చిత్రలేఖ అందమయిన పేరున్న అందమయిన రచయిత్రి. అందమయిన ఆలోచనలు చేసే వయసున్న రచయిత్రి. వయస్సుని అలరించే ఒకే ఒక పాత్ర లీలల్ని మననం చేసుకొని పులకరించాలని కలం పట్టుకున్న రచయిత్రి. ఒక జాతిని పులకరింపజేసిన లీలలవి. పుట్టిన క్షణం నుంచీ పరతత్వానికి రూపంగా నిలిచిన ఒక సంపూర్ణ అవతారం. ఈ జాతి ఆధ్యాత్మిక వికాసానికి ఆచార్యుడైన శ్రీకృష్ణుడి లీలలను అలనాడు చైతన్యప్రభు, మీరా, సదాశివ బ్రహ్మేంద్ర, నారాయణ భట్టాద్రి, వేదాంత దేశికన్ వంటి వారెందరో పరవశించి, పలవరించి ఆరాధించి తరించారు. వయస్సులో ఉన్న అందమైన అమ్మాయి ఆలోచనలకు అక్షరాలు పొదిగితే ఏమవుతుంది? అందునా ప్రేమస్వరూపుడయిన నల్లనయ్య ఆదర్శంగా నిలిస్తే ఏమవుతుంది? ఈ పుస్తకం అవుతుంది. చిత్రలేఖకి నా అభినందనలు.
- గొల్లపూడి మారుతీరావు
చిత్రలేఖ అందమయిన పేరున్న అందమయిన రచయిత్రి. అందమయిన ఆలోచనలు చేసే వయసున్న రచయిత్రి. వయస్సుని అలరించే ఒకే ఒక పాత్ర లీలల్ని మననం చేసుకొని పులకరించాలని కలం పట్టుకున్న రచయిత్రి. ఒక జాతిని పులకరింపజేసిన లీలలవి. పుట్టిన క్షణం నుంచీ పరతత్వానికి రూపంగా నిలిచిన ఒక సంపూర్ణ అవతారం. ఈ జాతి ఆధ్యాత్మిక వికాసానికి ఆచార్యుడైన శ్రీకృష్ణుడి లీలలను అలనాడు చైతన్యప్రభు, మీరా, సదాశివ బ్రహ్మేంద్ర, నారాయణ భట్టాద్రి, వేదాంత దేశికన్ వంటి వారెందరో పరవశించి, పలవరించి ఆరాధించి తరించారు. వయస్సులో ఉన్న అందమైన అమ్మాయి ఆలోచనలకు అక్షరాలు పొదిగితే ఏమవుతుంది? అందునా ప్రేమస్వరూపుడయిన నల్లనయ్య ఆదర్శంగా నిలిస్తే ఏమవుతుంది? ఈ పుస్తకం అవుతుంది. చిత్రలేఖకి నా అభినందనలు. - గొల్లపూడి మారుతీరావు© 2017,www.logili.com All Rights Reserved.