వేయిపడగల గురించి ఇప్పుడెందుకంటే...
'కాలచక్రం' అని చెప్పి, కాలాన్ని చక్రంతో పోలుస్తాం. తిరిగే చక్రం మళ్ళీ మళ్ళీ బయలుదేరే చోటికే వస్తుంటుంది. భారతీయతకు చెందినవాటికి అన్నింటికీ ఈ చక్రస్వభావమే ఉందని నాకు గట్టిగా అనిపిస్తుంది. మిగతా దేశాలు, సమాజాల పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే కావచ్చు, కొన్ని తేడాలూ ఉండవచ్చు. ఇప్పుడు వాటిల్లోకి వెళ్లకుండా మన విషయానికి పరిమిత మవుతాను.
భారతీయసమాజ, రాజకీయ, సాంస్కృతికచక్రం మరోసారి బయలుదేరిన చోటికి వచ్చిన దశ ఒకటి ఇప్పుడు నడుస్తోంది. ముస్లింలు, ఆంగ్లేయుల పాలనకాలం నుంచి, మరీ ముఖ్యంగా గత వందేళ్ల కాలం నుంచి తన వైభవ ప్రాభవాలను కోల్పోయాననుకుని దుఃఖానికీ, నిరాశా, నిస్పృహలకు లోనవుతూ వచ్చిన భారతీయసమాజంలోని ఒక ప్రాబల్యవర్గం- ఇప్పుడు వాటినుంచి బయటపడి కొత్త ఊపిరినీ ఉత్సాహాన్నీ పుంజుకోవడం చూస్తున్నాం. ఈ వర్గం ఇప్పుడున్నంత సంబరంగా, సంతోషంగా, గెలుపు గర్వంతో ప్రత్యేకించి, గత నూరేళ్ళలోనూ ఎప్పుడూ లేదు.
విశ్వనాథ సత్యనారాయణగారి 'వేయిపడగలు'- దుఃఖం, నిరాశ, నిస్పృహ నిండిన ఈ వర్గపు కృష్ణపక్షదశకు అద్దం పట్టింది. ఇప్పుడు నడుస్తున్న తన శుక్లపక్షదశలో ఈ బృహన్నవలను చదవితే ఏమనిపిస్తుంది? లౌకికంగా నిష్క్రియునిగా నిర్లిప్తునిగా కనిపించే ధర్మారావు ముఖంలోని నైరాశ్యపు చీకట్ల...............
వేయిపడగల గురించి ఇప్పుడెందుకంటే... 'కాలచక్రం' అని చెప్పి, కాలాన్ని చక్రంతో పోలుస్తాం. తిరిగే చక్రం మళ్ళీ మళ్ళీ బయలుదేరే చోటికే వస్తుంటుంది. భారతీయతకు చెందినవాటికి అన్నింటికీ ఈ చక్రస్వభావమే ఉందని నాకు గట్టిగా అనిపిస్తుంది. మిగతా దేశాలు, సమాజాల పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే కావచ్చు, కొన్ని తేడాలూ ఉండవచ్చు. ఇప్పుడు వాటిల్లోకి వెళ్లకుండా మన విషయానికి పరిమిత మవుతాను. భారతీయసమాజ, రాజకీయ, సాంస్కృతికచక్రం మరోసారి బయలుదేరిన చోటికి వచ్చిన దశ ఒకటి ఇప్పుడు నడుస్తోంది. ముస్లింలు, ఆంగ్లేయుల పాలనకాలం నుంచి, మరీ ముఖ్యంగా గత వందేళ్ల కాలం నుంచి తన వైభవ ప్రాభవాలను కోల్పోయాననుకుని దుఃఖానికీ, నిరాశా, నిస్పృహలకు లోనవుతూ వచ్చిన భారతీయసమాజంలోని ఒక ప్రాబల్యవర్గం- ఇప్పుడు వాటినుంచి బయటపడి కొత్త ఊపిరినీ ఉత్సాహాన్నీ పుంజుకోవడం చూస్తున్నాం. ఈ వర్గం ఇప్పుడున్నంత సంబరంగా, సంతోషంగా, గెలుపు గర్వంతో ప్రత్యేకించి, గత నూరేళ్ళలోనూ ఎప్పుడూ లేదు. విశ్వనాథ సత్యనారాయణగారి 'వేయిపడగలు'- దుఃఖం, నిరాశ, నిస్పృహ నిండిన ఈ వర్గపు కృష్ణపక్షదశకు అద్దం పట్టింది. ఇప్పుడు నడుస్తున్న తన శుక్లపక్షదశలో ఈ బృహన్నవలను చదవితే ఏమనిపిస్తుంది? లౌకికంగా నిష్క్రియునిగా నిర్లిప్తునిగా కనిపించే ధర్మారావు ముఖంలోని నైరాశ్యపు చీకట్ల...............© 2017,www.logili.com All Rights Reserved.