తాను - నిర్వ్యవసాయంగా తినికూర్చుని సమాజానికి బరువవుతానేమోనని - సమాజోద్ధరణ యజ్ఞంలో నేనుకూడా ఓ సమిధనవ్వాలని - అవిద్య, ఆజ్ఞానంలో దశాబ్దాలు గడిపిన నాకు ఒకింత తెలియని విషయాలు తెలుసుకుని, వాటిని మరింత మందికి | సరళమైన, సరసమైనభాషలో, భావనలో అందించే చిరుప్రయత్నం చేద్దామని యువతలో పఠనాసక్తి కలిగించటానికిపడుతున్న ప్రయాస ఇది మనతెలుగుభాషాసౌరభాన్ని మరోసారిపునశ్చరణ చేసి తెలుగువారి విశిష్టమైనసంప్రదాయ, సంస్కృతులను రచనలలో చొప్పించి నేటి ఆధునిక సమాజానికి కనువిప్పు కల్గించాలని. భ్రష్టుపడుతున్న రాజకీయవ్యవస్థను గురజాడవారి అడుగుజాడలో సునిశితంగా ఎండగట్టలని. కుటుంబవ్యవస్థ, సమాజ నిర్మాణం యొక్క ఆవశ్యకతను నొక్కివక్కాణించటం కోసం - స్త్రీ జాతిని ఉత్తేజపరిచి తమ సమానహక్కుల కోసం. అలుపెరుగని పోరాటానికి ప్రోత్సహించటంకోసం తల్లిదండ్రుల సంక్షేమం, తెలుగు మాట్లాడటం కోసం మాట్లాడక పోవటం ఒకతెగులని తెలుగువారికి విన్నవించటం కోసం - ఈసువిశాల తెలుగుసామ్రాజ్యంలో ఏఒక్కరైనా నామాట చెవినపెడ్తారనే దురాశ, అత్యాశతోయీప్రయాస. - ఒక మంచిమాట మొబైల్పుణ్యమా అని నలుగురికి చేరిస్తే, పదిమందికి ఫార్వర్డ్ అవుతుందని ఆశ అందుకే అంటాను. ఆవు పాలెందుకిస్తుందో, చెట్లు పూలెందుకుపూస్తాయో, నేనందుకేరాస్తాను. రాశాను. రాస్తున్నాను చదవండి. చదివిచెప్పండి! తెలుగుమాట్లాడండి!...........© 2017,www.logili.com All Rights Reserved.