కారణాలు ఏమైనప్పటికి, భారతదేశంలో రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య, గాయపడేవారి సంఖ్య ఆందోళన కలిగించే స్థితిలో ఉన్నది. నిజానికి మోటారు వాహన ప్రమాదాలలో వ్యక్తులు చనిపోయిన, లేక గాయపడిన సందర్భాలలో నష్ట పరిహారాన్ని పొందటం ఎంతో తేలిక, సులభతరం, ఎటువంటి సంక్లిష్టతలేదు. కానీ ఎందుకనో, ఈ రంగంలో బ్రోకర్లు, దళారీల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటున్నది. మాయమాటలతో మభ్యపెట్టి, దొంగ ఖర్చులు చూపించి, నష్ట పరిహారంలో ఎక్కువ భాగాన్ని ఈ దళారీలు దండుకోవటం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నష్ట పరిహారం కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి. కోర్టు ఫీజు ఎంత చెల్లించాలి. డాక్యుమెంట్లు పొందటానికి ఎంత ఖర్చు అవుతుంది, సందర్భాన్ని బట్టి గరిష్టం ఎంత నష్ట పరిహారం పొందవచ్చు తదితర అంశాలను సులభ శైలిలో, సాధారణ పౌరుడు, ఒక జూనియర్ అడ్వొకేట్ కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా ఈ పుస్తకాన్ని రచించటం జరిగింది.
కారణాలు ఏమైనప్పటికి, భారతదేశంలో రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య, గాయపడేవారి సంఖ్య ఆందోళన కలిగించే స్థితిలో ఉన్నది. నిజానికి మోటారు వాహన ప్రమాదాలలో వ్యక్తులు చనిపోయిన, లేక గాయపడిన సందర్భాలలో నష్ట పరిహారాన్ని పొందటం ఎంతో తేలిక, సులభతరం, ఎటువంటి సంక్లిష్టతలేదు. కానీ ఎందుకనో, ఈ రంగంలో బ్రోకర్లు, దళారీల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటున్నది. మాయమాటలతో మభ్యపెట్టి, దొంగ ఖర్చులు చూపించి, నష్ట పరిహారంలో ఎక్కువ భాగాన్ని ఈ దళారీలు దండుకోవటం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నష్ట పరిహారం కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి. కోర్టు ఫీజు ఎంత చెల్లించాలి. డాక్యుమెంట్లు పొందటానికి ఎంత ఖర్చు అవుతుంది, సందర్భాన్ని బట్టి గరిష్టం ఎంత నష్ట పరిహారం పొందవచ్చు తదితర అంశాలను సులభ శైలిలో, సాధారణ పౌరుడు, ఒక జూనియర్ అడ్వొకేట్ కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా ఈ పుస్తకాన్ని రచించటం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.