(సాయం సమయం : చండీఘడ్ గ్రామంలో ఒక వీధి. చండీఘడ్ గ్రామ వీధుల్లో సంధ్యాదీప్తులు ప్రతిఫలిస్తున్నవి. ఆ చేరువనే బీజ గ్రామం జమీందారుగారి ఠాణా ఆఫీసు ద్వారం సగం కనిపిస్తోంది. ఇద్దరు బాటసారులు త్వరత్వరగా నడిచిపోతున్నారు. వారి వెనుకనే ఒక రైతు పొలంలో పనిపాటలు ముగించుకుని - ఇంటికి వచ్చేస్తున్నాడు. అతని యెడమ భుజంమీద నాగలి, కుడి భుజంమీద ములుకోలు వున్నాయి. ముందు నడుస్తోన్న ఎద్దులకు పేర్లు పెట్టి ముద్దుగా పిలుస్తూ ఇంటికి తోలుకుపోతున్నాడు.
ఠాణాసముద్దారు నందీశుడు మెల్లగా ప్రవేశిస్తాడు. ఏదో ఉత్కంఠ. ఆశంక అతనిలో తొణికిసలాడుతున్నవి. ఒక పక్కకు మెడవంచి ఇంకోవైపుకు దేనికోసమో వెదుకుతోన్నట్లు చూస్తూంటాడు. ఆ వెనుక వీధిలోంచి విశ్వంభరనాధ్ ఆతృతగా వస్తాడు. అతడు ఠాణాలో గుమస్తా. తాశీలు వసూళ్ళకోసం వెళ్ళాడు. ఈ లోపునే బీజ గ్రామం కొత్త జమీందారుగారు చండీఘడ్ వస్తున్నారనే వార్త తెలిసింది. సుమారు రెండు కోసుల దూరాన వారి పాలకీ దించుకుని కాసేపు వాహకులు విశ్రాంతి తీసుకుంటున్నారట - ఇంకా కాసేపటిలో రావచ్చు.)
విశ్వంభర్ : ఏమీ నందీశ్! అలా నిల్చుండిపోయావేం? దొరగారు వచ్చేస్తున్నారు సుమీ!
నందీశుడు: (ఉలిక్కిపడి వెనక్కు మళ్ళుతాడు. ఈ దుఃఖవార్త గంటకు ముందే అతనికి తెలిసింది. ఉదాసీనంగా అంటాడు) ఊఁ.
విశ్వ : ఊఁ, యేమిటి? దొరగారు - అదిగో వచ్చేస్తుంటేను!
నందీ : (వికృత స్వరంతో) వస్తే నన్నేం చెయ్యమంటావు? ముందుగా కబురు లేదు, ఏమీ లేదు; దొరగారు వచ్చేస్తున్నారు? దొరగారే! అయితే!
విశ్వ : (అతని ఆకస్మిక ఉద్రేకానికి కారణం గమనించలేక క్షణం ఆగి అంటాడు అరె నీ ప్రాణాలు అరచేతిలోకి వచ్చాయల్లే ఉందే!
నందీ : అదేంమాట! మామగారి సంపత్తి అంతా సంక్రమించింది. మిడిసి పడిపోతున్నాడు. మరీను. విశ్వంభర్! నీకు తెలుసా? కాళీ మోహనబాబు ఇతన్ని ఇంటికి రానిచ్చేవాడే కాదు. కాని ఆయన అకస్మాత్తుగా చనిపోవటం మూలాన ఈయనగారు జమీందారై.......
పూజారిణి (నాటకం) ప్రథమాంకము... మొదటి దృశ్యం (సాయం సమయం : చండీఘడ్ గ్రామంలో ఒక వీధి. చండీఘడ్ గ్రామ వీధుల్లో సంధ్యాదీప్తులు ప్రతిఫలిస్తున్నవి. ఆ చేరువనే బీజ గ్రామం జమీందారుగారి ఠాణా ఆఫీసు ద్వారం సగం కనిపిస్తోంది. ఇద్దరు బాటసారులు త్వరత్వరగా నడిచిపోతున్నారు. వారి వెనుకనే ఒక రైతు పొలంలో పనిపాటలు ముగించుకుని - ఇంటికి వచ్చేస్తున్నాడు. అతని యెడమ భుజంమీద నాగలి, కుడి భుజంమీద ములుకోలు వున్నాయి. ముందు నడుస్తోన్న ఎద్దులకు పేర్లు పెట్టి ముద్దుగా పిలుస్తూ ఇంటికి తోలుకుపోతున్నాడు. ఠాణాసముద్దారు నందీశుడు మెల్లగా ప్రవేశిస్తాడు. ఏదో ఉత్కంఠ. ఆశంక అతనిలో తొణికిసలాడుతున్నవి. ఒక పక్కకు మెడవంచి ఇంకోవైపుకు దేనికోసమో వెదుకుతోన్నట్లు చూస్తూంటాడు. ఆ వెనుక వీధిలోంచి విశ్వంభరనాధ్ ఆతృతగా వస్తాడు. అతడు ఠాణాలో గుమస్తా. తాశీలు వసూళ్ళకోసం వెళ్ళాడు. ఈ లోపునే బీజ గ్రామం కొత్త జమీందారుగారు చండీఘడ్ వస్తున్నారనే వార్త తెలిసింది. సుమారు రెండు కోసుల దూరాన వారి పాలకీ దించుకుని కాసేపు వాహకులు విశ్రాంతి తీసుకుంటున్నారట - ఇంకా కాసేపటిలో రావచ్చు.) విశ్వంభర్ : ఏమీ నందీశ్! అలా నిల్చుండిపోయావేం? దొరగారు వచ్చేస్తున్నారు సుమీ! నందీశుడు: (ఉలిక్కిపడి వెనక్కు మళ్ళుతాడు. ఈ దుఃఖవార్త గంటకు ముందే అతనికి తెలిసింది. ఉదాసీనంగా అంటాడు) ఊఁ. విశ్వ : ఊఁ, యేమిటి? దొరగారు - అదిగో వచ్చేస్తుంటేను! నందీ : (వికృత స్వరంతో) వస్తే నన్నేం చెయ్యమంటావు? ముందుగా కబురు లేదు, ఏమీ లేదు; దొరగారు వచ్చేస్తున్నారు? దొరగారే! అయితే! విశ్వ : (అతని ఆకస్మిక ఉద్రేకానికి కారణం గమనించలేక క్షణం ఆగి అంటాడు అరె నీ ప్రాణాలు అరచేతిలోకి వచ్చాయల్లే ఉందే! నందీ : అదేంమాట! మామగారి సంపత్తి అంతా సంక్రమించింది. మిడిసి పడిపోతున్నాడు. మరీను. విశ్వంభర్! నీకు తెలుసా? కాళీ మోహనబాబు ఇతన్ని ఇంటికి రానిచ్చేవాడే కాదు. కాని ఆయన అకస్మాత్తుగా చనిపోవటం మూలాన ఈయనగారు జమీందారై.......© 2017,www.logili.com All Rights Reserved.