"అనగనాగ ఒక రాజు" తో ప్రారంభించి చిత్రవిచిత్ర పాత్రలను, ఊహలకు రంగులు పూసే సంఘటనలను గుది గుచ్చి, అనేకానేక విశేషాలు, తలిదండ్రులో, అవ్వలో, తాతలో పసివయసునుండే మనకిలాంటివి వినిపించడం కద్దు.
నేటి కాలంలో జానపద చిత్రాలకున్నంత రాబడి (సగటున) సాంఘికాలకు లేదని జగమంతా ఎరిగిన సత్యమే. ఇలాంటి కధలతో కూడా మానవుని చాందన మూడాచార మాంద్యం వైపుగాక, హేతుబద్ధమైన అభ్యుదయంవైపు నడువ ప్రోత్సహించవచ్చుననే విశ్వాశంతో నేనీ కధలు వ్రాశాను.
మాయలు, మంత్రాలు, తంత్రాలు, మానవతీత శక్తులు, దేవుళ్ళు, దయ్యాలు, భూతప్రేత పిశాచిలవంటి ఆలంబనలు పాఠకుల ఆసక్తిని ఆకట్టుకునేందుకుగాని, కధల లక్ష్యంలో, గుణగణ నిరూపణలో, అంతరాంతరాల్లో పై అన్నిటికంటె మానవుని పవిత్రత, సత్యసంధత, త్యాగనిరతి, ధర్మజ్ఞత, ఆత్మవిశ్వాస దృడిమలే ఉన్నతోన్నతమైనవని నిరూపించటానికే నే నీ కధలలో ప్రయత్నించాను.
భూత భవిష్యద్వర్తమానాలకు చెందగలట్టు కల్పించిన ఈ కధలలో ఎక్కువ భాగం నేటి చలనచిత్ర నిర్మాతల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్రాశాను. ఇవి గ్రంధ రూపంలో వెలువడకముందే ఒకరిద్దరు సినీమిత్రుల దృష్టిలో పడడం నా అదృష్టం.
- పోలవరపు శ్రీహరిరావు
"అనగనాగ ఒక రాజు" తో ప్రారంభించి చిత్రవిచిత్ర పాత్రలను, ఊహలకు రంగులు పూసే సంఘటనలను గుది గుచ్చి, అనేకానేక విశేషాలు, తలిదండ్రులో, అవ్వలో, తాతలో పసివయసునుండే మనకిలాంటివి వినిపించడం కద్దు. నేటి కాలంలో జానపద చిత్రాలకున్నంత రాబడి (సగటున) సాంఘికాలకు లేదని జగమంతా ఎరిగిన సత్యమే. ఇలాంటి కధలతో కూడా మానవుని చాందన మూడాచార మాంద్యం వైపుగాక, హేతుబద్ధమైన అభ్యుదయంవైపు నడువ ప్రోత్సహించవచ్చుననే విశ్వాశంతో నేనీ కధలు వ్రాశాను. మాయలు, మంత్రాలు, తంత్రాలు, మానవతీత శక్తులు, దేవుళ్ళు, దయ్యాలు, భూతప్రేత పిశాచిలవంటి ఆలంబనలు పాఠకుల ఆసక్తిని ఆకట్టుకునేందుకుగాని, కధల లక్ష్యంలో, గుణగణ నిరూపణలో, అంతరాంతరాల్లో పై అన్నిటికంటె మానవుని పవిత్రత, సత్యసంధత, త్యాగనిరతి, ధర్మజ్ఞత, ఆత్మవిశ్వాస దృడిమలే ఉన్నతోన్నతమైనవని నిరూపించటానికే నే నీ కధలలో ప్రయత్నించాను. భూత భవిష్యద్వర్తమానాలకు చెందగలట్టు కల్పించిన ఈ కధలలో ఎక్కువ భాగం నేటి చలనచిత్ర నిర్మాతల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్రాశాను. ఇవి గ్రంధ రూపంలో వెలువడకముందే ఒకరిద్దరు సినీమిత్రుల దృష్టిలో పడడం నా అదృష్టం. - పోలవరపు శ్రీహరిరావు© 2017,www.logili.com All Rights Reserved.