కోర్టు ఫీజులు, దావాల విలువ మదింపుకు సంబంధించి 1870 నాటి రెండు కాలం చెల్లిన కేంద్ర ప్రభుత్వ చట్టాల స్థానంలో మన రాష్ట్రానికి సంబంధించి 1956 లో "ఆంధ్రప్రదేశ్ కోర్టు ఫీజులు మరియు దావాల విలువ మదింపు చట్టం" రూపొందించబడింది. వివిధ రకాల సివిల్, క్రిమినల్, దావాలు, కేసులలో కోర్టు ఫీజు, న్యాయ ప్రక్రియకు సంబంధించిన వివిధ రకాల పిటిషన్లు అప్లికేషన్లు మొదలైనవాటిపైన చెల్లించవలసిన కోర్టు ఫీజుల వివరాలు ఆ చట్టంలో పొందుపరచబడ్డాయి.
న్యాయ వ్యవస్థలో ఉద్యోగం చేస్తున్న జడ్జీలు, మేజిస్ట్రేట్లు, ఉద్యోగుల జీత భత్యాలు, కోర్టు భవనాల నిర్మాణం, నిర్వహణ, స్టేషనరీ తదితర ఖర్చులను రాబట్టుకునేందుకు, పౌరులకు న్యాయపరమైన సేవలను అందించినందుకు ఈ ఫీజులు విధించబడి వసూలు చేయబడతాయి. 1956 నుండి ఇప్పటిదాకా న్యాయమూర్తులు, ఉద్యోగుల సంఖ్య, వేతనాలు, నిర్వహణా వ్యయం ఎన్నోరెట్లు పెరిగాయి. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు మారాయి. అయినా అప్పటి నుండి ఇప్పటిదాకా కోర్టు ఫీజులు మాత్రం పెరగలేదు. కారణం ఏమిటి? కేవలం ప్రభుత్వాల, పాలక వర్గాల నిర్లక్ష్యమే. ఈ విచిత్రం గిన్నిస్ బుక్ లోని ఎక్కినా ఆశ్చర్యపడవలసిన పనిలేదేమో!
- పెండ్యాల సత్యనారాయణ
కోర్టు ఫీజులు, దావాల విలువ మదింపుకు సంబంధించి 1870 నాటి రెండు కాలం చెల్లిన కేంద్ర ప్రభుత్వ చట్టాల స్థానంలో మన రాష్ట్రానికి సంబంధించి 1956 లో "ఆంధ్రప్రదేశ్ కోర్టు ఫీజులు మరియు దావాల విలువ మదింపు చట్టం" రూపొందించబడింది. వివిధ రకాల సివిల్, క్రిమినల్, దావాలు, కేసులలో కోర్టు ఫీజు, న్యాయ ప్రక్రియకు సంబంధించిన వివిధ రకాల పిటిషన్లు అప్లికేషన్లు మొదలైనవాటిపైన చెల్లించవలసిన కోర్టు ఫీజుల వివరాలు ఆ చట్టంలో పొందుపరచబడ్డాయి. న్యాయ వ్యవస్థలో ఉద్యోగం చేస్తున్న జడ్జీలు, మేజిస్ట్రేట్లు, ఉద్యోగుల జీత భత్యాలు, కోర్టు భవనాల నిర్మాణం, నిర్వహణ, స్టేషనరీ తదితర ఖర్చులను రాబట్టుకునేందుకు, పౌరులకు న్యాయపరమైన సేవలను అందించినందుకు ఈ ఫీజులు విధించబడి వసూలు చేయబడతాయి. 1956 నుండి ఇప్పటిదాకా న్యాయమూర్తులు, ఉద్యోగుల సంఖ్య, వేతనాలు, నిర్వహణా వ్యయం ఎన్నోరెట్లు పెరిగాయి. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు మారాయి. అయినా అప్పటి నుండి ఇప్పటిదాకా కోర్టు ఫీజులు మాత్రం పెరగలేదు. కారణం ఏమిటి? కేవలం ప్రభుత్వాల, పాలక వర్గాల నిర్లక్ష్యమే. ఈ విచిత్రం గిన్నిస్ బుక్ లోని ఎక్కినా ఆశ్చర్యపడవలసిన పనిలేదేమో! - పెండ్యాల సత్యనారాయణ© 2017,www.logili.com All Rights Reserved.