ఎవ్వరీమెకు సాటి
ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు కవిత్వం మరియు విమర్శ రంగంలో అనేక గ్రంథాలు వెలువరించారు. అయితే కేవలం రచయితగా రాసుకొంటూ వెళ్ళిపోవటమే కాకుండా "లో చూపు” తో పరిశోధనాత్మకంగా రాయటం వారి ప్రత్యేకత. ఒక రచయిత విమర్శకుడు కూడా అయితే - ఒక విమర్శకుడు రచయిత కూడా అయితే ఎంత ప్రయోజనం ఉంటుందో భూమయ్య గారి రచనలు చదివితే తెలుస్తుంది.
ఒక కౌసల్య, ఒక త్రిజట, ఒక కబంధుడు, ఒక మకరి... యథాతథంగా పూర్వ కావ్యాలలో సృజింపబడినట్టు కాకుండా - వీరి కలం లోంచి కొత్త రూపు ధరించి, పాఠకుల ముందు నిలుస్తారు. తమ ఆవేదనని వెల్లడించి "ఏమంటారు” అని ప్రశ్నిస్తారు. "ఇలా కూడా ఆలోచించండి, న్యాయం చెప్పండి" అంటారు.
గతానుగతికంగా వచ్చిన కావ్యాలని ఆయా కవుల భావాలలోనే పఠించి, అదే ధోరణిలో ఆలోచించిన పాఠకుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి, 'ఈ కోణంలో నేనెందుకు ఆలోచించలేక పోయాను' అనుకొంటాడు. ఆ విధంగా ఆలోచించి ఆవిష్కరించిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి భావనకు "భేష్” అని కితాబు ఇవ్వకమానడు.
అదుగో అలాంటి పరంపరలో వచ్చిన మరో పాత్ర "సత్యభామ”.
సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలు ఆస్థానం లోని అష్టదిగ్గజాల లోని నంది తిమ్మన విరచిత "పారిజాతాప హరణం"లో సత్యభామ ఒక సౌందర్య రాశిగా శృంగార భామగా, శ్రీకృష్ణుని ఇష్టసఖిగా, సవతుల పట్ల.................
ఎవ్వరీమెకు సాటి ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు కవిత్వం మరియు విమర్శ రంగంలో అనేక గ్రంథాలు వెలువరించారు. అయితే కేవలం రచయితగా రాసుకొంటూ వెళ్ళిపోవటమే కాకుండా "లో చూపు” తో పరిశోధనాత్మకంగా రాయటం వారి ప్రత్యేకత. ఒక రచయిత విమర్శకుడు కూడా అయితే - ఒక విమర్శకుడు రచయిత కూడా అయితే ఎంత ప్రయోజనం ఉంటుందో భూమయ్య గారి రచనలు చదివితే తెలుస్తుంది. ఒక కౌసల్య, ఒక త్రిజట, ఒక కబంధుడు, ఒక మకరి... యథాతథంగా పూర్వ కావ్యాలలో సృజింపబడినట్టు కాకుండా - వీరి కలం లోంచి కొత్త రూపు ధరించి, పాఠకుల ముందు నిలుస్తారు. తమ ఆవేదనని వెల్లడించి "ఏమంటారు” అని ప్రశ్నిస్తారు. "ఇలా కూడా ఆలోచించండి, న్యాయం చెప్పండి" అంటారు. గతానుగతికంగా వచ్చిన కావ్యాలని ఆయా కవుల భావాలలోనే పఠించి, అదే ధోరణిలో ఆలోచించిన పాఠకుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి, 'ఈ కోణంలో నేనెందుకు ఆలోచించలేక పోయాను' అనుకొంటాడు. ఆ విధంగా ఆలోచించి ఆవిష్కరించిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి భావనకు "భేష్” అని కితాబు ఇవ్వకమానడు. అదుగో అలాంటి పరంపరలో వచ్చిన మరో పాత్ర "సత్యభామ”. సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలు ఆస్థానం లోని అష్టదిగ్గజాల లోని నంది తిమ్మన విరచిత "పారిజాతాప హరణం"లో సత్యభామ ఒక సౌందర్య రాశిగా శృంగార భామగా, శ్రీకృష్ణుని ఇష్టసఖిగా, సవతుల పట్ల.................© 2017,www.logili.com All Rights Reserved.