హొచిమిన్ గురించి తెలియాలంటే మనకు వియత్నాం గురించి తెలియాలి. ఇండో చైనా దేశాల్లో చైనాకు అతి సమీపంలో ఉన్న ఒక చిన్న దేశం వియత్నాం. దశాబ్దాల కాలం పాటు ఫ్రెంచి, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీకి, ఆ తరువాత జపాన్, అమెరికా దురాక్రమణ దాడులకు గురైంది. సామ్రాజ్యవాద దేశాలు తమ దేశంలోని కార్మికుల శ్రమశక్తిని కొల్లగొట్టి తెగబలిసింది చాలక వియత్నాం లాంటి దేశాలను వలసలుగా చేసుకొని ఆ దేశాల సహజవనరులతోపాటు, ఆ దేశాల ప్రజల్ని కూడా పీల్చి పిప్పిచేశాయి.
అమెరికా సామ్రాజ్యవాదులు వియత్నాం ప్రజలపై సాగించిన దుష్క్రుత్యాలకు, దురాఘాతాలకు వ్యతిరకంగా అమెరికా యూరప్ దేశాల్లో 70వ దశకంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. ప్రకాష్ కరత్, బృందాకరత్, సుభాషిణి అలీ లాంటి మార్క్రిష్టు పార్టీ అగ్రనేతలు కొందరు ఆ ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. ఈ చిన్న పుస్తకం ఈనాటికీ దోపిడీని తుదముట్టించే శ్రామికవర్గ అంతర్జాతీయత పతాకాన్ని సమున్నతంగా ఎగురవేయాల్సిన కర్తవ్యాన్ని బోధిస్తుంది. ప్రతి ఒక్కరు చదివి, చదివించాల్సిన పుస్తకం ఇది.
- ఎస్. పుణ్యవతి
హొచిమిన్ గురించి తెలియాలంటే మనకు వియత్నాం గురించి తెలియాలి. ఇండో చైనా దేశాల్లో చైనాకు అతి సమీపంలో ఉన్న ఒక చిన్న దేశం వియత్నాం. దశాబ్దాల కాలం పాటు ఫ్రెంచి, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీకి, ఆ తరువాత జపాన్, అమెరికా దురాక్రమణ దాడులకు గురైంది. సామ్రాజ్యవాద దేశాలు తమ దేశంలోని కార్మికుల శ్రమశక్తిని కొల్లగొట్టి తెగబలిసింది చాలక వియత్నాం లాంటి దేశాలను వలసలుగా చేసుకొని ఆ దేశాల సహజవనరులతోపాటు, ఆ దేశాల ప్రజల్ని కూడా పీల్చి పిప్పిచేశాయి. అమెరికా సామ్రాజ్యవాదులు వియత్నాం ప్రజలపై సాగించిన దుష్క్రుత్యాలకు, దురాఘాతాలకు వ్యతిరకంగా అమెరికా యూరప్ దేశాల్లో 70వ దశకంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. ప్రకాష్ కరత్, బృందాకరత్, సుభాషిణి అలీ లాంటి మార్క్రిష్టు పార్టీ అగ్రనేతలు కొందరు ఆ ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. ఈ చిన్న పుస్తకం ఈనాటికీ దోపిడీని తుదముట్టించే శ్రామికవర్గ అంతర్జాతీయత పతాకాన్ని సమున్నతంగా ఎగురవేయాల్సిన కర్తవ్యాన్ని బోధిస్తుంది. ప్రతి ఒక్కరు చదివి, చదివించాల్సిన పుస్తకం ఇది. - ఎస్. పుణ్యవతి© 2017,www.logili.com All Rights Reserved.