జాతి అస్మితలో పరిసరం విడదీయరానిది. ఆయా దేశకాలాలలో వనరులు, - జనం మనుగడలో మౌలిక పాత్ర వహిస్తాయి. తూర్పు కనుమలలో ఉత్తర ప్రాంతాలను మన్నెకొట్టాలుగా, దక్షిణంలో మెట్ట ప్రాంతాలను బోయకొట్టాలుగా; ఈ కనుమలను ఆ మలయ (మాల్, మల, మలై) పర్వతాలుగా పిలవడం పరిపాటి. వీటిలో అత్యున్నత శిఖరం మహేంద్రగిరి మలయపర్వతాలను కులపర్వతాలుగా మన సంప్రదాయం గౌరవిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం గుర్తించిన ముప్పైఐదు తెగలలో ఉత్తరాంధ్రలో తూర్పుకనుమలలోని విశాఖ బయళ్ళలో కొండదొరలు, బగతలు, వాల్మీకులు, కొండకమ్మరలు, గోదావరిలోయల్లో కొండరెడ్లు, కొండకాపులు, నల్లమల అడవులలో చెంచులు, వాటిని ఆనుకున్న కొండల్లో, తీరప్రాంతంలో యానాదులు, నక్కల, మొండిబండవారు, దక్కన్ పీఠభూమిలో నాయకపోడులు, తెలుగు మాతృభాషగా గలవారు.
జాతి వారసత్వాన్ని ముందుతరాలకు అందించే వాజ్మయంలో మౌఖిక సాహిత్యానిది ప్రధానపాత్ర. ఈ సాహిత్యంలో ప్రక్రియలు కథలు. పొడుపుకథలు, గేయగాథలు, పురాగాథలు, సామెతలు, పాటలు, దేశకాల జ్ఞానంతో పాటు కష్టసుఖాలను, ప్రాపంచిక దృక్పధాన్ని, మనో ప్రపంచాన్ని, చారిత్రక పరిణామాలను, ఆదర్శాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలియజేస్తుంటాయి. ఆ లోతులు తెలియనిదే సంస్కృతి అర్థం కాదు. అన్ని, ప్రక్రియలు పరిశీలిస్తే తప్ప సమాజం సమగ్రచిత్రం రూపు కట్టదు. అందువల్ల ఆయా కథలు, గేయగాధలు, వాటి సారాంశం, కథాసంగ్రహం, పొడుపుకథలు, పాటలలో కొన్ని భాగాలు, సామెతలను కూడా చేర్చిన కూర్పు (సంకలనం) ఇది.