Abhayam

By Simhaprasad (Author)
Rs.120
Rs.120

Abhayam
INR
MANIMN4525
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ప్రమాదంలో ప్రజారోగ్యం

2020 నాటికి దేశవ్యాప్తంగా "ప్రజలందరికీ ఆరోగ్యం" అన్న నినాదం రూపు దిద్దుకుంటున్న తొలిరోజుల్లోనే ఆర్థిక సంస్కరణలు ప్రవేశించాయి. అందరికీ ఉచితంగా విద్య, వైద్యం, అందజేయాల్సిన ప్రభుత్వాలు క్రమంగా ఆ పని నుండి తప్పుకుంటూ, ఓ పథకం ప్రకారం ప్రభుత్వ సంస్థలను నాశనం చేస్తూ ప్రైవేటీకరణ వైపుకు దారితీశాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలులో వున్న వైద్యం నమూనా వల్ల మొత్తం ప్రజారోగ్యానికే ప్రమాదం వచ్చి పడింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పట్టాలు పుచ్చుకునే వైద్యులలో అత్యధికశాతం ప్రైవేట్ రంగంలో పని చేస్తున్నారు. వారికిచ్చే శిక్షణ ప్రైవేట్ రంగంలో పని చేయడానికి ఉద్దేశించిందే. ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశానికి అత్యధిక స్థాయిలో మార్కులు సంపాదించడానికి వెంపర్లాడేవాళ్ళు. అవే కళాశాలల్లో సీట్లు సంపాయించలేక, లక్షలు గుమ్మరించి ప్రైవేట్ కళాశాలల్లో చదివేవాళ్ళు, ప్రజారోగ్య పరిరక్షణకు అంకితం కాలేరు. దీంతో వైద్య వృత్తిలోకి ప్రస్తుతం ప్రవేశిస్తున్నవాళ్ళు, తాము చదువుకు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు.

నగరాలకే పరిమితమైన సంపన్న వర్గాల జీవితాలపై, వైద్య రంగంలో వచ్చిన శాస్త్ర సాంకేతికాల ప్రభావం అనూహ్యంగా పెరిగిపోయి అనవసర పరీక్షలు, అపరిమితమైన మందులు వాడకానికి దారితీస్తున్నాయి. సర్జరీ సైతం ఈ కోవలోకే వస్తుంది. అధునిక యంత్ర సాధనాల పని తీరుతో నిమిత్తం లేకుండా వాటిని చికిత్స సందర్భంగా వినియోగించుకోవాలని రోగులపై వత్తిడి పెరిగిపోతున్నది. ఈ చికిత్సలు, పరీక్షల సందర్భంగా సంభవించే ఇతరేతర ప్రమాదాలను ప్రజలకు, రోగులకు కూడా చెప్పడం లేదు. అదే పశ్చిమ దేశాలలో పత్రికలు వీటిని ఎప్పటికప్పుడు ప్రచురిస్తుంటాయి. అక్రమ సంపాదన వల్ల అందుబాటులో వుండే లక్షల కొద్ది డబ్బు వల్ల తమకు తెలియకుండానే సంపన్నవర్గం, డాక్టర్లు సృష్టించే రోగాల బారిన పడే ప్రమాదంలో పడిపోయింది. ఈ పరిణామానికి మన వైద్యరంగంలో వచ్చిపడుతున్న ఆధునిక స్కానింగ్......................

ప్రమాదంలో ప్రజారోగ్యం 2020 నాటికి దేశవ్యాప్తంగా "ప్రజలందరికీ ఆరోగ్యం" అన్న నినాదం రూపు దిద్దుకుంటున్న తొలిరోజుల్లోనే ఆర్థిక సంస్కరణలు ప్రవేశించాయి. అందరికీ ఉచితంగా విద్య, వైద్యం, అందజేయాల్సిన ప్రభుత్వాలు క్రమంగా ఆ పని నుండి తప్పుకుంటూ, ఓ పథకం ప్రకారం ప్రభుత్వ సంస్థలను నాశనం చేస్తూ ప్రైవేటీకరణ వైపుకు దారితీశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలులో వున్న వైద్యం నమూనా వల్ల మొత్తం ప్రజారోగ్యానికే ప్రమాదం వచ్చి పడింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పట్టాలు పుచ్చుకునే వైద్యులలో అత్యధికశాతం ప్రైవేట్ రంగంలో పని చేస్తున్నారు. వారికిచ్చే శిక్షణ ప్రైవేట్ రంగంలో పని చేయడానికి ఉద్దేశించిందే. ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశానికి అత్యధిక స్థాయిలో మార్కులు సంపాదించడానికి వెంపర్లాడేవాళ్ళు. అవే కళాశాలల్లో సీట్లు సంపాయించలేక, లక్షలు గుమ్మరించి ప్రైవేట్ కళాశాలల్లో చదివేవాళ్ళు, ప్రజారోగ్య పరిరక్షణకు అంకితం కాలేరు. దీంతో వైద్య వృత్తిలోకి ప్రస్తుతం ప్రవేశిస్తున్నవాళ్ళు, తాము చదువుకు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. నగరాలకే పరిమితమైన సంపన్న వర్గాల జీవితాలపై, వైద్య రంగంలో వచ్చిన శాస్త్ర సాంకేతికాల ప్రభావం అనూహ్యంగా పెరిగిపోయి అనవసర పరీక్షలు, అపరిమితమైన మందులు వాడకానికి దారితీస్తున్నాయి. సర్జరీ సైతం ఈ కోవలోకే వస్తుంది. అధునిక యంత్ర సాధనాల పని తీరుతో నిమిత్తం లేకుండా వాటిని చికిత్స సందర్భంగా వినియోగించుకోవాలని రోగులపై వత్తిడి పెరిగిపోతున్నది. ఈ చికిత్సలు, పరీక్షల సందర్భంగా సంభవించే ఇతరేతర ప్రమాదాలను ప్రజలకు, రోగులకు కూడా చెప్పడం లేదు. అదే పశ్చిమ దేశాలలో పత్రికలు వీటిని ఎప్పటికప్పుడు ప్రచురిస్తుంటాయి. అక్రమ సంపాదన వల్ల అందుబాటులో వుండే లక్షల కొద్ది డబ్బు వల్ల తమకు తెలియకుండానే సంపన్నవర్గం, డాక్టర్లు సృష్టించే రోగాల బారిన పడే ప్రమాదంలో పడిపోయింది. ఈ పరిణామానికి మన వైద్యరంగంలో వచ్చిపడుతున్న ఆధునిక స్కానింగ్......................

Features

  • : Abhayam
  • : Simhaprasad
  • : Navodaya Book House
  • : MANIMN4525
  • : Paperback
  • : March, 2019
  • : 200
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Abhayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam