1970లలో తెలుగు సాహితీ లోకంలో సంచలనం కలిగించి ప్రగతిశీల శక్తులకూ హేతువాదులకూ అక్షరాయుధాలు అందించింది సివి కలం. సివి, సి.విజయలక్ష్మి, అరుణశ్రీ వంటి పేర్లతో అయన రాసిన వచన కవితలూ కావ్యాలూ ఆలోచనా పరులను, ప్రధానంగా యువతను గొప్పగా ఉత్తేజ పర్చాయి. ఆ రోజుల్లో యువజన విధ్యార్ది సంఘాల సభల్లో సివి సందేశాలు పుస్తకాలు ప్రగాఢ ప్రభావం ప్రసరించేవి. రాజకీయ ఆర్ధిక, సామాజిక ఆధ్మాత్మిక రంగాలలో రకరకాల వంచకులను ఏకకాలంలో ఎండగట్టడం సివి ప్రత్యేకత. సర్కారీ సత్కార సన్మానాలు గానీ, ప్రాపకాలూ ప్రచారాలూ గానీ, అయన కోరుకున్నది లేదు.
మామూలుగా అగ్రశ్రేణి కవులు సాహిత్యేతర సైద్ధాంతిక రచనలు చేయడం అరుదు. కాని సివి అలాటి పలు సాధికార చరిత్ర గ్రంధాలు వెలువరించడం మరో విలక్షణత. ప్రపంచంలో ప్రధమ శ్రామికవర్గ రాజ్యమైన పారిస్ కమ్యూన్ పై కవిత్వం సిద్ధాంతం మేళవించి 500 పేజీల బృహత్ కావ్యం తీసుకురావడం ఆయనకే చెల్లింది..
సి.వి
1970లలో తెలుగు సాహితీ లోకంలో సంచలనం కలిగించి ప్రగతిశీల శక్తులకూ హేతువాదులకూ అక్షరాయుధాలు అందించింది సివి కలం. సివి, సి.విజయలక్ష్మి, అరుణశ్రీ వంటి పేర్లతో అయన రాసిన వచన కవితలూ కావ్యాలూ ఆలోచనా పరులను, ప్రధానంగా యువతను గొప్పగా ఉత్తేజ పర్చాయి. ఆ రోజుల్లో యువజన విధ్యార్ది సంఘాల సభల్లో సివి సందేశాలు పుస్తకాలు ప్రగాఢ ప్రభావం ప్రసరించేవి. రాజకీయ ఆర్ధిక, సామాజిక ఆధ్మాత్మిక రంగాలలో రకరకాల వంచకులను ఏకకాలంలో ఎండగట్టడం సివి ప్రత్యేకత. సర్కారీ సత్కార సన్మానాలు గానీ, ప్రాపకాలూ ప్రచారాలూ గానీ, అయన కోరుకున్నది లేదు. మామూలుగా అగ్రశ్రేణి కవులు సాహిత్యేతర సైద్ధాంతిక రచనలు చేయడం అరుదు. కాని సివి అలాటి పలు సాధికార చరిత్ర గ్రంధాలు వెలువరించడం మరో విలక్షణత. ప్రపంచంలో ప్రధమ శ్రామికవర్గ రాజ్యమైన పారిస్ కమ్యూన్ పై కవిత్వం సిద్ధాంతం మేళవించి 500 పేజీల బృహత్ కావ్యం తీసుకురావడం ఆయనకే చెల్లింది.. సి.వి© 2017,www.logili.com All Rights Reserved.