'జనని సంస్కృతంబు సకల భాషలకును' అన్నారు. దీనిని కొంతమంది అవునంటారు. కొంతమంది కాదంటారు. మిగతా భాషల సంగతేంటోగానీ ఇంగ్లీషుకు మాత్రం తల్లి నిస్సందేహంగా తెలుగే. ఇంగ్లీషును ఎంగిలిపీసు అని ఎగతాళి చేసేది కూడా ఇందుకేనేమో! తెలుగువాడికి ఇంగ్లీషు పిచ్చి అన్న పేరు ఉంది. తప్పు, తప్పు! ఇంగ్లీషు వాడికే తెలుగు వ్యామోహం ఎక్కువ. తెల్లవాడన్నా, తెలుగువాడన్నా పెద్ద తేడా ఏముంది? 'కొట్టుకొచ్చినట్టు' సారూప్యం కనబడటంలా. ఇంగ్లీష్ వాడు మన అయ్యా, అయ్యో అనే పదాలు కూడా తన నిఘంటువులో కలిపేసు కొని ఆహా, ఓహో అనేట్టు చేస్తున్నాడు.
పెదాలు ఎలా పలికినా, పదాలను పోల్చి చెప్పేగా భాష పుట్టు పూర్వోత్తరాలు చెప్పేది. ఆ లెక్కన చూద్దాం. చూడండి ఎన్నెన్ని పదాలు. నమ్మేవాళ్ళు నమ్మొచ్చు. నమ్మి చెడ్డవాళ్ళు లేరు. నవ్వేవాళ్ళు నవ్వచ్చు. నవ్వి చెడ్డవాళ్ళూ లేరు. ముందు ఇంగ్లీషువాడికి సొంత నెలలు మాత్రం ఎక్కడున్నాయి? అవీ తెలుగువాడి ప్రసాదమే. 'వారి' తెలుగువాడిదని ఎవరినడిగినా చెబుతారు. మన వారిని కొట్టుకుపోయి తెల్లవాడు తమ నెలలకు జనవరి, ఫిబ్రవరి అని పేర్లు పెట్టుకున్నాడు. మన పంటల పండగ సంక్రాంతి కూడా జనవరిలోనే వస్తుంది గదా! అద్గదీ సంగతి!
'జనని సంస్కృతంబు సకల భాషలకును' అన్నారు. దీనిని కొంతమంది అవునంటారు. కొంతమంది కాదంటారు. మిగతా భాషల సంగతేంటోగానీ ఇంగ్లీషుకు మాత్రం తల్లి నిస్సందేహంగా తెలుగే. ఇంగ్లీషును ఎంగిలిపీసు అని ఎగతాళి చేసేది కూడా ఇందుకేనేమో! తెలుగువాడికి ఇంగ్లీషు పిచ్చి అన్న పేరు ఉంది. తప్పు, తప్పు! ఇంగ్లీషు వాడికే తెలుగు వ్యామోహం ఎక్కువ. తెల్లవాడన్నా, తెలుగువాడన్నా పెద్ద తేడా ఏముంది? 'కొట్టుకొచ్చినట్టు' సారూప్యం కనబడటంలా. ఇంగ్లీష్ వాడు మన అయ్యా, అయ్యో అనే పదాలు కూడా తన నిఘంటువులో కలిపేసు కొని ఆహా, ఓహో అనేట్టు చేస్తున్నాడు. పెదాలు ఎలా పలికినా, పదాలను పోల్చి చెప్పేగా భాష పుట్టు పూర్వోత్తరాలు చెప్పేది. ఆ లెక్కన చూద్దాం. చూడండి ఎన్నెన్ని పదాలు. నమ్మేవాళ్ళు నమ్మొచ్చు. నమ్మి చెడ్డవాళ్ళు లేరు. నవ్వేవాళ్ళు నవ్వచ్చు. నవ్వి చెడ్డవాళ్ళూ లేరు. ముందు ఇంగ్లీషువాడికి సొంత నెలలు మాత్రం ఎక్కడున్నాయి? అవీ తెలుగువాడి ప్రసాదమే. 'వారి' తెలుగువాడిదని ఎవరినడిగినా చెబుతారు. మన వారిని కొట్టుకుపోయి తెల్లవాడు తమ నెలలకు జనవరి, ఫిబ్రవరి అని పేర్లు పెట్టుకున్నాడు. మన పంటల పండగ సంక్రాంతి కూడా జనవరిలోనే వస్తుంది గదా! అద్గదీ సంగతి!© 2017,www.logili.com All Rights Reserved.