'కృష్ణశాస్త్రి సాహిత్య వైభవం' అనే ఈ గ్రంథం 1980 లో కృష్ణశాస్త్రి గారి మరణానంతరం 'రాజాలక్ష్మి ఫౌండేషన్' మద్రాసువారు కృష్ణశాస్త్రి గారి జీవిత సాహిత్యాలపై గ్రంథరచన పోటీ నిర్వహించిన సందర్భంలో ఈ గ్రంథం వ్రాయడం జరిగింది. ఈ గ్రంథ ఆవిర్భావానికి ప్రేరణ ఇచ్చినవారు విజయవాడలోని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా గూడూరి నమశ్శివాయగారు. ఆనాడు నా గ్రంథాన్ని, నన్ను మద్రాసులో సత్కరింపచేసిన మహనీయమూర్తి. వారే ఈ గ్రంథరచనకు ప్రాణప్రతిష్ఠ చేసి నా వెన్నంటి ఈ గ్రంథాన్ని స్వహస్తాలతో తప్పొప్పులను సవరించి, పుస్తకానికి సంపూర్ణత్వాన్ని కల్గించినవారు.
పోటీకి వచ్చిన 12 గ్రంథాలలో 12వది ఈ గ్రంథం. ఈ పోటీలకు వచ్చిన గ్రంథాలను పరీక్షించినవారు ఆచార్య సి నారాయణరెడ్డి గారు, పాలగుమ్మి పద్మరాజుగారు. కీ శే నండూరి రామమోహన్ రావ్ గారు ఈ పుస్తకం చదివి ఆశీర్వదించారు. ఈ గ్రంథం పెద్దల ఆశీర్వాదబలంతో పురుడు పోసుకుంది. ఇది పదుగురు చదివి మెచ్చి దీవించాలన్నదే నా సంకల్పం.
- డా నోరి రాజేశ్వరరావు
'కృష్ణశాస్త్రి సాహిత్య వైభవం' అనే ఈ గ్రంథం 1980 లో కృష్ణశాస్త్రి గారి మరణానంతరం 'రాజాలక్ష్మి ఫౌండేషన్' మద్రాసువారు కృష్ణశాస్త్రి గారి జీవిత సాహిత్యాలపై గ్రంథరచన పోటీ నిర్వహించిన సందర్భంలో ఈ గ్రంథం వ్రాయడం జరిగింది. ఈ గ్రంథ ఆవిర్భావానికి ప్రేరణ ఇచ్చినవారు విజయవాడలోని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా గూడూరి నమశ్శివాయగారు. ఆనాడు నా గ్రంథాన్ని, నన్ను మద్రాసులో సత్కరింపచేసిన మహనీయమూర్తి. వారే ఈ గ్రంథరచనకు ప్రాణప్రతిష్ఠ చేసి నా వెన్నంటి ఈ గ్రంథాన్ని స్వహస్తాలతో తప్పొప్పులను సవరించి, పుస్తకానికి సంపూర్ణత్వాన్ని కల్గించినవారు. పోటీకి వచ్చిన 12 గ్రంథాలలో 12వది ఈ గ్రంథం. ఈ పోటీలకు వచ్చిన గ్రంథాలను పరీక్షించినవారు ఆచార్య సి నారాయణరెడ్డి గారు, పాలగుమ్మి పద్మరాజుగారు. కీ శే నండూరి రామమోహన్ రావ్ గారు ఈ పుస్తకం చదివి ఆశీర్వదించారు. ఈ గ్రంథం పెద్దల ఆశీర్వాదబలంతో పురుడు పోసుకుంది. ఇది పదుగురు చదివి మెచ్చి దీవించాలన్నదే నా సంకల్పం. - డా నోరి రాజేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.