కమ్మటి తెలంగాణ పరిమళం
మానవజాతి వికాసంలో భాష అద్భుతసృష్టి. మనిషిని మరో మనిషితో అనుసంధానం చేసే ప్రక్రియగా రూపొందిన భాష రానురాను వివిధ భాషలుగా, విభిన్న అంశాలుగా, విశేష సంపదగా విశ్వరూపం సంతరించుకున్నది. భాష కేవలం అనుసంధానం దగ్గరే ఆగిపోలేదు. తరతరాల జ్ఞానభాండాగారమంతా భాషే అయింది. యుగయుగాల అనుభవ పరంపర అంతా భాషలో అంతర్భాగమే. ఖండాల నడుమ, దేశాల నడుమ, ప్రాంతాల నడుమ, సంస్కృతుల నడుమ నిరంతరంగా కొనసాగుతున్న అవిచ్ఛిన్న ప్రసారధార భాష.
ఏ భాషకు ఆ భాష విశేషమైంది. ప్రత్యేకమైంది. గొప్పది. ఎవరిభాష వారికి ప్రాణం. ఆత్మసమానం. వాసన, రుచి కమ్మనిది. తెలంగాణ తెలుగు ఏ ఇతర తెలుగుల కంటే తక్కువ కాదు. తెలుగెంత తీయనిదో తెలంగాణ మాట అంత తీయనిది. సంకుచిత స్వభావులు భాషల్లో తక్కువ ఎక్కువలు చూస్తారు. స్వీయ ఉన్నతి కోసం ఇతర భాషలను, ఇతర యాసలను అవహేళన చేస్తుంటారు. అటువంటి ఆధిపత్య ధోరణుల మీద తిరుగుబాటు ప్రకటించి, గెలిచి నిలిచిన భాష తెలంగాణ భాష. తమతమ ప్రాణభాషల అస్తిత్వం కోసం తమ ప్రాణాలే బలిపెట్టి ఉద్యమించిన నేపథ్యాలు ప్రపంచంలో అనేకం కనబడుతాయి. అట్లా ప్రాణాలర్పించి ఆత్మగౌరవ పతాకను ఎగురవేసిన భాష తెలంగాణ భాష, ప్రామాణిక భాష పేరిట సృష్టించిన మాయాజాలాన్ని పటాపంచలు చేసి తన ప్రత్యేకతను, ప్రామాణికతను నిరూపించు కున్నది తెలంగాణ తెలుగు.
తెలంగాణ పల్లెపదాల పరిమళాన్ని ఆస్వాదించి, పరవశించి, పరిశోధించి పూలు పూలుగా పుటలకెత్తుతున్న రచయిత ఎస్. సంపత్ కుమార్ శ్రీవత్స, మూడు వేల పదాలకు.................
కమ్మటి తెలంగాణ పరిమళం మానవజాతి వికాసంలో భాష అద్భుతసృష్టి. మనిషిని మరో మనిషితో అనుసంధానం చేసే ప్రక్రియగా రూపొందిన భాష రానురాను వివిధ భాషలుగా, విభిన్న అంశాలుగా, విశేష సంపదగా విశ్వరూపం సంతరించుకున్నది. భాష కేవలం అనుసంధానం దగ్గరే ఆగిపోలేదు. తరతరాల జ్ఞానభాండాగారమంతా భాషే అయింది. యుగయుగాల అనుభవ పరంపర అంతా భాషలో అంతర్భాగమే. ఖండాల నడుమ, దేశాల నడుమ, ప్రాంతాల నడుమ, సంస్కృతుల నడుమ నిరంతరంగా కొనసాగుతున్న అవిచ్ఛిన్న ప్రసారధార భాష. ఏ భాషకు ఆ భాష విశేషమైంది. ప్రత్యేకమైంది. గొప్పది. ఎవరిభాష వారికి ప్రాణం. ఆత్మసమానం. వాసన, రుచి కమ్మనిది. తెలంగాణ తెలుగు ఏ ఇతర తెలుగుల కంటే తక్కువ కాదు. తెలుగెంత తీయనిదో తెలంగాణ మాట అంత తీయనిది. సంకుచిత స్వభావులు భాషల్లో తక్కువ ఎక్కువలు చూస్తారు. స్వీయ ఉన్నతి కోసం ఇతర భాషలను, ఇతర యాసలను అవహేళన చేస్తుంటారు. అటువంటి ఆధిపత్య ధోరణుల మీద తిరుగుబాటు ప్రకటించి, గెలిచి నిలిచిన భాష తెలంగాణ భాష. తమతమ ప్రాణభాషల అస్తిత్వం కోసం తమ ప్రాణాలే బలిపెట్టి ఉద్యమించిన నేపథ్యాలు ప్రపంచంలో అనేకం కనబడుతాయి. అట్లా ప్రాణాలర్పించి ఆత్మగౌరవ పతాకను ఎగురవేసిన భాష తెలంగాణ భాష, ప్రామాణిక భాష పేరిట సృష్టించిన మాయాజాలాన్ని పటాపంచలు చేసి తన ప్రత్యేకతను, ప్రామాణికతను నిరూపించు కున్నది తెలంగాణ తెలుగు. తెలంగాణ పల్లెపదాల పరిమళాన్ని ఆస్వాదించి, పరవశించి, పరిశోధించి పూలు పూలుగా పుటలకెత్తుతున్న రచయిత ఎస్. సంపత్ కుమార్ శ్రీవత్స, మూడు వేల పదాలకు.................© 2017,www.logili.com All Rights Reserved.