పల్లీసమాజ్
వేణీఘోషాల్ ముఖర్జీలవారి పెరట్లో అడుగెడుతూనే, ఎదురుగా కన్పించిన ఓ ప్రౌఢ స్త్రీని "అత్తా! రమ ఎక్కడున్నది?" అని అడిగాడు.
జపం చేసుకుంటూ కూర్చున్న ఆమె వంట ఇంటికేసి, 'అక్కడ' అన్నట్లు వేలితో చూపించింది. వేణీ వంటయింటి గుమ్మం దగ్గరకు వచ్చి నుంచుని “అయితే ఇంతకీ ఏమని నిశ్చయించుకున్నట్లు రమా?” అని అడిగాడు.
మండుతున్న పొయ్యిమీదనుంచి చిటపట లాడుతున్న బాణలి కిందకి దించి "ఏ విషయం వేణీదా?" అని అడిగింది రమ.
"తారిణీ బాబాయ్ శ్రాద్ధం విషయం రమా! రమేశ్ నిన్ననే వచ్చాడిక్కడికి. తండ్రి శ్రాద్ధం చాలా భారీగా చేయాలని చూస్తున్నాట్ట. వెళతావా మరి నువ్వు?”
అంది.
రమ ఆశ్చర్యంతో కళ్ళు ఇంతచేసుకుని, “తారిణీ ఘోషాల్ ఇంటికి వెళతానా నేను?”
వేణీ కొంచెం తటపటాయిస్తూ “నాకా సంగతి తెలుసు రమా! ఏమయినా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళవని తెలుసు నాకు. అయినా ఇంటింటికీ వాడు స్వయంగా వెళ్ళి పిలిచి వస్తున్నాట్ట! ఇలాంటి వంకర బుద్ధుల్లో మాత్రం వాడు తండ్రికన్నా మించినవాడు. ఒకవేళ మరి ఇక్కడికి కూడా వస్తే సమాధానం ఏమని చెబుతావ్?” అని అడిగాడు.
రమ కొంచెం అభిమానం తెచ్చుకుని "నేనేమీ చెప్పను. బైట దర్వానే చెప్పి పంపుతాడు.
సమాధానం" అంది.
జపంలో కూర్చునివున్న రమ పింతల్లి వివాదగ్రస్తమూ, అతి రుచికరమూ అయిన ఈ సంభాషణ చెవిని పడగానే ఆ జపం అక్కడితో వదిలేసి లేచి చక్కావచ్చి రమ అంటున్న మాట ఇంకా పూర్తికాకుండానే రుసరుసలాడుతూ, “దర్వాన్ కూడా యెందుకు? నాకేం చెప్పటం చేతకాదనా? అతగాడికి ఎలా చెబుతానో తెలుసా? మళ్ళీ బతికి వుండగా ముఖర్జీల వారి గుమ్మంలోకి వచ్చి తలెత్తకుండా చెబుతాను సమాధానం. నేనేమీ మరిచిపోలేదు. వేణీ! తారిణీ తన యీ కొడుక్కేగా మా రమను చేసుకుందామని ప్రయత్నించింది! అప్పటికి మా యతీన్ పుట్టలేదింకా. యదుముఖర్జీ ఆస్తి యావత్తూ ఇలా అయితే గుప్పిట్లోకి రాబట్టు- కోవచ్చు కదా అని ఎత్తేశాడు. గ్రహించావా వేణీ! ఎప్పుడయితే ఆ ఎత్తు సాగలేదో అప్పుడిహ............
పల్లీసమాజ్ వేణీఘోషాల్ ముఖర్జీలవారి పెరట్లో అడుగెడుతూనే, ఎదురుగా కన్పించిన ఓ ప్రౌఢ స్త్రీని "అత్తా! రమ ఎక్కడున్నది?" అని అడిగాడు. జపం చేసుకుంటూ కూర్చున్న ఆమె వంట ఇంటికేసి, 'అక్కడ' అన్నట్లు వేలితో చూపించింది. వేణీ వంటయింటి గుమ్మం దగ్గరకు వచ్చి నుంచుని “అయితే ఇంతకీ ఏమని నిశ్చయించుకున్నట్లు రమా?” అని అడిగాడు. మండుతున్న పొయ్యిమీదనుంచి చిటపట లాడుతున్న బాణలి కిందకి దించి "ఏ విషయం వేణీదా?" అని అడిగింది రమ. "తారిణీ బాబాయ్ శ్రాద్ధం విషయం రమా! రమేశ్ నిన్ననే వచ్చాడిక్కడికి. తండ్రి శ్రాద్ధం చాలా భారీగా చేయాలని చూస్తున్నాట్ట. వెళతావా మరి నువ్వు?” అంది. రమ ఆశ్చర్యంతో కళ్ళు ఇంతచేసుకుని, “తారిణీ ఘోషాల్ ఇంటికి వెళతానా నేను?” వేణీ కొంచెం తటపటాయిస్తూ “నాకా సంగతి తెలుసు రమా! ఏమయినా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళవని తెలుసు నాకు. అయినా ఇంటింటికీ వాడు స్వయంగా వెళ్ళి పిలిచి వస్తున్నాట్ట! ఇలాంటి వంకర బుద్ధుల్లో మాత్రం వాడు తండ్రికన్నా మించినవాడు. ఒకవేళ మరి ఇక్కడికి కూడా వస్తే సమాధానం ఏమని చెబుతావ్?” అని అడిగాడు. రమ కొంచెం అభిమానం తెచ్చుకుని "నేనేమీ చెప్పను. బైట దర్వానే చెప్పి పంపుతాడు. సమాధానం" అంది. జపంలో కూర్చునివున్న రమ పింతల్లి వివాదగ్రస్తమూ, అతి రుచికరమూ అయిన ఈ సంభాషణ చెవిని పడగానే ఆ జపం అక్కడితో వదిలేసి లేచి చక్కావచ్చి రమ అంటున్న మాట ఇంకా పూర్తికాకుండానే రుసరుసలాడుతూ, “దర్వాన్ కూడా యెందుకు? నాకేం చెప్పటం చేతకాదనా? అతగాడికి ఎలా చెబుతానో తెలుసా? మళ్ళీ బతికి వుండగా ముఖర్జీల వారి గుమ్మంలోకి వచ్చి తలెత్తకుండా చెబుతాను సమాధానం. నేనేమీ మరిచిపోలేదు. వేణీ! తారిణీ తన యీ కొడుక్కేగా మా రమను చేసుకుందామని ప్రయత్నించింది! అప్పటికి మా యతీన్ పుట్టలేదింకా. యదుముఖర్జీ ఆస్తి యావత్తూ ఇలా అయితే గుప్పిట్లోకి రాబట్టు- కోవచ్చు కదా అని ఎత్తేశాడు. గ్రహించావా వేణీ! ఎప్పుడయితే ఆ ఎత్తు సాగలేదో అప్పుడిహ............© 2017,www.logili.com All Rights Reserved.