గృహదహనం
మహిమబాబు పరమమిత్రుడు సురేష్, ఇద్దరూ ఒకేసారి ఎఫ్.ఏ. పరీక్షలో కృతార్థు- లైనారు. సురేష్ వెళ్ళి మెడికల్ కాలేజీలో చేరాడు. మహిమబాబు మాత్రం సిటీ కాలేజీని విడిచిపెట్టలేదు.
అది సురేష్బాబు ఆత్మగౌరవానికి అఘాతమైంది. అన్నాడు: “మహిమ్! బి. ఏలు, యం. ఏలు, ప్యాసైనంతమాత్రాన ఏమీ లాభంలేదని అనేకసార్లు చెప్పారు. ఇప్పటికైనా మించిపోయిందిలేదు! నువ్వు వచ్చి మెడికల్ కాలేజీలో చేరవచ్చు."
“చేరవచ్చు. కాని అందుకయ్యే ఖర్చు విషయం కూడా ఆలోచించాలిగా!" - అన్నాడు నవ్వుతూ మహిమబాబు.
“నీ తలకు మించిన ఖర్చేమీ కాదు. అదీగాక నీకు 'స్కాలర్షిప్' కూడా దొరుకుతుంది.” మహిమబాబు నవ్వి వూరుకున్నాడు.
"నవ్వుతాలు కాదు మహిమ! ఇంకా ఆలస్యం చేసినందువల్ల లాభంలేదు. ఈ వారం లోనే నువ్వు ఎడ్మిట్' కావాలని నా కోరిక. డబ్బు దస్కం సంగతి తరువాత చూసుకోవచ్చు.”
“సరే చూద్దాం.”
“సరే చూద్దాం అని అనటమేగాని - ఎన్నాళ్ళు కలిసి వున్నా నీ ఆంతర్యం మాత్రం నాకు అంతుచిక్కడం లేదుకదా! ఇప్పుడు నీతో రోడ్డుమీద వాదించలేను. కాలేజీ వేళ అయింది. రేపటెల్లుండిలోగా ఈ విషయం తేల్చుకో, అందాకా విడిచిపెట్టను. రేపు ఉదయం నీ గదిలో ఉండు, వస్తాను." - అని చెప్పి సురేష్ గబగబా కాలేజీకి సాగిపోయాడు.
పక్షం గడిచిపోయింది. మహిమబాబు ఎక్కడున్నాడు? అతడు మెడికల్ కాలేజీలో చేరటం ఏమయింది? ఒక ఆదివారంనాడు రెండు ఝాములప్పుడు సురేష్ అతనికోసం వెదకి వెదకి అలసిపోయి చిట్టచివరకు కొందరు బీదవిద్యార్థుల వసతి గృహానికి చేరు కున్నాడు. తిన్నగా పైకి వెళ్ళి చూశాడు. అదొక చిన్నగది. వెలుగుకిరణమైనా లోపలికొచ్చే ఆస్కారం ఎక్కడాలేదు. చినిగిపోయిన పాత దర్భాసనాలు పరుచుకొని ఏడెనిమిది మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. మహిమబాబు తలెత్తి మిత్రుని చూశాడు...........
గృహదహనం మహిమబాబు పరమమిత్రుడు సురేష్, ఇద్దరూ ఒకేసారి ఎఫ్.ఏ. పరీక్షలో కృతార్థు- లైనారు. సురేష్ వెళ్ళి మెడికల్ కాలేజీలో చేరాడు. మహిమబాబు మాత్రం సిటీ కాలేజీని విడిచిపెట్టలేదు. అది సురేష్బాబు ఆత్మగౌరవానికి అఘాతమైంది. అన్నాడు: “మహిమ్! బి. ఏలు, యం. ఏలు, ప్యాసైనంతమాత్రాన ఏమీ లాభంలేదని అనేకసార్లు చెప్పారు. ఇప్పటికైనా మించిపోయిందిలేదు! నువ్వు వచ్చి మెడికల్ కాలేజీలో చేరవచ్చు." “చేరవచ్చు. కాని అందుకయ్యే ఖర్చు విషయం కూడా ఆలోచించాలిగా!" - అన్నాడు నవ్వుతూ మహిమబాబు. “నీ తలకు మించిన ఖర్చేమీ కాదు. అదీగాక నీకు 'స్కాలర్షిప్' కూడా దొరుకుతుంది.” మహిమబాబు నవ్వి వూరుకున్నాడు. "నవ్వుతాలు కాదు మహిమ! ఇంకా ఆలస్యం చేసినందువల్ల లాభంలేదు. ఈ వారం లోనే నువ్వు ఎడ్మిట్' కావాలని నా కోరిక. డబ్బు దస్కం సంగతి తరువాత చూసుకోవచ్చు.” “సరే చూద్దాం.” “సరే చూద్దాం అని అనటమేగాని - ఎన్నాళ్ళు కలిసి వున్నా నీ ఆంతర్యం మాత్రం నాకు అంతుచిక్కడం లేదుకదా! ఇప్పుడు నీతో రోడ్డుమీద వాదించలేను. కాలేజీ వేళ అయింది. రేపటెల్లుండిలోగా ఈ విషయం తేల్చుకో, అందాకా విడిచిపెట్టను. రేపు ఉదయం నీ గదిలో ఉండు, వస్తాను." - అని చెప్పి సురేష్ గబగబా కాలేజీకి సాగిపోయాడు. పక్షం గడిచిపోయింది. మహిమబాబు ఎక్కడున్నాడు? అతడు మెడికల్ కాలేజీలో చేరటం ఏమయింది? ఒక ఆదివారంనాడు రెండు ఝాములప్పుడు సురేష్ అతనికోసం వెదకి వెదకి అలసిపోయి చిట్టచివరకు కొందరు బీదవిద్యార్థుల వసతి గృహానికి చేరు కున్నాడు. తిన్నగా పైకి వెళ్ళి చూశాడు. అదొక చిన్నగది. వెలుగుకిరణమైనా లోపలికొచ్చే ఆస్కారం ఎక్కడాలేదు. చినిగిపోయిన పాత దర్భాసనాలు పరుచుకొని ఏడెనిమిది మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. మహిమబాబు తలెత్తి మిత్రుని చూశాడు...........© 2017,www.logili.com All Rights Reserved.