తలపాగకు ఇంగ్లీషు భాషలో వాడే పదమైన turban అనేది టర్కీ భాష నుండి వస్తే, maidan అనే పదం పర్షియన్. అలాగే నిత్యమూ మనం ఉపయోగించే garage అనేది ఫ్రెంచి పదమైతే, మనం త్రాగే Tea చైనా పదం. అలాగే Mosque అరబిక్, Rickshaw జపనీస్ పదం. Blitz అనేది జర్మన్, sputnik రష్యన్ పదం అయితే bandicoot మాత్రం మన తెలుగులోని పందికొక్కు. ఇలా ప్రపంచంలోని అన్ని భాషలలోని పదాలను కలుపుకొని, ఇంగ్లీషు అంతర్జాతీయ భాష అయింది. భాషలో వెలువడిన ప్రతీ పదానికి ఎంతో కొంత చరిత్ర, దీని వెనుక అప్పటి ప్రజల నమ్మకాలు, భయాలు, ఆశలు, ఆశయాలు ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినా, మూలాలు లభ్యమైన కొన్ని పదాలను మీ ముందుంచే చిన్న ప్రయత్నమే ఈ 'పదాల వెనుక కథలు'.
© 2017,www.logili.com All Rights Reserved.